రాజమండ్రి

జ్ఞానజ్యోతి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.
‘‘అమ్మా నళినీ... కోపగించుకోకమ్మా. ఏం చేయను చెప్పు మంచం పట్టిన వాడిని. ఏదో అలా పిలుస్తుంటాను. నాకంటే ముందుగా దాన్ని తీసుకుపోయి నాకు అన్యాయం చేసాడా భగవంతుడు’’ నిస్సహాయంగా చెప్పారు ఆయన.
ఆయన ఒకప్పుడు పేరు మోసిన క్రిమినల్ లాయర్. ఆయన గురించి తెలియని వారుండేవారు కాదు. అప్పట్లో ఆయన ఇల్లు వచ్చేపోయే వాళ్లతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. భార్య యశోదమ్మ ఇంటికి వచ్చిన వారికి కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు పెడుతూనే ఉండేది. ఖర్చులకు వెనుకాడేవారు కాదు ఆ దంపతులు.
మూడేళ్ల కిందట యశోదమ్మ బాత్రూంలో పడిపోయిన సందర్భంలో ఆమె కాలుపై కంటా విరిగిందన్నారు. కట్టు వేశారు డాక్టర్లు. ఆమె మంచం పట్టినట్లే ఇంచుమించు. ఆనాటి నుండి ఆవిడ బాధంతా భర్త గురించే. ‘నేను బతికి ఉండుగానే ఆయనకి కోడలు ఏమీ అమర్చడం లేదు. ఇక నేను పోతే ఆయన్ని పట్టించుకునే అతీగతీ చూసేవారు ఉండరని ఎంతగానో బెంగపడిపోయింది యశోదమ్మ.
హైదరాబాదులో ఉన్న ఇద్దరు కొడుకులలో ఒకరి వద్దనైనా ఉందామంటే వాళ్లు ఈ కోడల్ని మించిపోయే రకాలు. ఎందుకంటే రెండవ కొడుకు లాయరు. మూడవ కొడుకు ఇంజనీరు. ఎటొచ్చీ ఇక్కడున్న పెద్ద కొడుకే కాణీ సంపాదన లేనివాడు కాబట్టి ఈ మాత్రం అయినా పలుకుతోంది.
అంతులేని ఆలోచనలతో మంచంలో నిస్సహాయంగా ఉండి లోలోన కుమిలిపోతూనే ఉంది యశోదమ్మ. ఆ భార్యాభర్తల అనుబంధం అటువంటిది.
‘‘నేను పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా పోవాలనే నా ఆశ. నన్ను క్షమించండి’’ అంటూ ఆవిడ ఓ రోజు అర్ధంతరంగా కన్ను మూసింది.
రెట్టింపు ఉత్సాహంతో, మెలకువలతో, ఎనలేని తెలివితేటలతో ఎంతటి క్లిష్టమైన కేసునైనా సునాయాశంగా వాదించగలిగే మూర్తిగారు భార్య పోయిన రోజు నుండి ఆ నల్లకోటు ముట్టనని ఒట్టు పెట్టుకుని వృత్తికి స్వస్తి చెప్పి ఏదో అవసరానికి తప్ప ఇల్లు కదలడం మానేశారు.
కర్మకాండ ముగిసిన తర్వాత ఈ స్థలం మారితే మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది. మాతో వచ్చి నా దగ్గర కొన్నాళ్లు ఉందురు గాని బయలుదేరండి నాన్నగారు’’ అని రెండవ కొడుకు రామన్ ఎంతో బలవంతం చేశాడు. అయినా అతనికి ఇష్టం లేకపోయింది.
