బిజినెస్

రూ.50 వేలు పైబడిన చెల్లింపులకు ‘పాన్’ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నల్లధన సమస్యను అరికట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం ఇక మీదట 50 వేల రూపాయలు దాటిన హోటల్, విదేశీ పర్యటనలు తదితర బిల్లులకు సంబంధించిన లావాదేవీల్లో పాన్ (పర్మినెంట్ యాక్సెస్ నెంబర్) సమర్పించడం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచే అమలులోకి వస్తుంది. వీటితో పాటు 2016 జనవరి 1వ తేదీ నుంచి నగదు చెల్లింపులు లేదా కార్డుల ద్వారా జరిపే ఆభరణాల కొనుగోళ్లు, ఇతర లావాదేవీలు 2 లక్షల రూపాయలు దాటినట్లయితే విధిగా పాన్ నెంబర్ సమర్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అలాగే 10 లక్షల రూపాయలకు పైగా విలువచేసే స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు కూడా తప్పనిసరిగా పాన్ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు రూ.5 లక్షలు దాటితే విధిగా పాన్ నెంబర్‌ను సమర్పించాలని గతంలో ప్రతిపాదించిన ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో చిన్న చిన్న ఇళ్లు కొనుగోలు చేసుకునే సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుంది. అలాగే బాంకులు, పోస్ట్ఫాసులు, ఎన్‌బిఎఫ్‌సిల్లో ఒకేసారి 50 వేల రూపాయలు, లేదా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు టెర్మ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే వారు కూడా విధిగా పాన్ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నగదు లేదా కార్డులను ఉపయోగించి 50 వేల రూపాయలకు పైగా చెల్లింపులు జరిపేవారు, లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేవారు ఇకమీదట తప్పనిసరిగా పాన్ నెంబర్‌ను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అలాగే ప్రధాన మంత్రి జనధన యోజన ఖాతాలు మినహా ఇతర బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు కూడా విధిగా పాన్ నెంబర్‌ను సమర్పించాలని ఆర్థిక శాఖ పేర్కొంది.