రివ్యూ

క్లైమాక్స్‌తో తిప్పేశాడు! **మలుపు ( ఫర్వాలేదు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
ఆది, నిక్కీ గల్రానీ, మిథున్ చక్రవర్తి, శ్రావణ్, పశుపతి, రిచా పల్లాడ్ తదితరులు
సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్
నిర్మాత:
రవిరాజా పినిశెట్టి
దర్శకత్వం:
సత్య ప్రభాస్ పినిశెట్టి

‘మృగం’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ‘ఆది’ -‘వైశాలి’తో తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరయ్యాడు. కానీ- ‘ఆది’ నటించిన సినిమాలేవీ తెలుగులో అంతగా ఆడిన దాఖలాలు లేవు. చాన్నాళ్ల తర్వాత -తండ్రి రవిరాజా పినిశెట్టి సారథ్యంలో, తమ్ముడు సత్యప్రభాస్ దర్శకత్వంలో చిన్న ‘మలుపు’ తీసుకున్నాడు. ఆది -సినీ జీవితం ‘మలుపు’ తిరిగిందో? లేదో? చూస్తే.. యాక్షన్ థ్రిల్లర్‌ని ఇష్టపడే వారికి ఇదొక షడ్రసోపేత భోజనం. గంటల్లో జరిగే కథల్నీ.. ఓ రోజులో సాగే వాస్తవిక సంఘటనల సమాహారాల్నీ.. చూసిన ప్రేక్షకులకు.. నాలుగు రోజులపాటు ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథ కొంతమేర ఉత్కంఠ కలిగిస్తుంది. ఒక యధార్థ సంఘటనకు దృశ్యరూపమని చెప్పుకొచ్చారు -కాబట్టి ఆ కోణంలోంచి చూద్దాం.
కథ - సతీష్ గణపతి అలియాస్ సగ (ఆది) అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. తల్లిదండ్రుల మాట పట్టదు. తండ్రి ఏం చెప్పినా లక్ష్యం ఉండదు. అస్తమానం స్నేహితులతో మందుకొడుతూ.. అమ్మాయిలకు బీట్ వేస్తూ.. ఇలా ఏదీ పట్టని మనస్తత్వం. ఫ్రెండ్స్‌దే లోకం. వాళ్లుంటే చాలు -ఇంకెవ్వరూ అక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఓ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి పిచ్చాపాటీ కాలక్షేపం చేస్తూండగా.. ప్రియా (రిచా) అనే అమ్మాయిని ఆటపట్టిస్తాడు. అవమానిస్తాడు. ప్రియ ఎవరో కాదు- ముంబై డాన్ మొదలియార్ కూతురు. ఉన్నట్టుండి ప్రియ మాయమవటంతో మొదలియార్ అనుచరులు ‘సగ’పై పగ పడతారు. ఆ తర్వాత ఏమైందన్నది తెలిసిన కథ.
కథని సింపుల్‌గా రాసేసుకొన్నాడు దర్శకుడు. రెస్టారెంట్‌లో గొడవ. ఆ గొడవ కారణంగా మొదలియార్‌తో తలపడటం -అన్న కానె్సప్ట్‌ని అల్లుకొని.. ఫస్ట్ హాఫ్‌లో ‘సగ’ సరిగమల ప్రేమాయణాన్నీ.. ఫ్రెండ్స్‌తో అల్లరిచిల్లరి వ్యవహారాన్నీ సాగదీస్తూ ముగించి -సెకండ్ హాఫ్‌లోనూ అదే ధోరణితో లాగించేసి.. ఆఖరికి 30 నిమిషాల క్లైమాక్స్‌తో ‘యాక్షన్ థ్రిల్లర్’ని మరిపించాడు.
యాక్షన్ థ్రిల్లర్ అన్నారు కాబట్టి -కథ జోలికి అస్సలు వెళ్లకుండా ఉంటేనే వొంటికి మంచిది. కథని నడిపించిన తీరు ఆకట్టుకొంటుంది. ఎందుకంటే- స్క్రీన్‌ప్లే అంతా ‘వైశాలి’ నడక నడుస్తుంది. తాజాగా వెళ్తున్న కథ -్ఫ్లష్ బ్యాక్‌లో ప్రేమ ఇతివృత్తం.. సమాంతరంగా నడుస్తూంటాయి. అక్కడే ప్రేక్షకుల్ని బుట్టలో పడేశాడు సత్యప్రభాస్. ఐతే- ఇటువంటి కథల్లో లవ్ మేటర్ అస్సలు ఇమడదు. లవ్ గోల అనుకుంటే- ఈ కథలో ఎప్పుడు వస్తాయో తెలీని పాటలొకటి. కథకి అవసరమా? లవ్ ట్రాక్‌కి పనికొస్తాయా? అన్న సంగతి పట్టించుకోకుండా.. యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి సీరియస్‌నెస్ తగ్గించటం కోసం పాటల్ని ఎక్కడబడితే అక్కడ కూర్చేశారు. దాంతో -కథాగమనానికి అడ్డుపుల్లలుగా మారాయవి. క్లబ్ డాన్స్ పరిస్థితీ అంతే. కథ నిడివి పెంచాలి కనుక- కమర్షియల్ ఫార్మేట్ ప్రకారం వెళ్లారనుకొంటే- ఇవేవీ అవసరం లేదు కూడానూ. కచ్చితంగా రెండు గంటల పైచిలుకు ఉండాలన్న నియమం ఏమీ లేదుగా. మరి- ఎందుకీ వృధా ప్రయాస. అవే ఒక్కోసారి కథని దెబ్బతీస్తాయి. ఇక్కడ జరిగింది కూడా అదే.
‘మృగం’ లాంటి వినూత్న కథతో అలరించిన ఆది.. తర్వాత ‘వైశాలి’ ‘ఒక విచిత్రం’ చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేకత చాటాడు. ‘మలుపు’లోనూ ఎటువంటి భేషజాలకూ.. హీరోయిజం జోలికి పోలేదు. తన స్నేహితుల్ని.. తల్లిదండ్రుల్ని -ఓ డాన్ బారి నుంచి ఎలా రక్షించుకోవాలని ఎత్తుకి పైఎత్తులు వేసే సగటు కుర్రాడిగా కథలో చక్కగా ఇమిడిపోయాడు. కథానాయిక నిక్కీ చక్కగా నటించింది. వీరిద్దరూ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది కానీ.. పాటలేవీ క్యాచీగా లేకపోవటం అన్నది మైనస్ పాయింట్. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ -మిథున్ చక్రవర్తి. ముంబై డాన్ మొదలియార్‌గా మెప్పించాడు. క్లైమాక్స్‌లో కూడా డామినేట్ చేసేశాడు. విలన్‌ని హైలైట్ చేయటం కోసం -క్లైమాక్స్‌ని ఈ తరహాలో నడిపించాడా? అన్న సందేహం వెంటాడుతుంది. ఏది ఏమైతేనేం- మిథున్ చక్రవర్తి ఈ చిత్రంలోనూ తన స్టైల్‌ని చూపాడు.
యాక్షన్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారిని -ఈ సినిమా ‘మలుపు’ తిప్పుతుంది. ఆది పెర్‌ఫార్మెన్స్‌తో సగం సినిమా నడిస్తే.. మిగతా సగం ‘మిథున్’తో నడుస్తుంది. చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది. మిగతా సాంకేతిక శాఖలన్నీ తమతమ పరిధిలో సాగాయి. దర్శకుడిగా సత్యప్రభాస్ మరో అడుగు వేశాడు.

-ప్రనీల్