ఆటాపోటీ

సవ్యసాచి మనోజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్‌ను సవ్యసాచిగా పేర్కోవాలి. అతను రెండు చేతులతో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేస్తాడనికాదు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు కాబట్టే ఆ పేరును సార్థం చేసుకున్నాడు. వనే్డల్లో అతను ఓపెనర్‌గానేగాక, బౌలింగ్‌లోనూ మొదటి ఓవర్ వేసిన మ్యాచ్‌లు 45 ఉన్నాయి. ఈ జాబితాలో మనోజ్‌ది అగ్రస్థానం. రెండో స్థానంలో జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ నీల్ జాన్సన్ ఉన్నాడు. అతను 25 పర్యాయాలు ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసి, పేసర్‌గా తొలి ఓవర్‌ను వేసి మూడో స్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో కొలంబోలో జరిగిన వనే్డలో తిలకరత్నే దిల్షాన్ కూడా ఈ విధంగా ఓపెనర్‌గా, తొలి ఓవర్‌ను వేసిన బౌలర్‌గా ద్విపాత్రాభినయం చేశాడు.

క్యాచ్ పట్టగలవా..
స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొని, శిక్షా కాలం పూర్తి చేసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌ను ఇప్పుడు అంతా ‘క్యాచ్ పట్టగలవా’ అంటూ ఆటపట్టిస్తున్నారట. అందుకు కారణం లేకపోలేదు. అతను ఇప్పటి వరకూ ఆడిన 18 టెస్టుల్లో ఒక్క క్యాచ్ కూడా అందుకోలేదు. అయితే, క్యాచ్‌లు పట్టకుండా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రికార్డు ఆస్ట్రేలియా పేసర్ పీటర్ సిడిల్ పేరిట ఉంది. అతను 24 టెస్టుల్లో ఒక్క క్యాచ్‌ని కూడా పట్టుకోలేదు. చివరికి, 2013లో శ్రీలంకతో జరిగిన టెస్టులో రంగన హెరాత్ క్యాచ్‌ని అందుకొని, ఖాతా తెరిచాడు. మరి అమీర్ ఎప్పుడు క్యాచ్‌ల ఖాతాను మొదలు పెడతాడో చూడాలి.

లోస్కోరింగ్ టెస్టు
టెస్టు క్రికెట్ చరిత్రలో నమోదైన లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 1887లో జరిగిన మ్యాచ్ ఒకటి. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 13 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కోలుకోలేక, 45 పరుగులకు ఆలౌటైంది. ఆయితే, ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి, విజయభేరి మోగించడం ఈ మ్యాచ్‌లో కొసమెరుపు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జి లోమన్ (17) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగలిగాడు. ఆస్ట్రేలియా కూడా గొప్పగా ఆడలేక, 119 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కొద్దిగా కోలుకొని 184 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఈ మాత్రం స్కోరు కూడా చేయలేకపోయిన ఆస్ట్రేలియా 97 పరుగులకే కుప్పకూలింది. ఈ లోస్కోరింగ్ టెస్టులో ఇంగ్లాండ్ ఎవరూ ఊహించని విధంగా 13 పరుగుల తేడాతో గెలిచింది.

- సత్య