రివ్యూ

మ మ.. అనిపించిన వర్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **వంగవీటి
**
తారాగణం: సందీప్‌కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి,
నైనా గంగూలీ తదితరులు
మాటలు: చైతన్యప్రసాద్, రాధాకృష్ణ
ఎడిటింగ్: సిద్ధార్థ రాతోలు
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్‌వర్మ, సూర్యచౌదరి
సంగీతం: రవిశంకర్
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
**
సంచలన దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మకి ఓ గుర్తింపు ఉంది. తాజాగా తెరకెక్కించిన ‘వంగవీటి’ కథకూ సంచలన నేపథ్యముంది. దీనికి -కాపు కాసేశక్తి అంటూ ఆలోచనాత్మక, ఆసక్తికరమైన టాగ్‌లైన్ తగిలించటం మరో సెనే్సషన్. సెనే్సషన్ వెతుక్కుని సెనే్సషన్ చేయటం రామూ స్టయిల్ కనుక -తను చిన్నప్పుడు చూసిన ‘బెజవాడ రౌడీయిజం బ్యాక్‌డ్రాప్’పై సినిమా చేశాడు. ముంబయి మాఫియాని, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తెరకెక్కించిన అనుభవంతో -బెజవాడ వాస్తవ ఘటనలు ఆధారంగా ‘వంగవీటి’ని తెరకెక్కించానన్నాడు. దశాబ్దాల క్రితం నాటి బెజవాడ గ్రూపు తగాదాలు, రాజకీయ ఎత్తుగడలు, రక్తపు మరకలను వర్మ ఏకోణంలో చూపించాడన్న ఆసక్తి ఆడియన్స్‌కు కలగటం సహజమే. ఆంధ్ర రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన -వెంకటరత్నం, వంగవీటి రాధా, వంగవీటి మోహనరంగా, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళిల మధ్య గ్రూపు తగాదాలు, హత్యారాజకీయాలను ‘వంగవీటి’లో చూపించే ప్రయత్నం చేశాడు వర్మ.
బెజవాడలో కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకటరత్నం నీడలో ఎదిగిన వంగవీటి రాధ (సందీప్‌కుమార్). చివరకు తన ఎదుగుదలకు అడ్డుతగులుతున్న వెంకటరత్నాన్ని హత్యచేసి, బెజవాడపై ఆధిపత్యం సంపాదిస్తాడు. రాధాకు కళాశాల్లో చదువుతున్న గాంధీ (కౌటిల్య), నెహ్రూ (శ్రీతేజ్)లు దగ్గరవుతారు. స్టూడెంట్స్‌ని బలగాలు చేసుకునే ఆలోచన, గాంధీ, నెహ్రూల ప్రోద్బలంతో కాలేజీలో యునైటెడ్ ఇండిపెండెన్స్ యూనియన్ ప్రారంభిస్తాడు రాధా. తరువాత ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురవుతాడు. రాధా స్థానాన్ని రంగా (సందీప్‌కుమార్) ఆక్రమిస్తాడు. స్టూడెంట్స్ యూనియన్ బలంతో ఎదుగుతున్న గాంధీ, నెహ్రూలతో విభేదాలు తలెత్తుతాయి. కొత్త యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తారు. గ్రూపుల మధ్య పోరు మొదలవుతుంది. రంగా అనుచరులు గాంధీని హత్య చేస్తారు. అన్న గాంధీ హత్యతో రగిలిపోయిన చిన్న తమ్ముడు మురళి (వంశీ చాగటి) ఎవరిపై ప్రతీకారం తీరుకున్నాడు. నెహ్రూ తన కుటుంబం, వర్గాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు. రౌడీ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన రంగా హత్య ఎలా జరిగింది? అందుకు కారకులెవరు? అన్న విషయాలను తెరపై చూపేందుకు చేసిన ప్రయత్నం ఈ సినిమా.
**
యదార్థ సంఘటనల సమాహారం అన్న ప్రచారంతో -ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగటం సహజం. కానీ, బెజవాడ మారణహోమం తెలిసిన వాళ్లకు ‘వంగవీటి’ రుచించదు. కారణం -వివాదాస్పదమైన విషయాల్లోకి వెళ్లకుండా అందరికీ తెలిసిన కథనే చూపిస్తూ దర్శకుడు వర్మ ఎస్కేప్ రూట్‌లోకి వెళ్లిపోయాడు. ప్రధాన పాత్రలు పోషించిన సందీప్‌కుమార్ (రంగా, రాధ) నటన బావుంది. హత్యలు, వాటిని చేయడానికి రచించిన పథకాల బిల్డప్‌లో వర్మ శైలి కనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, దేవినేని మురళి హత్యకు గురైన విధానం సినిమాకు ప్లస్ పాయింట్స్. మురళిగా హ్యాపీడేస్ వంశీకృష్ణ బాగా చేశాడు. ఇతర పాత్రధారులు న్యాయం చేయగలిగారు.
సాంకేతికంగా -సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. వర్మ టేకింగ్ స్టయిల్ పెద్దగా కనిపించకున్నా -రాహుల్ శ్రీవాత్సవ్, కె దిలీప్‌వర్మ, సూర్యచౌదరి కెమెరాను బాగా డీల్ చేశారు. మూడు దశాబ్దాల క్రితంనాటి లుక్ ఇవ్వడంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం కనిపించింది. ఎడిటింగ్, డైలాగులు ఓకే. వివాదాస్పదమైన అంశాల జోలికిపోకుండా వర్మ జాగ్రత్తపడటంతో -వంగవీటి టైటిల్‌కు జస్ట్ఫికేషన్ మిస్సయ్యింది. క్లైమాక్స్‌లో రంగా హత్యకు కారకులెవర? ఎందుకు, ఎలా చంపారు? అన్న విషయాన్ని క్లారిటీగా చూపించటంలో వైఫల్యంపట్ల ఆడియన్స్ పెదవి విరిచేశారు. రామ్‌గోపాల్‌వర్మ వంగవీటి సినిమా చేయబోతున్నాడని ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠత ప్రేక్షకుల్లో కనిపించింది. కానీ, సినిమా చూసిన తర్వాత అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు. పైగా మితిమీరిన హింస ప్రేక్షకులను ఇబ్బందికి గురి చేసింది. మొత్తంమీద ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ను ఇష్టపడిన వారికి రియల్ గ్యాంగ్ వార్, రౌడీయిజం నేపథ్యంలో తీసిన ‘వంగవీటి’లో నచ్చే అంశాలు, అవకాశాలు చాలా చాలా తక్కువ.

-త్రివేది