‘‘వద్దు నాన్నా. నాకు సెల్ ఉంది. మీకూ ఉన్నాయి. రోజూ మీరు ఫోన్ చేస్తుండండి. మీ అమ్మ పోయిన ఈ ఇంట్లోనే నేను పోవాలి. పెద్దన్నయ్య మోహన్, కోడలు ఉన్నారు కదా. నన్ను ఇబ్బంది పెట్టొదు’’ అని వాళ్లకి నచ్చజెప్పి పంపించేశారు.
మనిషి ఏ స్థితిలో ఉన్నా ఆగనిది, ఆపలేనిది కాలం ఒక్కటే. యశోదమ్మ సంవత్సరీకం దగ్గర పడింది. ఆ ఖర్చంతా మేం ఇద్దరం భరిస్తాం అని కొడుకులిద్దరూ ఎంత చెప్పినా మూర్తిగారు సమ్మతించలేదు.
‘‘మీరిద్దరూ పెట్టగలరని, పెద్దవాడు మోహన్ అందుకు ఆర్థిక పుష్టిలేని వాడనీ నాకు తెలుసు. కానీ మీ అమ్మ కార్యం నా సంపాదనతోనే చేయనివ్వండి బాబూ’’ అని వాళ్లని వారించారు.
పెద్దవాడు మోహన్ చేత యశోదమ్మ కార్యం నిమిత్తం బ్యాంకు నుండి డబ్బు తెప్పించి ఉంచారు మూర్తిగారు. అందరినీ ఆహ్వానించి అతి ఘనంగా చేయించారు. తన భార్య పుణ్యస్ర్తిగా చనిపోవడం చాలా అదృష్టం చేసుకుందనే అనుకున్నారు. వెంటనే అనిపించింది భార్య లేని భర్తల బతుకులు ఈ పెద్ద వయసులో తల్లికి దూరమైన చంటి పిల్లాడిలా ఉంటుందని. కళ్లు చెమర్చాయి.
నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కొడుకులు రామన్, అశోక్‌లను ఉద్దేశించి అన్నారు.
‘‘అమ్మ బంగారం ముగ్గురు కోడళ్లకి ఇచ్చేస్తాను. నా పేరున ఉన్న డబ్బు మీకు ముగ్గురికీ తర్వాత ఇస్తాను. ఇంక ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలనేది నేనింకా నిర్ణయించుకోలేదు. పెద్దవాడి ఇద్దరు కొడుకుల పేరు రాద్దామనుకుంటున్నాను. అమ్ముకునే అర్హత పెద్ద మనుమడికే ఉంటుందని వీలు రాద్దామనుకుంటున్నాను. ఎందుకంటే దీనిపై వచ్చే అద్దెతోనైనా పెద్దాడి కొడుకుల చదువులు పూర్తవుతాయి. తండ్రిలా కాకుండా వాళ్లయినా చదివి మంచిగా సెటిల్ అవుతారని’’ అన్నారు కొడుకుల వైపు చూస్తూ.
తండ్రి చెప్పిన ఆస్తి వివరాలు విని అంత డబ్బు తెచ్చుకుంటున్న వారైనా అంత ఇంటిని అన్నయ్య పిల్లలకే రాయాలనుకోవడం, కొంచెం ఈర్ష్యను కలిగించింది వాళ్ల మనసుల్లో. అయినా ఎవరూ బయటపడలేదు.
తన వయసును కూడా చేసుకునే టైము లేకుండా కోర్టు, కేసులు, క్లయింట్లు అంటూ హుషారుగా తిరిగే తనకి పిల్లలందరూ వెళ్లిపోయాక భార్య లేకపోవడంతో వయసు బాగా పైబడినట్లుగా అయిందేమిటి అనుకున్నారు మూర్తిగారు.
దాంతో కోడలు భోజన సదుపాయం చేయక రెండు అప్పడాల్లాంటి రొట్టెలు చేసి పడేస్తుంటే తినలేక ఒక రోజు తిన్నట్లు ఒకరోజు తినకుండా చేస్తున్నారు. శరీరంలో శక్తి హరించుకుపోయి రోజురోజుకీ కుంగిపోతున్నారు. కరవు తీరా ఏడవాలని ఉన్నా మగాడిగా ఆ పని చేయలేకపోతున్నారు.
