ఆటాపోటీ

ఇదేం కోరిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్ సింక్రనైజ్డ్ స్విమ్మర్లు బియా ఫెరెస్, బ్రాన్కా ఫెరెస్ కవలలు. ఇద్దరూ డ్రైవర్లే. పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో సింక్రనైజ్డ్ టీం విభాగంలో పోటీపడుతున్నారు. ఒకరికొకరుగా జీవిస్తున్న ఈ ఇద్దరూ ఒకే రకమైన ఉద్యోగం కోరుకుంటున్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా చేయబోమని రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు ప్రకటించారు. ఉద్యోగం ముఖ్యంగానీ, ఒకే రకమైన ఉద్యోగం ఇద్దరికీ ఎవరిస్తారని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇదేం కోరిక అంటూ వివిధ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరూ ఒకరినే పెళ్లి చేసుకుంటామని కూడా అంటారేమో అని మరికొంత మంది చమత్కరిస్తున్నారు. ఎవరేమనుకున్నా, ఇద్దరికీ ఒకే ఉద్యోగం అన్న డిమాండ్‌ను మార్చుకునేది లేదని బియా, బ్రాన్కా స్పష్టం చేస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

నేనే కింగ్!

జిమ్నాస్టిక్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పామెల్ హార్స్ విభాగమంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది డాంగ్‌హువా లీ పేరే. ‘పామెల్ హార్స్ హీరో’గా పేరు తెచ్చుకున్న అతను 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత, రియో ఒలింపిక్స్‌ను తిలకించడానికి వచ్చిన అతను కొంత సేపు పామెల్ హార్స్‌పై విన్యాసాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ విభాగంలో తనను మించిన వారు లేరని నిరూపించుకున్నాడు. 48 ఏళ్ల లీ ఖాతాలో 1995 ప్రపంచ చాంపియన్‌షిప్స్ స్వర్ణ పతకం కూడా ఉంది.

లేటు వయసులో

అమెరికా స్విమ్మర్ ఆంథోనీ ఇర్విన్ వయసు 35 సంవత్సరాలు. అంతర్జాతీయ స్విమ్మింగ్‌లో నెలకొన్న తీవ్రమైన పోటీని పరిగణలోకి తీసుకుంటే, ఈ వయసులో రాణించడం, పతకాలు సాధించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, ఇర్విన్ మాత్రం ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపించాడు. రియో ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడిన అతను 21.40 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఒలింపిక్స్‌లో అతనికి ఇది రెండో స్వర్ణం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అతను 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. 4న100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో రజత పతకాన్ని అందుకున్నాడు. 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అతను మరోసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరెంట్ మనోడో 21.41 సెకన్లతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, అమెరికాకే చెందిన నాథన్ ఆడ్రినస్ 21.49 సెకన్లతో కాంస్య పతకాన్ని స్వీకరించాడు.

-సత్య