సెంటర్ స్పెషల్

రణక్షేత్రం - 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అది కూడా ఊరికినే కాదు..’ అంటూ ఒక చిన్న బ్రీఫ్‌కేస్ అతనికి చూపించి ఉంటాడు నేను పంపిన వ్యక్తి. దాంట్లో పది లక్షల క్యాష్ ఉంది. అది చూశాక పూరన్ సింగ్ ఒక నిర్ణయం తీసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు.
ఆ తరువాత బస్‌ని నాగముని కుటుంబ సభ్యులు బస చేసిన హోటల్ దగ్గరకు తీసుకువెళ్లే లోపు మా వాళ్లకు ఒక అరగంట అప్పజెప్తాడు పూరన్‌సింగ్. ఆ అరగంటలో నేను చెప్పినట్లు కెమికల్స్ బస్సు నిండా అమర్చటం పూర్తవుతుంది.
బస్సు తన గమ్యస్థానం చేరేలోపు, రాత్రిపూట ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం చూసుకుని బస్సుని రోడ్డు దిగువన వున్న ఏ చెట్టుకో గుద్దుతాడు పూరన్‌సింగ్. కావాలంటే అలాంటి అనుకూలమైన ప్రదేశం కూడా మా వాళ్ళే సెలెక్ట్ చేసి పెడతారు. మరీ ఎక్కువ ఫోర్స్‌తో గుద్దనవసరం లేదు. నా లక్ష్యం ఆ గుద్దటం ద్వారా ప్రాణాలు తియ్యటం కాదు కాబట్టి డ్రైవర్ తన ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయవసరం లేదు.
ఎంత చిన్న యాక్సిడెంట్ అయినా దానికి గురి అయిన ప్రయాణికులను షాక్‌కి గురి చేయక మానదు. వాళ్లు దాంట్లో నుండి తేరుకునేలోపే పూరన్ సింగ్ తన దగ్గర ఉన్న డెటొనేటర్ పేలుస్తాడు. దాంతో నేను అమర్చిన కెమికల్స్ అంటుకుంటాయి. అత్యంత వేడితో కూడుకున్న మంటలు, పొగలు బస్సంతా వ్యాపిస్తాయి. ఎటు నుండి ఎవరూ దిగడానికి ఛానే్స ఇవ్వకుండా క్షణాల్లో అన్ని వైపుల నుండి మంటలు వ్యాపిస్తాయి.
ఆ చుట్టుపక్కల పొదల్లో దాక్కుని ఉంటారు మా బీహారీ గ్యాంగ్. బయట నుండి డీజిల్ ట్యాంక్ పగులగొట్టి దానికి కూడా నిప్పు పెడతారు.
బస్సులోఉన్న ఒక్క మనిషి కూడా బతికి బట్టకట్టే ఛాన్స్ ఉండదు.
ఇక నాగముని అనుచరుల్లో ఇద్దరు ముగ్గురు ముఖ్యులు ఉన్నారు. అతని కోసం ప్రాణాలు కూడా ఇచ్చేవారు. వారిని ప్రాణాలతో ఉంచటమంటే మళ్లీ గొడవలకు తావివ్వటమే!
ఆ అనుచరులందరినీ మా బీహార్ గ్యాంగ్ గత వారం రోజుల నుండి చాటుగా అనుసరిస్తూనే ఉంది. విషయం తెలిసి వాళ్లు ఘటనా స్థలానికి బయలుదేరతారు...
కానీ చేరదు.
ఇక మిగిలిన చిన్నా చితకా అడ్డంకులన్నీ వాటంతటవే తొలగిపోతాయి.
ఇదీ నా ప్లాను.
రాత్రంతా జాగారం చేస్తున్న భక్తులు భజనలు చేస్తున్నారు. మరోపక్క భక్తి సినిమాలు వీడియోల్లో వేస్తున్నారు. గుడి ఆవరణ నుండి భక్తి పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉన్నాయి.
రెండు గంటల ప్రాంతంలో ఒక చిన్న మెసేజ్ వచ్చింది. మొదటి స్టెప్ నిరాటంకంగా పూర్తయిందని.