ఒకరోజు తనకి చాలా సన్నిహితుడు భాస్కరరావు మూర్తిగారిని కలవడానికి వచ్చారు.
ఇద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. భాస్కరరావు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆత్రుతపడసాగాడు. అటు ఇటు చూసి ‘‘మూర్తిగారూ మీరు ఏయే బ్యాంకుల్లో ఎఫ్‌డిలు అవీ దాచారో, ఎంత సొమ్ము దాచారో అవన్నీ తీసేసారట. మీ పెద్దబ్బాయి జాయింట్ అకౌంట్ పెట్టడం వలన మీ అబ్బాయే మెచ్యూర్ అవగానే ఈ పని చేశారట. బ్యాంకులో ఉద్యోగి ఒకాయన నాకు చెప్పి మీకు తెలియజేయమన్నారు’’ అనగానే మూర్తిగారి గుండె తట్టుకోలేకపోయింది.
‘‘మీరు బయటికి వెళ్లడం మానేసి మీ పెద్ద కొడుకుని నమ్మారు. నమ్మకాన్ని వమ్ము చేశాడు’’ అన్నాడు భాస్కరరావు.
అతని మాటలు విని మూర్తిగారు ఖంగుతిన్నారు.
‘బతికినంత కాలం వాడు, వాడి పిల్లల గురించే ఆలోచించాను. ఎందుకిలా చేశాడు’ పరిపరి విధాలా బాధపడ్డారు మూర్తిగారు.
ఎప్పటిలా ఉదయం అయింది. కానీ రోజులా నళినీ అంటూ అదే పనిగా కోడల్ని పిలిచే మూర్తిగారు పిలవలేదు. నళిని వెళ్లి చూసింది. ఆయన శరీరం చల్లగా తగిలింది. ఆయన హఠాత్తుగా చనిపోవడం ఎవరూ తట్టుకోలేకపోయారు.
కొడుకులు వచ్చారు.
మూర్తిగారి స్నేహితుడు భాస్కరరావు విషయం తెలిసి వచ్చాడు. కొడుకులు అతన్ని పట్టుకుని ఏడ్చారు.
భాస్కరరావు వాళ్లని కూర్చోబెట్టి ‘‘మీ నాన్న చివరిలో రాసిన వీలు వినిపించాలి. అంతా వినండి’’ అన్నాడు.
అంతా ఆసక్తి వినసాగారు.
‘‘నాకున్న ఈ ఇల్లు అదే నా స్థిరాస్థి, నేను సంపాదించిన, నా కష్టార్జితం ఒక కాలేజీకి ఇచ్చేస్తున్నాను. ఆ కాలేజీని వాళ్లు నా పేరుతోనే నడుపుతున్నారు. ఆ రాతకోతలు అయిపోయాయి. కనుక ఈ ఇంటిపై నా కొడుకులు, కోడళ్లు, మనుమలకు ఎలాంటి హక్కు లేదు అని రాతపూర్వకంగా తెలియజేస్తున్నాను’’ అంటూ చదవడం ముగించాడు భాస్కరరావు.
అది విని పెద్ద కొడుకు మోహన్, అతని భార్య ఖంగు తిన్నారు. ఎందుకిలా రాశారన్న రహస్యం స్నేహితుడు భాస్కరరావుకు తప్ప కొడుకులు ఎవరికీ అంతుబట్టలేదు.
తండ్రిని మోసం చేసిన తనయుడు, తనయుడికి శిక్ష వేసిన తండ్రి’ అనుకున్నారు ఇరుగుపొరుగు.
మూర్తి విద్యా సంస్థలు నెలకొని ఆ ఊరి విద్యార్థులకు జ్ఞానజ్యోతిని అందిస్తున్నాయి నిరంతరం.

