రివ్యూ

గుడ్లురిమిన ఆడ పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఘటన
**
తారాగణం:
నిత్యామీనన్, క్రిష్ జె సత్తార్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, అంజలీరావు, విద్యుల్లేఖ
సంగీతం: అరవింద్-శంకర్
నిర్మాత: విఆర్ కృష్ణ ఎం
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ
**
వ్యక్తిలోనైనా, వ్యవస్థలోనైనా పెను మార్పులకు పరిస్థితులే ప్రేరణ. ఈ విషయం చిన్న అంశాల నుంచి పెద్ద నోట్ల రద్దు వరకూ అనేకంగా మనం చూశాం. ఒక సాదా సీదా యువతి తన జీవితంలో జరిగిన అనుకోని ‘ఘటన’ల వల్ల ఇబ్బందులు పడి, అలాంటివి మరొకరికి ఎదురుకాకూడదన్న ఆలోచనతో ఏం చేసిందన్నదే కథాంశం. అన్యాయం జరిగిన వాళ్లు పగ తీర్చుకోవటం భారతీయ సినిమాలో సింహభాగం ఆక్రమించిన కథాంశాలే. అయితే ఘటనలోని కొత్తదనం ఏమిటో.. పరిశీలిద్దాం.
ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మాలిని (నిత్యామీనన్) తన వ్యక్తిగత పురోభివృద్ధికి కెనడా వెళ్లాలని అనుకుంటుంది. వీసా కోసం ట్రావెలింగ్ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయిస్తుంది. అక్కడి ఇన్‌ఛార్జ్ వరుణ్ కార్తిక్ (క్రిష్ జె సత్తార్)తో మాలిని ప్రేమలో పడుతుంది. ప్రేమ పెళ్లిగా రూపుదిద్దుకునే ముందే ఏర్పడిన పరిస్థితుల వల్ల అతని గెస్ట్‌హౌస్‌లోనే ఉండాల్సి వస్తుంది. అక్కడ వరుణ్ బాస్ ప్రకాష్ (గణేష్) చేతుల్లో అత్యాచారానికి గురవుతుంది. అనంతరం కొనసాగిన ఘటనల వల్ల వరుణ్ ద్వారానే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుపాలవుతుంది. అక్కడ ఆమె సహచర ఖైదీలతోడ్పాటుతో బెయిలుపై బయటకువచ్చి తనకు జరిగిన అన్యాయానికి కారకులైన వారికి ఎలాంటి శిక్ష విధించిందన్నది మిగతా కథ. ప్రతీకారేచ్ఛతో వచ్చిన సినిమాలు కోకొల్లలే. కాకపోతే ఇందులో తన పతనానికి కారకుడైన వరుణ్‌కి విధించిన శిక్ష అతని పురుషాంగాన్ని కత్తిరించేయడం. చిత్రంలో ఆమె పాత్ర నర్స్ కనుక తన వృత్తిగత పరిజ్ఞానం కూడా ప్రతీకారానికి పనికి వచ్చిందన్నది ఓ కోణం. అయితే కేవలం ఓ నర్స్ అలా చేయగలదా? అన్నది ప్రశే్న. అదే శిక్ష ప్రకాష్‌కు వేయకుండా అతన్ని నాగుపాములతో చంపేస్తుంది. మరి ఇదెందుకో అన్నదానికి ఓ వివరణ పరోక్షంగా ఇచ్చినా దానికంత క్లారిటీ లేదు. అయితే ఇలాంటివాటికి అలాంటి శిక్షలా? అన్న దాన్ని నాగరిక సమాజం ఎంతవరకూ ఒప్పుకుంటుందో ఆలోచించాలి. అలాగే కేవలం బ్యాగ్‌లో డ్రగ్స్ దొరికాయి కదా అన్న మిషతో అరెస్టయిన ఆమె, కనీసం అప్పటివరకూ ఆమె వెంటున్న వరుణ్ సంగతి చెప్పి కనీసం అతన్ని విచారించే ప్రక్రియ ఊసే ఇందులో ఎత్తకపోవడం విచిత్రం. ఇదంతా కథలో, సన్నివేశాల్లో అనవసర ఉత్కంఠ రేపడానికి తప్ప వాస్తవం అనిపించదు. అదేరీతిలో మాలిని పాత్రను ఓ సందర్భంలో బేలగా, మరో సందర్భంలో ధీరురాలిగా.. సరైన ప్రాతిపదిక లేకుండా చూపారు. ఇది చిత్ర ఒరవడిని బలహీనపర్చింది. అన్నిటింకి మించి స్లో నేరేషన్.
పాత్రధారులు చాలామంది ఉన్నా, అంతా తానై భారాన్నంతా మాలిని పాత్రధారిణి నిత్యామీనన్ మోసింది. పాత్రకు కావాల్సిన లక్షణాలన్నీ ఆవహించుకుని నటించింది. అలాగే నాయక పాత్రధారి క్రిష్ జె సత్తార్ హ్యాండ్‌సమ్‌గా ఉండడమేకాక, ఆ పాత్రకిచ్చిన పయోముఖ విషకుంభ లక్షణాల్ని బాగా పలికించాడు. సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ పాత్ర నరేష్‌ది. వయసుతో నిమిత్తం లేకుండా ఆడదైతే చాలు అనుభవించేయాలన్న తత్త్వాన్ని బాగా వ్యక్తీకరించాడు. ఓరకంగా ఈ టైప్ పాత్ర ఆయనకు తొలిసారేమో! ప్రథమార్థంలో కోవైసరళ, విద్యుల్లేఖ పాత్రల ద్వారా పండించిన హాస్యం పండలేదు. పేషెంట్ విశ్వనాధం పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపించిన కాసేపూ అలరించారు. సంభాషణల్లో ‘పంచ్’ పేరట పొంతనలేని పదాలను వినిపించకుండా, చిన్న చిన్న సంభాషణలతోనే ఆకట్టుకోగలిగారు. ‘లవ్ కన్‌ఫర్మ్ అయిన నాటినుంచి ఒకే బెడ్‌ని షేర్ చేసుకునే రోజులొచ్చాయి’, ‘అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చేస్తారా?’ అని నిత్యామీనన్‌కి ఎస్సెట్ అయిన నవ్వుని ఉద్దేశిస్తూ అన్న వాక్యం ఇందుకు ఉదాహరణలు. ‘మగాడు’కిచ్చిన నిర్వచనాలు (పతాక సన్నివేశంలో) కూడా అర్థవంతంగా ఉన్నాయి. రాక్షసనీతి అంటూ అనంత్ శ్రీరామ్ రాసిన పాట లిరిక్, చిత్ర కథాంశంతో బాగా సింక్ అయింది. అలాగే మరో పాటలో ‘నీ వెంటే వుంటాను, చంద్రుణ్ణి’ అన్న పద ప్రయోగం బావుంది. ఈ పాటకు అరవింద్- శంకర్ స్వరపరచిన బాణీ ఎలాంటి గందరగోళ వాయిద్యాలు లేకుండా అలరించింది. చిత్రం ఇతివృత్తం, విధానం అర్థమైంది కనుక ‘్ఢల్లీలో అయిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం..’ అంటూ అతి వివరంగా టీవీ న్యూస్‌లో చెప్పించడం అనవసర సన్నివేశం.

-అనే్వషి