బిజినెస్

పసిడి నగదీకరణ పథకంలోకి 900 కిలోల బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా 900 కిలోలకుపైగా బంగారాన్ని సేకరించినట్లు కేంద్ర ప్రభుత్వ శనివారం వెల్లడించింది. గృహస్తులు, ఆలయాల నుంచి ఈ మొత్తం పుత్తడిని అందుకున్నట్లు తెలిపిన సర్కారు.. భవిష్యత్తులో ఇది మరింత పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘పసిడి నగదీకరణ పథకం ద్వారా ఇప్పటిదాకా 900 కిలోలకుపైగా బంగారాన్ని అందుకున్నాం. ఈ పథకానికి చాలామంది ఆకర్షితులవుతున్నారు. రాబోయే నెలల్లో మరింతగా ఈ పథకం ద్వారా బంగారాన్ని సేకరించగలం.’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిజానికి ఈ పసిడి నగదీకరణ పథకం ఇంతకుముందు అంతగా సఫలం కాలేదు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. గత ఏడాది నవంబర్ 5న ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులోభాగంగా బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి వాటిపై వడ్డీని పొందే సౌకర్యం డిపాజిటర్లకు లభించింది. ఏటా 2.50 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఇలా గరిష్ఠంగా పదిహేనేళ్ల వరకు అందుకోవచ్చు. అయితే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల కంటే ఈ వడ్డీరేటు తక్కువ.