- పుష్ప గుర్రాల, విజయనగరం

పుస్తక పరిచయం

రసరాజు
గజల్ బాజాలు
గజల్2 నరనరాన జ్వలిస్తున్న ఒక నిప్పురవ్వ. అంత్యప్రాసలతో అలరిస్తూ అదే ప్రాణంగా నిలచిన ప్రక్రియ. శ్రోతల హృదయాలను ఆహ్లాదంగా మార్చి రంజింప చేయడం దీని లక్ష్యం, లక్షణం. గజల్ ఒకనాటి చరిత్రకు, సంస్కృతికి ప్రతీక. అయిదు లేక అంతకన్నా ఎక్కువ ద్విపదల కూర్పు గజల్. గజల్ ఛందస్సుల్లో మత్లా, మజ్తా, మిస్రా, షేర్ రదీఫ్, కాఫియా, తఖల్లూన్ అనే చందో నిబంధనలుంటాయి. ప్రతి గజల్ రెండు పాదాలు గల ద్విపదల సముదాయం. రెండు పాదాలు కలిగిన చరణాన్ని 3షేర్2 అంటారు. ప్రతి షేర్‌లోని మొదటి పాదాన్ని 3మిస్రా2 అనీ, అలాగే రెండో పాదాన్ని 3మిస్రా సానీ1 అని పిలుస్తారు. గజల్‌లోని మొదటి షేర్‌ను 3మత్లా2 అనీ, చివరి షేర్‌ను మఖ్తా2 అని అంటారు.
రదీఫ్: గజల్‌లోని మొదటి షేర్ అయిన 3మల్లా2లోని రెండు పాదాలలో చివర ఉండే పదాన్ని 3రదీఫ్2 అంటారు. అది మిగతా షేర్లకన్నిటిలోనూ రెండో పాదాంతాలలో పునరావృతం అవుతుంది. బహువచనంలో రదాయిఫ్2 అనవచ్చు.
కాఫియా: రదీఫ్‌కు ముందున్న పదాన్ని కాఫియా అంటారు. దీనివలన గజల్ సౌందర్యం ఇనుమడిస్తుంది. రదీఫ్, కాఫియాలు, రెండింటిలోను రెండు పాదాంతాలలో పునరావృతమవుతుంటాయి. కొంతమంది కవులు అంత్య ప్రాసలతో తెలుగు గజళ్లు రాశారు.
మఖ్తా: గజల్‌లోని చివరి చరణాన్ని లేదా షేర్‌కు 3మఖ్తా2 అంటారు. దీనిలో కవి తన నామముద్రను కలం పేరును కూర్చి రాయటాన్ని 3ఖల్లూస్2 అంటారు. తఖల్లూస్ 3రెండు లేక మూడు, నాలుగు మాత్రలదై ఉంటుంది. గజళ్లలో ఇన్ని లేక మూడు నాలుగు మాత్రలదై ఉంటుంది. గజళ్లలో ఇన్ని షేర్లు ఉండాలనే నియమం లేదు. కొంతమంది 17 నుండి 25 షేర్లు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికొద్దాం. తెలుగు వినీలాకాశంలో నవరసాలు, నవీన పోకడలు, నవ నవోనే్మష మాధుర్యాలు, స్వర ధ్వనులు పుణికి పుచ్చుకున్న సమస్య ప్రక్రియల సాఫల్యాన్ని సాధించిన సాహితీ కృషీవలులు శ్రీరసరాజు గారు. ఆయన కవిత్వం అంబరాన్ని తాకి సంబరాలు చేసుకుంటుంది. గేయం, వచనం, పద్యం, కథ, చమత్కారం ఏదైతేనేం తనదంటూ ప్రత్యేకతతో మధురాదరాలు కురిపిస్తుంది. 3ఇంధ్రనస్సు2 సౌందర్యానే్న మరిపిస్తుంది. అటువంటి కవి కాబట్టే (డ, , ఉతి) ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సమితి, తెలుగు సాంస్కృతిక సమితి సత్కారం (హ్యస్టన్) పొందారు. సినీ గేయ రచయితగా అసెంబ్లీ రౌడి సినిమాకి ప్రభుత్వ పురస్కారంతోపాటు (అందమైన వెనె్నలలోనా) కళాసాగర్ ఫిల్మ్ అవార్డు పొందారు. ఆయన బిరుదులు, పద్య కవితా సంపుటి, సినీ గేయాలు, 150 వివిధ పత్రికలలో అన్ని స్థాయిలలో పొందిన బహుమతులు కాలమ్స్ నిర్వహణ గుర్తించి చెప్పాలంటే ఈ వ్యాస రచన వాటితోనే నిండిపోతుంది. నేను ప్రస్తుతం శ్రీ రసరాజు గజళ్లులోని కొన్ని ఆణిముత్యాలును మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఆయన కవిత్వంలో సామాజిక కోణం దర్శించవచ్చు. మానవీయత పరిమళించే ఈ షేర్ అవధరించండి.