మాకు అతిథిగా వచ్చిన మంత్రిగారికి మరో గంట తరువాత అదే మెసేజ్ అధికారికంగా వచ్చింది.
పి.ఏ. వచ్చి ఆయన చెవిలో గుసగుసగా ఏదో చెప్పటం, మంత్రిగారు ఖంగు తినటం ప్రత్యక్షంగా చూశాను. ఆయనకు వచ్చే మొదటి ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నాగముని చచ్చిపోయాడనగానే అది మేమే చేశామేమో అన్న అనుమానం రావటం సహజం. ఆయన మా గ్రూపులోని అందరి వైపూ పరీక్షగా చూశాడు. కానీ, అందరి మొహాలూ ఎలాంటి ఆందోళనా లేకుండా మామూలుగా ఉన్నాయి. అంత నటన పండించటానికి మా వాళ్లు ప్రొఫెషనల్ యాక్టర్లు కాదని కూడా ఆయనకి తెలుసు. అందుకే జరిగిన సంఘటనతో మాకు సంబంధం లేదని ఆయన మనస్ఫూర్తిగా నమ్మాడు. కానీ ఆపై ఆయన అక్కడ ఉండటం ఆయన శ్రేయస్సుకు మంచిది కాదు కాబట్టి అప్పటికప్పుడు బయలుదేరాడు.
‘అదేంటి అంత హఠాత్తుగా బయలుదేరారు?’ ఆశ్చర్యంగా అడిగాడు నాన్న.
నాన్న చెవిలో తనకు తెలిసింది చెప్పాడు ఆయన. ‘నేను వెళ్లి పోలీస్ ప్రొటెక్షన్ పంపిస్తాను. ఈలోపు మీ జాగ్రత్తలో మీరు ఉండండి...’ అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.
ఆయన వెళ్లిపోయాక మా వాళ్లందరికీ జరిగింది తెలిసింది. ముందు కాసేపు నిరామయ విరామం రాజ్యం చేసింది. తరువాత ఎప్పటి నుండో తమ శత్రువయిన నాగముని చనిపోయినందుకు ఆనందించాలో, తమ చేతిలో కాకుండా దుర్ఘటనలో చనిపోయినందుకు విచారించాలో వారికి అర్థం కాలేదు.
మా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున గొడవలు జరుగుతాయని ఊహించారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లు ఏమీ జరగలేదు.
నాగముని అనుచరులు చాలామంది ఈ విషయం విన్న వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరారు. అందులో ముగ్గురు నా టార్గెట్‌లో ఉన్నారు. వారి వివరాలు ముందే మా బీహారీ గ్యాంగ్‌కి ఇచ్చి ఉన్నాను. కాబట్టి వాళ్లు తిరిగి రారు.
నాయకుడంటూ లేకపోయాక మిగిలిన చిన్నాచితకా జనం చిల్ల పెంకుల్లా చెదిరిపోయారు.
ఇదంతా చిన్నయ్యగారు వచ్చిన వేళా విశేషం అనుకున్నారు మా వాళ్లు.
పోరాటానికి, యుద్ధానికీ తేడా తెలుసుకున్న నాన్న వౌనంగా ఉండిపోయాడు.
అప్పటి నుండి అన్ని వ్యవహారాల్లోనూ ఛార్జ్ నేను తీసుకున్నాను.
ఇప్పుడు మా ఏరియాలో ఫాక్షనిస్టులు లేరు. నేను ఒక్కడినే మిగిలాను.
హఠాత్తుగా ఏర్పడిన ప్రశాంతమయిన వాతావరణం, చౌకలో దొరికే భూములూ మా ఏరియాని ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అనుకూలంగా మార్చాయి.
దగ్గర్లో ముడి ఖనిజం దొరుకుతుండటంతో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాన్ చేశాను.
ఫ్యాక్టరీ పూర్తయ్యేలోపు ఎప్పటి నుండో సంపాదించిన మా ఆస్తులన్నీ కుదువ పెట్టవలసి వచ్చింది. ‘ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకే వ్యాపారం లేదు. అనవసరంగా ఈ రంగంలోకి దిగుతున్నావన్నారు..’ అందరూ! నేను మాత్రం రేపటి రోజు మీద నమ్మకం పెట్టుకునానను. భారతదేశంలో అభివృద్ధి ఎప్పటికీ ఆగదని నాకు తెలుసు. సిమెంటుకి తట్టుకోలేని డిమాండ్ వస్తుందన్నది నా ఊహ. అలానే నా ఫ్యాక్టరీ పూర్తయ్యేటప్పటికి సిమెంటుకి డిమాండ్ వచ్చింది. ఎంత డిమాండు వచ్చినా సప్లై ఒక్కసారిగా పెరగదు. కొత్త ఫ్యాక్టరీలు రావటానికి కనీసం మూడేళ్లు పడుతుంది. ఈలోపు రేటు విపరీతంగా పెరిగింది. పాత ఫ్యాక్టరీలు పాత నష్టాలను పూడ్చుకున్నాయి. నాలాగా సరిగ్గా సమయానికి కొత్త ఫ్యాక్టరీ పెట్టిన వారు మాత్రం విపరీతంగా లాభాలు పోగేసుకున్నారు.
మా కుటుంబంలో ఎవరూ ఊహించని స్థాయికి మా ఆస్తులు పెరిగాయి.
మిగిలిన విషయాల్లో నా మాటకి ఎదురుచెప్పని నాన్న పెళ్లి మాత్రం తన చెల్లెలి కూతుర్ని చేసుకోవలసిందేనని పట్టుపట్టాడు.
సుధ అందంగా ఉంటుంది. అమాయకంగా ఉంటుంది. అన్నిటినీ మించి.. నేనంటే చచ్చేంత ఇష్టం.
ఆస్తుల పరంగా కూడా సుధ కుటుంబం మాకు తీసిపోదు.
అందుకే నాకు కాదనటానికి కారణం కనపడలేదు.
సుధతో నా పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఫ్యాక్టరీ మీద మునుపటంత కాకపోయినా లాభాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఫాక్షన్లు లేవు. నా ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. మరి లేనిది ఏదైనా ఉందంటే అది తృప్తి.
మా కుటుంబం నుండి ఇంతవరకు ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లలేదు.
‘ఎన్నాళ్లని మనం ఒకరికి సపోర్ట్ చేస్తాం? మనమే ఎందుకు రాజకీయాల్లోకి దిగకూడదు’ అన్నాను నాన్నతో ఒకరోజు.
‘్ఫక్షనిస్టులకీ, వ్యాపారస్తులకీ రాజకీయాలెందుకురా?’ అన్నాడాయన.
మన పనులు జరిపించుకోవాలంటే అధికారం అవసరం...’
‘అధికార చట్రానికి బయట ఉంటే ఎవడు అధికారంలో ఉంటే వాడితో పని చేయించుకోవచ్చు. అదే నువ్వు రాజకీయాల్లో ఉంటే, నువ్వు గెలిచినా నీ పార్టీ అధికారంలోకి రావటానికి ఉన్నది సగం ఛానే్స!’
అంతకంటే తక్కువ ఛాన్సు ఉన్నపుడే గోదాలోకి దిగిన నాకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న రాజకీయాలు వదలబుద్ధి కాలేదు.
ఇంతలో మా నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో ఉపఎన్నికలు వచ్చాయి.
చాలామంది శ్రేయోభిలాషులతో చర్చించాను. రెండు రకాల వాదనలు వినిపించాయి. ఈ కుళ్లులో నువు ఇమడలేవన్నారు కొందరు. డబ్బు సంపాదించటానికి తప్ప సమాజానికి చేయగలిగింది ఏమీ ఉండదన్నారు మరికొంతమంది.
వారందరికీ నేనిచ్చిన సమాధానం ఒకటే - ‘ప్రయత్నించి చూడటంలో తప్పేంటి?’ అని.
ఆ సీటు నాకు ఇమ్మని పార్టీ పెద్దలని అడిగాను. వాళ్లు నవ్వారు. ‘మన దేశంలో ఎవరైనా ఎలక్టయిన సభ్యులు చనిపోతే, అతని కుటుంబంలోని వారికి సీటు ఇవ్వటం అన్నది అలిఖిత చట్టంలా చెలామణీ అవుతోంది. నీకు సీటు ఇవ్వటం కష్టం...’ అన్నారు వారు.
మాట్లాడకుండా బయటకు నడిచాను నేను.
వెళ్లిపోతున్న నన్ను ఆపాడు పార్టీ పెద్ద. ‘ఒక పని చేద్దాం. నువ్వు యువకుడివి. డబ్బు ఖర్చు పెట్టగలవు. తరువాత ఎలక్షన్ వరకూ ఆగు. ఎక్కడో ఒకచోట సీటు ఇప్పిస్తాను’ అన్నాడు.
‘ఎక్కడో ఒక చోటుకు వెళ్లి పోటీ చేయవలసిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడే పోటీ చేస్తాను’
‘చూడు బాబూ! అనుభవం మీద చెప్తున్నాను. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల మీద సింపతీ ఉంటుంది. నీకు సీటు ఇస్తే వాళ్లు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తారు. అప్పుడయినా వాళ్లే గెలుస్తారు. నీకు ఖర్చు తప్ప మిగిలేదేమీ ఉండదు...’
‘మీరు చెప్పినట్లే ఆలోచిద్దాం.. ఈసారి వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారంటున్నారు. తరువాత ఎన్నికల నాటికి గెలిచిన అభ్యర్థిని పక్కన పెట్టి నీకు సీటు ఎలా ఇవ్వమంటావంటారు. మరి నాలాంటి కొత్త వాళ్లు రాజకీయాల్లోకి వచ్చేది ఎలా?’
‘ఓపిక పట్టాలి’
‘నాకు లేనిదే అది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రపోజల్ పెడుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయటం ఖాయం. గెలిచిన తరువాత మీ పార్టీలో చేరటానికి వస్తాను. అప్పుడు నన్ను చేర్చుకోవటానికి ఏమన్నా అభ్యంతరమా?’
‘గెలిచేవారికి మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అలాంటిది గెలిచిన వాడికి ఎలా మూసు కుంటాయి. ననే్నం చెయ్యమంటావో చెప్పు’
‘ఇందుకుగానూ నాకు మీరు ఏ సహాయమూ చేయనవసరం లేదు. పార్టీ ఎలక్షన్లలో ఖర్చులకుగానూ ఇచ్చే డబ్బు ఏదైనా ఉంటే దాన్ని మీ పార్టీ అభ్యర్థికి అందకుండా చూడండి. నా సంగతి నేను చూసుకుంటాను’
‘మీ ఇద్దరి పోటీలో ఇద్దరూ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ వాళ్లు గెలిస్తే...’
‘నన్ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు...’ అన్నాను నేను.
‘ఎవరైనా డబ్బులు కావాలంటారు. ఇవ్వవద్దు అనేవాడిని నినే్న చూస్తున్నాను..’ అన్నాడాయన.
నవ్వి వచ్చి, ఎలక్షన్లలో నిలబడ్డాను.
నా ప్రచారం చాలా సాదాసీదాగా మొదలయింది. ఎక్కువ కష్టపడలేదు. ఓట్లు వేయించుకోవటానికి రెండు పద్ధతులు అవలంబించాను. కాస్త బలమయిన వాళ్లు ఎదుటి పక్షంలో ఉంటే వాళ్లని బెదిరించటం, బలహీనుడు ఉంటే వాడిని డబ్బుతో లొంగదీసుకోవడం.
మా పార్టీ తరఫున నిలబడిన అసలు క్యాండిడేట్‌కి డబ్బు సమస్య ఉంది. అతని తాహతు అంతంత మాత్రం. పార్టీ నుండి లభిస్తుందనుకున్న సహాయం అందటం లేదు. ఇవాళ, రేపూ అని తిప్పుతున్నారు తప్ప, పార్టీ నుండి నయాపైసా రాలేదు.
మా అనుచరులు ప్రతి ఊరూ వెళ్తున్నారు. ఊరి పెద్దలని కలుస్తున్నారు. వారిని మా వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బు దగ్గర నుండి, సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల వరకూ వారిని అన్ని రకాల ప్రలోభాలకీ గురి చేస్తున్నారు.
ఎన్నికలకు ఒకరోజు ముందు ఎవరూ కనీవినీ ఎరుగనట్లు డబ్బు సంచులు బయటకు తీశాను. అందరూ ఓటుకు వంద నోటు ఇస్తున్న రోజుల్లో పంపకాలకి అయిదు వందల నోటు పరిచయం చేసింది నేనే!
ఏమి జరుగుతుందో ఎదుటి పక్షాలకి అర్థమయ్యేలోపు నేను బంపర్ మెజారిటీతో గెలిచాను.
ఫాక్షన్ గొడవల మధ్య ఉన్న మా కుటుంబాన్ని అందులో నుండి బయటపడేసి ఎదురులేకుండా చేశాను. అలాగే రాజకీయంగా కూడా మరెవరూ ఈ నియోజకవర్గం వైపు కనె్నత్తి చూడకుండా చెయ్యటం నా లక్ష్యం. మున్ముందు నేను పెట్టుకున్న రాజకీయ లక్ష్యాలు చేరాలంటే నియోజకవర్గంలో గెలవటం లాంటి చిన్నచిన్న జంఝాటాలు ఉండకూడదు.
అనుకున్నట్లుగానే గెలిచిన నేను అధికార పార్టీలోకి చేరాను. వాళ్లు కూడా నన్ను ఎదుగుతున్న నాయకుడిగా గుర్తించి సముచిత గౌరవం ఇచ్చారు.
రెండేళ్లు చిటుక్కున తిరిగిపోయాయి. జనరల్ ఎలక్షన్లు వచ్చాయి. మళ్లీ నా గెలుపు రిపీట్ అయింది. మెజారిటీ ఇంకా పెరిగింది.
ఈసారి నన్ను మంత్రిని చేసింది నా పార్టీ. యువ నాయకుడిగా రాష్టమ్రంతా పేరు వస్తోంది.
నియోజకవర్గంలో ప్రతి ఊరికీ నా ఏజెంట్ ఒకరిని నియమించుకున్నాను. నేను నియోజకవర్గంలో ఉన్నా లేకున్నా అక్కడ జరిగే ప్రతి విషయమూ నాకు తెలిసే ఏర్పాటు చేసుకున్నాను.
నా పిల్లలు స్కూలుకు వెళ్లే వయసుకు వస్తున్నారు. ఇక నా నియోజకవర్గంలో నాకు తిరుగు లేదనుకున్న తరువాత, నా మకాం హైదరాబాద్ మార్చాను.
మంత్రి పదవి మూలంగా నేను కూడా ఎక్కువ భాగం ఇక్కడే ఉండవలసి వస్తోంది.
వారాంతంలో మాత్రం ఠంచనుగా నా నియోజకవర్గానికి వెళ్లేవాడిని.
రాష్టవ్య్రాప్తంగా నా పేరు ప్రఖ్యాతులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
మరోవైపు రిస్క్ లేని లైఫ్ బోర్ కోడుతోంది. ఇప్పుడు ఎదురు నిలిచే ఫాక్షనిస్టులు లేరు. ఛాలెంజ్ చేసే రాజకీయ ప్రత్యర్థులు లేరు.
ఎందులోనో ఒకదానిలో రిస్క్ చేయకుండా నిస్సారంగా గడపడటం నా నైజానికే విరుద్ధం.
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సుధకి నా మీద కంటే పిల్లల మీద ఇంట్రస్ట్ ఎక్కువయింది. అది నాకు కోపం తెప్పించ లేదు. నా జీవితంలో ఎప్పుడూ ఒకటి పోతే రెండు వచ్చాయి.
అయితే నాకూ, మిగిలిన డబ్బున్న వారికీ తేడా ఏమిటంటే, వారు ఏమి కావాలంటే అది చేయగలరు. నేను చేయలేను. ఏదైనా ఒక పనిని చేయలేని పరిస్థితుల్లో చేయటంలో రిస్క్ ఉంది. రిస్క్ చేయటంలో నాకు కిక్ వస్తుంది. నిజం చెప్పాలంటే కొత్తకొత్త అమ్మాయిల పొందు కంటే వాళ్లతో గడుపుతున్నందు వలన కలుగుతున్న రిస్క్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది.
నేను బయట వేరే అమ్మాయిలతో తిరుగుతున్న విషయం సుధకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ, నేనే ఆమెకు తెలిసేటట్లు చేశాను. అప్పటి నుండి ఇద్దరం వౌనంగానే ఒకరితో ఒకరం ఒక ఒప్పందానికి వచ్చాం. నా బయట తిరుగుళ్లకు ఆమె అభ్యంతరం చెప్పదు. నేను ఆమె సోషల్ స్టేటస్‌కి భంగం కలిగించను. నేను ఎవరితో పడుకున్నా, నిద్రపోవటానికి మాత్రం ఇంటికే వస్తాను. ఒప్పందం అంటే నిజంగా చేసుకున్న ఒప్పందం కాదు. చాలామంది సెలబ్రిటీల ఇళ్లల్లో చెలామణీ అయ్యేది ఇలాంటి అలిఖిత ఒప్పందమే!
ఒకసారి సుధకి నా తిరుగుళ్ల గురించి తెలిసిపోయాక, నాకు ఫ్రీ లైసెన్స్ వచ్చినట్లయింది.
అప్పుడే నా చూపు గ్లామర్ ప్రపంచం మీద పడింది.
రాజకీయాలు కాక పేపర్లలో నానేవి రెండే రంగాలు- సినిమా రంగం, క్రీడారంగం.
క్రీడా రంగంలోకి కొత్తగా ప్రవేశించలేం. కనీసం సినీ రంగంలోకి వెళ్లి ఆ లైమ్ లైట్‌ని కూడా స్వంతం చేసుకుంటే రాజకీయ అభివృద్ధికి మరో మెట్టు అవుతుందనిపించింది.
నిర్మాతగా సినీ ప్రపంచంలోకి ప్రవేశపెట్టాను.
ఒకపక్క పెద్దపెద్ద స్టార్లని పెట్టి సినిమాలు తీసేవాడిని. మరో పక్క చిన్నచిన్న డైరెక్టర్లని ప్రోత్సహించేవాడిని. కొత్తకొత్త హీరోయిన్లని పరిచయం చేసేవాడిని. నా ఆడిషన్‌కి ఒప్పుకుంటేనే మిగిలిన పనులు ముందుకు వెళ్లేవి.
ఇలాంటి పనులన్నీ చేయటానికి నాకు ఒక అసిస్టెంట్ అవసరం ఉంది.
అప్పుడు పరిచయం అయింది నాకు ఒక యువతి.
సినిమా రంగంలోకి వద్దామని ప్రయత్నించి అంగుళం కూడా ముందుకు వెళ్లలేక అణగారిపోయిన వారు అనేకం. సినిమా మనసును ఉల్లాసపరుస్తుంది. కానీ, మనిషి బ్రతకటానికి తిండి కావాలి. సినిమా ఛాన్స్ వచ్చినా, రాకున్నా అదే ధ్యేయంగా స్టూడియోల చుట్టూ తిరిగే వారికి కూడా కడుపుకి తిండి కావాలి. తిండి సంపాదించుకోవాలంటే చేయటానికి వేరే నైపుణ్యం ఉండదు. వ్యాపారం చెయ్యటానికి వేరే పెట్టుబడి ఉండదు - శరీరం తప్ప. దానితో చేసే వ్యాపారం ఒకటే!
ఆమె కూడా అలాంటి వ్యాపారం చేసే ఒక యువతి.
ఆమె పరిచయంతో నా జీవితం మరో పెద్ద మలుపు తిరిగింది.
మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002