రివ్యూ

మబ్బులమాటు వెనెనల! ( వెనెనల్లో హాయ్‌హాయ్.. - * బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావుకత్వపు స్క్రీన్‌ప్లేకి వంశీ ఓ చక్కటి మజిలీ. కథ ఏదైనా- ఆ వాతావరణంలోకీ.. ఆయా పాత్రల మనోభావాల్లోకీ.. మనసు పొరల్లోకీ తొలుచుకెళ్లటం వంశీకి ‘పాళీ’తో పెట్టిన విద్య. అందుకేనేమో?! ‘అనే్వషణ’ తాలూకు ‘ముసుగు’ చాన్నాళ్లపాటు జనాన్ని భయపెట్టింది. ‘సితార’ కినె్నరసాని పదాలూ.. ఇసుకతినె్నల హొయలు.. గోదారిగట్ల వెంట పరుగులూ -ఇలా స్క్రీన్‌ప్లేతో అందమైన దృశ్యకావ్యాల్ని సృష్టించి అనుభూతుల లోతుల్లోకి తీసుకెళ్లాడు. ‘సత్యహరిశ్చంద్రుడు అబద్ధమాడితే..’ ఎలా ఉంటుందో? ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారం’టూ దోబూచులాడినా ‘వంశీ’కే చెల్లింది. ఆ మాటకొస్తే -టైటిల్ విషయంల్లోనూ -ప్రేక్షకుల్లో ఒక ‘ఉత్సుకత’ని క్రియేట్ చేస్తాడు. కథని చెప్పటంలో -అతడికుండే ‘పట్టు’ మరెవ్వరికీ రాదేమో?! అతడిదొక డిఫరెంట్ స్టైల్. ఐతే -గత కొనే్నళ్లుగా మురిపించీ ఊరించీ.. -ముచ్చటగా మూడుసార్లు టైటిల్ మార్చుకొని.. వచ్చిన ‘వెనె్నల్లో హాయ్‌హాయ్...’ హాయిగా ఉందా? వెచ్చగా ఉందా? అన్నది చూద్దాం.
కథ
ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సుశీల్ (అజ్మల్) పెళ్లిచూపులకు హైదరాబాద్ బయల్దేరతాడు. పల్లెటూరి అమ్మాయి సత్య (నిఖితా నారాయణ్). ఈ అమ్మాయినే సుశీల్ పెళ్లాడబోయేదని అంతా ఫిక్సై పోతారు. ఈ నేపథ్యంలో సుశీల్ తల్లిదండ్రులు ఓ స్వామీజీకి ఇతగాడి జాతకాన్ని చూపెడతారు. జాతకరీత్యా అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్తాడు జ్యోతిషుడు. దాంతో -కళ్ల ముందు రీళ్లు తిరిగితే.. తనూజ అనే అమ్మాయితో బొమ్మల పెళ్లి జరిగినట్టు కన్ఫర్మ్ అయిపోతాడు సుశీల్. ఇంతకీ ఈ తనూజ ఎవరు? సత్యతో పెళ్లి ఖరారైందనుకుంటున్న తరుణంలో తనూజని ఎక్కడని వెతికి పట్టుకోవటం? ఈ సందిగ్ధంలో ‘తనూజ’ కేరాఫ్ అడ్రస్ కోసం వెతుకులాటలో అతడితోపాటు సత్య కూడా బయల్దేరుతుంది. ఈ ‘ప్రయాణం’లో ఏం జరిగిందన్నది ‘హాయిహాయి’గా చూసేయ్యొచ్చు.