పుట్టడమే గొప్పయితే పురుగు పుడుతుందిగా
పూరి గుడిసె కడుపులోన ఆకలి తరిమేయాలి
అంతేకాదు. ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి
కాని ఆచరణాత్మకంగా ఉండాలనే ప్రబోధ ఈ షేర్‌లో కనిపిస్తుంది. ఆశయాలు రోదసిలో ఎగిరి ఏమి లాభం. ఆచరణకు గతి నేర్పేబాట ఎక్కుడుంది. ఈ కవి రచనలో వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా ఉంటుంది. సానుకూల దృక్పథం ఇది చదివిన ప్రతి వారికీ కలుగుతుంది. ఉదాహరణకు ఈ షేర్ చూడండి.
3ముళ్లు కరచినా గులాబినేమీ అనకు తోటమాలీ!
మొదటి వందనం నవ్వుతూ నీకే చేసెను తెలిసిందా2
చిత్తశుద్ధిలేని నేటి రాజకీయ నాయకుల మనస్తత్వంను ఏవగించుకుంటూ ఒకరకంగా ఆవేదన పడుతూ ఈ క్రింది షేర్‌ని చెప్పినట్లనిపిస్తుంది.
3మహా పీఠమెక్కినా మనసుండాలి
మాటలు విసిరేయకు మమతలపై
రాజకీయమంటే నాకేవగింపు కాదు
రక్త సంధ్య పూయకు మెతుకులపై2
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే శక్తివంతమైన సాధనం ప్రేమ. ఇక కవి విషయంలో యవ్వనోత్సాహాలు జీవితాంతం నిలచి ఉంటాయి. ఆ భావనలు రచనలలో నిక్షిప్తమై ఉంటాయి. తమ హద్దుల్లో ఉంటూ పాత్రలలో పరికాయ ప్రవేశం చేయబట్టే కవి నిత్య యవ్వనుడై ఒక కొత్తదనం నింపగలుగుతాడు. అందుకే వేటూరి వారి పాటలు అంత హుషారుగా ఉంటాయి. అందుకే రసరాజు అంటారు.
వలపులే లేకపోతే - జీవితం దేనికి
కలువలే పూయకుంటే - కొలనుకే చిరాకు
ఇక ఈ గజల్ ప్రక్రియను అలవోకగా ఎంత అద్భుతంగా రాశారండి! అని మనం అనుకోవచ్చు. దానికి ఆయన కష్టాన్ని ఈవిధంగా వివరించారు.
3ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బ్రతికానో2
ఎన్నిఎన్ని భావాలు ఏరి తెచ్చి ఉతికావో2
అంతే కాదు, మనిషి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుని సమాజంలో ఎలా వర్తించాలో, గౌరవంగా ఎలా మసలుకోవాలో కూడా సూచిస్తారు.
కాపురాలనే నిలిపిందంటే ఆయన కవిత్వానికి రస సిద్ధి ఉంది. ప్రయోజనం ఉంది. తిన్నావా లేదా అని అడిగానా ఎపుడైనా నడుం వాల్చలేదే అని అన్నానా ఎపుడైనా
కోపంగా చూచినా దీపంలా ఉంటావు
కోనేటిలో ఎరుపెక్కిన పద్మంలా ఉంటావు2
ఎంత రసరమ్యంగా వచ్చాయండి ఈ షేర్లు. ఇక ఎన్నో చప్పళ్లతో ఒంగోలులో చదివిన ఈ గజల్‌లో రెండుషేర్లు మీకు
అమ్మల్లారా ఎదిగిన ఆడవాళ్లు మీరు
ఆలోచిస్తే సబలకు ఆనవాళ్లు మీరు2
పడక గదిని పండించే తాంబూలం మగువ
పట్టు తప్పితే పతినే తన్నినోళ్లు మీరు
పూజలలో, నోములలో మహిళలదే పైచేయి
పొడిచే సూర్యుణ్ణి కూడా ఆపినోళ్లు మీరు
ఇలా సాగే ఆయన కవితాధారను ఏమని వర్ణించగలం. అందుకే గజల్ శ్రీనివాస్ గారు కోరి ఈ పుస్తకాన్ని తన ట్రస్టు ద్వారా ముద్రించారు. గానం చేశారు. తెలుగు తల్లి సిగలో ఈయన కవితాక్షరాలు అగరు పొగలో, అత్తరులో మగువా సిగ్గు దొంతరలో అనే పాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎంతోమందికి పుస్తకాన్ని అందించిన కవికి గజల్ ఛారిటబుల్ ట్రస్టు హైదరాబాద్ వారికి కృతజ్ఞతాంజలి.

- బిహెచ్‌వి రమాదేవి, రాజమండ్రి

మనోగీతికలు

ఆమె

ఆమె పువ్వులా పుట్టింది
పుత్తడి బొమ్మలా పెరిగింది
యుద్ధంలో సైన్యం ఓడిపోయిందట
శతృ సైన్యం కోటపైకి ప్రవేశిస్తుంది..
పెద్దగా అరుపులు..పరుగులు..
అప్పటికే పేర్చుకున్న అగ్నిగుండంలోకి
ఒక్క ఉదుటున దూకింది ఆమె
ధవళకాంతుల దేహం బూడిదైపోయింది
అయ్యో..బూడిదైపోయింది...

ఆమె మళ్లీ పుట్టింది
ఈసారి నూరేళ్లు బ్రతుకుదామనుకుంది
సిగ్గుల మొగ్గలా మెట్టినింట అడుగిడింది
మూణ్ణాళ్లకే మొగుడు కాలం చేశాడు
హతాశురాలైంది..
డప్పులు, చప్పట్లు, ఏడ్పులు, మంత్రాలు, తంత్రాలు..
మెదడు మొద్దుబారింది
మనసు శరీరం నుండి చెదిరి బెదిరి పారిపోయింది
మంత్ర ముగ్ధలా భర్త తలని వళ్ళో పెట్టుకుని
తలగబడిపోయింది
అయ్యో.. తగలబడిపోయింది

ఆమె మళ్లీ పుట్టింది..
ఈసారి సతీసహగమనం చేయనంది
నిండా పదకొండేళ్లు రాకుండానే వధువయ్యింది
బలమైన ముసలి దేహం చేతిలో
చిరుమొగ్గై నలిగిపోతూ.. బిత్తరపోయింది
ఇరవై ఏళ్లకే ఐదుగురికి తల్లై
ఆరో కాన్పులో ఇక కనలేనంటూ..
కనురెప్పలు మూసేసింది
బుట్టెడు పసుపు కుంకుమలు, తట్టెడు పూలతో
పుణ్యస్ర్తిగా పోయిందని, అదృష్టవంతురాలని,
చితికి నిప్పంటించారు..ఆమె భగభగ మండింది
అయ్యో..మండిపోతుంది

ఆమె మళ్లీ పుట్టింది..
ఈసారి వయస్సు వచ్చాకే వివాహం అంది
ఈడున్న వాడినే పెళ్ళాడింది
కట్నం ఇంకా తెమ్మన్నారు
ఎలా తేగలదు? బేలగా నిలిచింది
కిరోసిన్ పోసి నిప్పంటించాడు
ఆర్తనాదాలు మిన్నంటాయి..
సుందర సుకుమార దేహం కాలిపోయింది
అయ్యో..కాలిపోయింది!

ఆమె మళ్లీ పుట్టింది..
ఈసారి చదివి, ఉద్యోగంచేసి నిలబడాలనుకుంది
స్నేహం అన్నాడు..సరేనంది
ప్రేమ అన్నాడు వద్దు అంది
యాసిడ్ పోశాడు..
పచ్చని దేహం వెచ్చగా పొగలు కక్కింది
పొగలు కక్కి, పొక్కి, వెక్కివెక్కి ఏడ్చి మరణించింది
అయ్యో..మరణించింది

