రివ్యూ

ప్రేక్షకులే రాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఒక్కడొచ్చాడు
తారాగణం: విశాల్, తమన్నా, జగపతిబాబు, నిరోషా, వడివేలు, తరుణ్ అరోరా, చరణ్,
జయప్రకాష్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
నిర్మాత: జి హరి
దర్శకత్వం: సూరజ్
*
ప్రజల సొమ్ము పెద్దవాళ్లు స్వాహా చేస్తే, ఆ ప్రజలకే ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేయాలనే వ్యక్తి కథతో ఒక్కడొచ్చాడు సాగుతుంది. అయితే, ఆ ధనాన్ని పంచిన ప్రక్రియే పూర్తి అప్రజాస్వామికం అనిపిస్తుంది. సినిమాకు కూర్చిన సీరియస్ పాయింట్ కథనంలో సింక్ కాలేక తేలిపోయింది.
**
వౌలిక వసుతుల కల్పనకు సుబ్రహ్మణ్యపురానికి మంజూరైన నిధులను పెద్దవాళ్లు స్వాహా చేశారని తెలుసుకున్న అర్జున్ రామకృష్ణ (విశాల్) అలాంటి ఉదంతాలు దేశంలో చాలాచోట్ల జరుగుతున్నాయని తెలుసుకొని బాధపడతాడు. ఈ పరిస్థితి చక్కదిద్ది ప్రజల సొమ్ము దేనికైతే ఉద్దేశించారో వాటికే చెందేలా చేద్దామని చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో విజయుడైన తీరు మిగతా కథ. వాస్తవానికి దేశం మొత్తం ఈనాడు బెంబేలెత్తిపోతున్న నల్లధనంపై ఓ నల్లవాడు (విశాల్ నల్లవాడే ఆ విషయాన్ని సినిమాలోసైతం ఓ పాటలో, అనేకసార్లు సంభాషణల్లో దొర్లించారు) చేసిన తిరుగుబాటుగానూ చెప్పొచ్చు. కానీ ప్రక్రియ ఎక్కడా తర్కానికి అందనంత దూరంగా నడవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. దానికితోడు మొదటి సగమంతా ‘నీవు నేను పూర్వజన్మలో ప్రేమికులం’ అంటూ దివ్య (తమన్నా) వెంటపడటంతో సాగిపోతుంది. ఇది చాలదన్నట్టు రెండో సగం విలన్ల బృందాన్ని బురిడీ కొట్టించడానికి జ్ఞాపకశక్తి కోల్పోయానంటూ అర్జున్ చేసిన హడావుడీ అంతా సగం నిండటంతో, సినిమా చర్చించాలనుకున్న తీవ్రమైన పాయింట్ (ప్రజల సొమ్ము పెద్దవారి పరం..) నీరుగారిపోయింది. సినిమాలో సన్నివేశాల విషయంలో దర్శకుడు ఏ సాధారణ సూత్రాన్నీ అనుసరించలేదనడానికి ఉదాహరణ.. ప్రభుత్వానికి చెందిన 200 కోట్ల సొమ్ములో కేవలం 50 కోట్లే తిరిగి ఇచ్చి మిగతా 150 కోట్లు నిశ్శబ్దంగా తస్కరించిన ఉద్దంత తెలివితేటలుగల వ్యక్తిగా డిసిపి చంద్రబోస్ (జగపతిబాబు)ను చూపారు. మరి అంతటి మేధావి కేవలం ఓ డాక్టర్ అర్జున్‌ను పరీక్ష చేసి ఇతనికి మెమెరీ లాస్ అయిందని చెబితే నమ్మేయడం, దానికి తగిన ద్వితీయ శ్రేణి విచారణకైనా ఒడిగట్టకపోవడం ఏ రీతిగానూ నమ్మశక్యం కాదు. అసలు అలా తనపై రైడ్ జరగడం, పర్యవసానాలు, ప్రభుత్వానికి డిసిపి చెప్పాడా లేదా అన్నది సినిమాలో స్పష్టంగా లేదు. పోనీ ఇదంతా సినిమా నడవడానికి వాణిజ్య చిత్రాలువేసే అతి పెద్ద కప్పదాట్లు అని సరిపెట్టుకున్నా, అర్జున్‌ని బాగుచేయడానికి వచ్చిన సైకియాట్రిస్ట్ డాక్టర్ బ్రూలే (వడివేలు) పాత్రని మరీ చీప్‌గా, ఓ జోకర్‌గా చేసేయడం దారుణం. ఎందుకంటే, ఆ రకంగా వాస్తవ జీవితంలో ఏ సైకియాట్రిస్ట్ ఉండడు. ఈ బాపతు హాస్యం అపహాస్యమైంది. ఇక క్లైమాక్స్‌లో అంత పెద్ద తప్పు చేసిన డిసిపి రిజైన్ చేసి సుబ్రహ్మణ్యపురం (కథానాయకుడు వున్న గ్రామం)లో పిల్లలకు ఎన్‌సిసి శిక్షకుడిగా వున్నట్టు చూపారు. ఉన్న చట్టాల ప్రకారం కనీసం డిసిపికి శిక్ష విధించినట్టు చూపించినా అతికినట్టు ఉండేది. అలాగే, సమాచార చట్టం ప్రకారం నాపై పిటిషన్ వేసినా, ఆ పిటిషన్‌ని బుట్టదాఖలు చేస్తానని ఎమ్మెల్యే పాత్ర చేత చెప్పించడం తప్పు. ఎందుకంటే, ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు తేల్చడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపుతారు తప్ప కేవలం దాన్ని సదరు ఎమ్మెల్యేలకే అందజేసి ఊరుకోరు. ఇలాంటి ప్రాథమిక విషయాన్ని సైతం దర్శకుడు సూరజ్ పట్టించుకోకపోవడం విచారకరం. ఇదంతా వదిలేసి నటనా ప్రమాణాల వంతుకు వస్తే, తను ధరించిన అర్జున్ రామకృష్ణ పాత్రలో విశాల్ తన శాయశక్తులా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఫైట్స్‌లో చెలరేగిపోయాడు. దివ్యగా తమన్నా ఎప్పటిలాగా పాటల్లో విజృంభించింది.
చాలాకాలానికి వడివేలు కనిపించి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ పాత్రకు బ్రహ్మానందం గాత్రదానం చేయడంతో కళ్లు మూసుకుని వుంటే బ్రహ్మానందమే నటిస్తున్నాడన్న భ్రాంతి కలిగింది. డిసిపి చంద్రబోస్‌గా జగపతిబాబు తనకు లెజెండ్ నుంచి సంక్రమించిన విలనీ ట్రెండ్‌ని మరోసారి సంరక్షించుకున్నారు. హిప్ హాప్ తమిళ అందించిన స్వరాల్లో ఏదీ గుర్తుంచుకునే స్థాయికి చేరలేదు. ‘కొంచెం నేనేమో నలుపు, నువ్వేమో తెలుపు’ అన్నపాట చిత్రీకరణ పరంగా బాగుంది. డబ్బే టాప్ అంటూ తెలుపుతూ రాసిన పాటలో పదాలు తెలియనంత స్థాయిలో వాద్యాల మోతలు ఉండటంతో కృషి నిష్ఫలమైంది. సీరియస్ పాయింట్ డిస్కస్ చేసిన చిత్రంగా అనిపించినా మితిమీరిన అర్థంలేని కామెడీ ఎక్కువ అవ్వడంతో అనుకున్నంత తీవ్రత ప్రేక్షకుల దరి చేరదు.

-అనే్వషి