రచ్చ బండ

కాంగ్రెస్ కనె్నర్ర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఫిరాయింపులు చూస్తుంటే, దేశంలోనే ఎక్కడా, ఎప్పుడు జరగలేదు. ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. దీనిని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయలేకపోతున్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి టిడిపి నుంచి ఇప్పటికే డజను మంది ఎమ్మెల్యేలు చేరగా, కాంగ్రెస్ నుంచి తాజాగా చేరిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డితో కలుపుకుని ఐదుగురు ఎమ్మెల్యేలు చేరారు. దీనిపై కాంగ్రెస్ కనె్నర్ర చేస్తున్నది. ఇది అనైతికమని విమర్శిస్తోంది. తెలుగు దేశం పార్టీ తెలంగాణ సైకిల్‌ను తుక్కుతుక్కు చేసి ‘కారు’ డిక్కీలో వేసుకున్న టిఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌పై కనే్నసిందని ఆ పార్టీ కనె్నర్ర చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కోరం కనకయ్య (ఇల్లెందు), విఠల్ రెడ్డి (ముధోల్), కాలె యాదయ్య (చేవెళ్ళ), రెడ్యూ నాయక్ (డోర్నకల్), చిట్టెం రాంమోహన్ రెడ్డి (మక్తల్) పార్టీ ఫిరాయించారు. చిట్టెం చేరిక రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌ను కలవరపరిచింది. కారణం చిట్టెం రాంమోహన్ రెడ్డి, లోగడ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ఘర్షణపడ్డారు. ఆ సమయంలో గువ్వల ఆయనపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారక నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబోగా, రెండు పార్టీల ముఖ్య నేతలు కల్పించుకుని వారికి నచ్చజెప్పారు. పైగా చిట్టెం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణకు స్వయాన తోడబుట్టిన సోదరుడు. ఇద్దరూ ఒక గుట్టుమీద ఉంటారు. అటువంటిది చడీ చప్పుడు లేకుండా గులాబీ గూటికి చేరారు. చిట్టెం రాంమోహన్ రెడ్డి తండ్రి దివంగత సి. నర్సిరెడ్డి అప్పట్లో జనతా పార్టీ నుంచి గెలుపొందారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన వ్యక్తి నర్సిరెడ్డి. ఆయనంటే రాజకీయాల్లో అందరికీ గౌరవం. అటువంటిది ఆయన తనయుడు చిట్టెం రాంమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించి తండ్రి ఆత్మ క్షోభించేలా చేశారని చిట్టెం సోదరి డికె అరుణ దుయ్యబట్టారు.
ఈ చేరిక తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ‘షాక్’ కలిగించింది. చిట్టెం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి పార్టీలో చేరారు. రకరకాల కారణాల వల్ల పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందని చిట్టెం వాదన. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదు, పైగా టిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఇన్‌ఛార్జీ ఉండడం వల్ల ఎమ్మెల్యేగా తనకు గుర్తింపు లభించడం లేదని, నియోజకవర్గంలో వివిధ సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల వంటి పనులు కోసం ప్రజలు ఎమ్మెల్యే వద్దకు రాకుండా టిఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీ వద్దకు వెళుతుండడం, దీంతో కాంగ్రెస్ కంటే ఎక్కువ టిఆర్‌ఎస్ బలపడుతున్నదన్న సంకేతాలు వినిపిస్తుండడం, వచ్చే ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థి రంగంలో ఉంటే తన భవిష్యత్తు ఏమిటీ? అని భావించారు. ఇప్పుడే కనుక టిఆర్‌ఎస్‌లో చేరకపోతే వెనుకబడిపోతామని, ఎన్నికల ముందు చేరాలనుకున్నా, టిక్కెట్ ఇవ్వలేమని చేతులెత్తేసి, టిఆర్‌ఎస్ కోసం పని చేసిన నాయకునికే ఇస్తామని చెబితే చేయగలిగిందేమి ఉండదని ఆయన భావించి ఈ అడుగు వేశారు. ఈ విషయంలో చిట్టెం రాంమోహన్ రెడ్డి తన సోదరి ఎమ్మెల్యే డికె అరుణతో చర్చించలేదు. కానీ మూడు నెలల క్రితం చిట్టెం ఉగాది తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా, కాంగ్రెస్ నేతలకు మాత్రం వాసన తగలలేదట.
సార్వత్రిక ఎన్నికల్లో బిఎస్‌పి నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరి, పార్టీని విలీ నం చేసినట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలో కాశి వెంకటేశ్వర రావు (అశ్వారావుపేట), మదన్‌లాల్ నాయక్ (వైరా) టిఆర్‌ఎస్‌లో ఇదివరకే చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 27న ‘ప్లీనరీ’ నిర్వహించనున్నది. ఈ ప్లీనరీలోగా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కూడా టిఆర్‌ఎస్‌లో చేర్చుకుని, తెలంగాణలో మొత్తం ఆ పార్టీకి ఉనికి లేకుండా చేస్తారేమోనన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణ తెలుగు దేశం పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో, ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ముగ్గురిలో ఒక ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య బిసి కులాల ఐక్య వేదిక వంటి సంఘాలు, నిరుద్యోగుల సంఘాల కార్యకలాపాలతో బిజీగా ఉం టూ పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.
బిజెపి, మజ్లిస్ పార్టీలు మినహా అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగాయి. ఇది అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ మండిపడుతోంది. నిజమే, రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏదైనా తమ వరకు వస్తే కానీ తెలియదన్నట్లు ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది యదార్థం. 93 బిసి కులాల ఐక్య వేదిక నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ ‘విప్’ను ధిక్కరించి కాసాని నామినేషన్ పత్రంలో సంతకం చేసి అభ్యర్థిత్వాన్ని బలపరిచి, గెలిపించారు. ఇదంతా కాంగ్రెస్ అండతోనే జరిగింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్పపుడు బాధపడే కంటే, అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించకుండా, కళ్ళెం వేయాలి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి