ఆటాపోటీ

శరణార్థులూ అర్హులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్థులైనప్పటికీ వివిధ కారణాలతో ఒక దేశాన్ని విడిచి మరో దేశంలో ఆశ్రయం పొందిన శరణార్థులకు కూడా ఇకపై ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభిస్తుంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించాడు. శరణార్థులైన మేటి అథ్లెట్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను కల్పించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సభ్యదేశాలన్నీ సానుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తర్వాత సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగించిన బాచ్ శరణార్థులకు మద్దతునివ్వాలని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించడం హర్షణీయమని పేర్కొన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌లోనూ శరణార్థ అథ్లెట్లు పాల్గొనవచ్చని పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది శరణార్థులుగా మారిపోయే దుర్భర పరిస్థితుల గురించి ప్రపంచానికి తెలుస్తుందని అన్నాడు. రియో ఒలింపిక్స్‌కు 206 దేశాల నుంచి సుమారు 11,000 మంది అథ్లెట్లు హాజరవుతారని, వారితో కలిసి శరణార్థ అథ్లెట్లు కూడా ఉంటారని వివరించాడు. ఐక్యరాజ్య సమితి నివేదికను అనుసరించి వివిధ దేశాల్లో సుమారు రెండు కోట్ల మంది శరణార్థులు ఉన్నారని తెలిపాడు. ఈఏడాదే సుమారు ఐదు లక్షల మంది శరణార్థులు ఐరోపా ఖండంలోని దేశాల్లోకి ప్రవేశించారని చెప్పాడు. క్రీడలకు రాజకీయాలతో సంబంధం లేదని, అందుకే శరణార్థుల్లోని అథ్లెట్లను సైతం ఒలింపిక్స్‌కు అనుమతిస్తున్నామని బాచ్ తెలిపాడు.