ఆమె మళ్లీ పుట్టింది..
ఈసారి స్నేహం వద్దు చదువు..చదువు..చదువు అనుకుంది
కాలేజ్‌లో ర్యాగింగ్ అంట
నీ సీనియర్‌ని నీ రక్షకుడిని అన్నాడు
తర్వాత స్నేహం తర్వాత ప్రేమ
రక్షకుడే ప్రేమికుడైతే స్థిరపడ్డాక భర్త అయితే?
మనసు పులకరించింది..
ఏమరపాటులో..ఆ రక్షకుడికి సెల్‌ఫోన్
ఆమె పాలిట యమపాశం అయ్యింది
ఉలిక్కిపడింది..తానే నేను..నేనే తాను
అనుకున్న వేళ..ఎంత అన్యాయం
విలవిలలాడింది గుండె..ఎటూ పాలుపోలేదు
అవమాన భారంతో కాలేజి పై అంతస్తునుండి దూకేసింది
పాలరాతి శిల్పం లాంటి దేహం ఛిద్రమయ్యింది
అయ్యో..్ఛద్రం అయిపోయింది..

- భల్లం మోహనలక్ష్మి, గన్నవరం

ఓహో! గులాబి బాల!

పూవులన్నిటిలో గులాబి బాలదే గర్వం
ఏ పుష్పానికుంది ఇంతటి హుందాతనం!
రేకు రేకునా సౌకుమార్యం సోయగం
రసిక హృదయాలకు రుక్కు ఆ రమణీయం!

పరిమళం పొదుపుకొని వగలుపోతూ ఉంటుంది
శృంగార భావాల సంకెళ్లతో మనసును బంధిస్తాది!
ముద్దాడకుంటే గులాబీని
గడుసు రసికుడవెలా అవుతావు
ఒక దళమును తాకితే చాలు
విరబూస్తాయి ఎదలో కోటి కళాత్మక భావాలు!

తన సౌరభంతో మనోజ్ఞ ప్రపంచంలోకి పట్టుకుపోతాది
ప్రియుడ్ని ఎదపైకి లాక్కున్నట్టు!
గులాబి రేకులతో గుమ్మను ముంచేస్తే
ఎక్కడ తడిమినా మక్‌మల్ తీరే!
కొమ్మతో కలిసి గులాబీల స్నానం చేస్తే
కొత్త జీవితం గుబాళించి కదం తొక్కినట్టే!

ముళ్లుంటాయని మననం పడితే మదనుడివి కాలేవు
చిక్కులనధిగమించి ముచ్చట తీర్చుకోవడం గొప్పకళ!
మచ్చెములలో ముళ్లున్నా తినడం లేదూ మురిపెంగా!
దురద పుట్టిస్తుందని కందకు దూరమయ్యామా!

దక్కించుకోవాలి వలరాజులా అందాన్ని తెలివిగా
ముచ్చరించకుంటే నిన్నుమించిన రసికాగ్రేసరు
లెందరో శృంగార సాంగత్యానికి సిద్ధమై ఉంటారు
అడ్డురాదేదీ అనుభవించాలనే కోరిక సమ్ముదంలో అల్లుకుంటే!

గులాబీ నలిగినా వాడినా వీడవు
గత స్మృతుల మధుర క్షణాల సురభిళాలు!

- మల్లిమొగ్గల గోపాలరావు
రాజమహేంద్రవరం, సెల్: 9885743834.

పెద్ద సారువాడు

పెద్దసారు వాడు
చెప్పిందే రైటు
చేసిందే బెస్టు
లేటెస్టుగా పొగడాల బిడ్డా

బతక నేర్చినోడు
బాడు గుడ్డును
బంగారు గుడ్డుగా
భ్రమింప చేస్తడు బిడ్డా

పనియే దైవ మంటడు
కష్టించి పని చేయాలంటాడు
పని చేయాల్సినపుడు
సైడైపోతడు బిడ్డా

మాయ మాటలు
దొంగ వేషాలు
మోసపు టెత్తులతో
దొరనని నమ్మిస్తడు బిడ్డా
- శంకర వెంకట నారాయణ
ఆచంట- 534 123
సెల్: 9959163676

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- పుష్ప గుర్రాల