పైన ఉదహరించినట్టు -వంశీ స్క్రీన్‌ప్లే అందంగా పరచుకొంటుందన్నది నిర్వివాదాంశం. ఐతే- ట్రెండ్ మారుతోంది? మరీ ఇంత ‘్భవుకత’ని అర్థం చేసుకొనే పరిస్థితుల్లో యువత లేదేమో?! ఏనాడో జ్ఞాపకాల్లో దోబూచులాడిన అమ్మాయి కోసం వెతుకులాట అన్న కానె్సప్ట్ వరకూ ఓకే. కానీ- ఈ ప్రయాణం సాఫీగా సాగిందా? అంటే -అడుగడుగునా అవరోధాలే. ఈ సబ్జెక్ట్‌తో ఎన్నో కథలూ వచ్చాయి. అటువంటప్పుడు -ఈ కథని తనదైన శైలిలో -కామెడీ’తో అలరించి ఉంటే బావుండేది. క్రైం థ్రిల్లర్‌లోనూ.. కామెడీని పండించగల సత్తాఉన్న దర్శకుడు -ఈ కథలో ఎందుకో వెనుకబడ్డాడు. కథ పేలవంగా ఉంటూ.. సన్నివేశాల కూర్పులోనూ మరింత నీరసాన్ని జోడించాడు. కథకి ఓ లాజిక్ లేదు. ఇవన్నీ మైనస్‌లైతే.. ఈ ‘చిక్కటి వెనె్నల్లో’ ప్లస్ పాయింట్ ఉంది. ఈ ‘ప్రయాణం’లో సుశీల్‌కి తారసపడిన వ్యక్తులూ.. ఆయా జీవితాల తాలూకు నీలినీడలు.. పెళ్లి అన్న బంధం చిక్కగా ఉండాలంటే ఏంచేయాలో?.. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసిమెలసి ‘ప్రయాణం’ చేయాలంటే ఏం కావాలో? తరచి చూపాడు. కానీ- ఈ కానె్సప్ట్ ప్రేక్షకులకు ఎక్కటం కష్టం. ఈ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్‌పరంగా కాకండా.. కాస్తంత సీరియస్‌గా చూస్తేనేగానీ.. అర్థంకాదు.
మళ్లీ మొదటికొస్తే-టైటిల్ విషయంలో ఎందుకంత తర్జన భర్జన పడ్డారో అదీ తేలదు. ‘తను మొనే్న వెళ్లిపోయింది’ అని కాసేపు.. ‘మెల్లిగా తట్టింది మనసు తలుపు’ అంటూ మరోసారి.. ఆఖరికి ‘వెనె్నల్లో హాయ్‌హాయ్’ అని ఖరారు చేసారు. కానీ -తాజాగా టైటిల్‌కంటే గత టైటిల్సే కాస్తంత బెటర్ అనిపిస్తాయి.
వంశీ అనటంతోనే -గత చిత్రాల తాలూకు అనుభూతులు కళ్లముందు తారట్లాడతాయి. ‘మా పసలపూడి కథలు’ మాదిరి.. ‘గాలికొండపురం రైల్వేగేటు’లా.. ‘మా దిగువ గోదారి’లా.. ఇలా ఏవేవో ఊహించుకొన్న ప్రేక్షకులకు ‘వెనె్నల’ హాయిగా కాక.. చిమ్మచీకటిగా అనిపిస్తుంది. వంశీ అంటేనే చిక్కటి కథ అని ఉదహరించటానికి వల్లకాలేదు. ఇది దర్శకుడి లోపమా? లేక కథా లోపమా? అంటే ఇతమిత్థంగా తేల్చి చెప్పలేం. వంశీ సృష్టించే పాత్రలన్నీ.. మన చుట్టూ తిరుగాడేవే. కానీ -ఈ కథలోనివి కాస్త దూరం జరిగాయి. మొత్తానికి ఈ కథ ‘హాయిగా’ లేదు.
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటూ చెప్పుకోవాలంటే -చక్రి సంగీతం. కథని నిలబెట్టింది. ఫొటోగ్రఫీ మరో ఊపిరి. ఇది- వంశీ 25వ సినిమా. కానీ- చక్కటి మజిలీ కాలేకపోయింది.

తారాగణం:
అజ్మల్, నిఖితా నారాయణ్
తదితరులు
సంగీతం:
చక్రి
నిర్మాత:
డి వెంకటేష్
దర్శకత్వం:
వంశీ

-ప్రనీల్