రివ్యూ

శ్రుతితప్పిన సంధ్యారాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* పడమటి సంధ్యారాగం
*
తారాగణం:
చైతూ శాంతారాం, షాహిలా రాణి, ఫిరోజ్, లండన్ గణేష్, ధీరజ్ తోట, సూర్య, ధనరాజ్, వేణు,
ప్రత్యేక పాత్రలో ఆకాష్.
సంగీతం: కేశవ్ కిరణ్.
నిర్మాత: లండన్ గణేష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వంశీ మునిగంటి.
*
కొన్ని చిత్రాల పేర్లు అదోలా ఉన్నా, కంటెంట్‌తో అలరిస్తాయి. ఇంకొన్ని చిత్రాల పేర్లు కవితాత్మకంగా ఉన్నా, సినిమా నిస్సారంగా ఉంటుంది. రెండోకోవ చిత్రమే ‘పడమటి సంధ్యారాగం’. టైటిల్ చూడగానే 1987లో వచ్చిన జంధ్యాల సృష్టి సినిమా గుర్తుకు రావడం సహజం. ఆ పాజిటివ్ థాట్‌తో థియేటర్‌లోకి అడుగుబెట్టిన ప్రేక్షకుడిని -పూర్తిస్థాయిలో ఆడేసుకుందీ చిత్రం.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న అరవింద్ (చైతూ శాంతారాం), వేణు (లండన్ గణేష్)లకు సంస్థ ఎండి బలుపు భాస్కర్ (సూర్య) లండన్ ప్రాజెక్టు అప్పగించి పంపుతాడు. అప్పటికే బాపూ బొమ్మలాంటి సాంప్రదాయ అందగత్తెను పెళ్లాడాలని అరవింద్ కలలు కంటుంటాడు. అలాంటి అరవింద్‌కు లండన్‌లో అమూల్య (షాహిలారాణి) తారసపడుతుంది. ఆమెనే ఫిక్సయిపోతాడు అరవింద్. ఆ బాపూ బొమ్మను అరవింద్ పెళ్లి చేసుకున్నాడా? అందుకు ఎలాంటి అడ్డంకులు అధిగమించాడన్నది మిగతా కథ.
ప్రేమ కోసం హీరో పాట్లు తెలుగు సినిమాకు కొత్తేం కాదు. ఆ లిస్టులో ఇదొకటి తప్ప, ఏ రకంగానూ ప్రత్యేకం కాదు. ‘నవ్యత’ నాస్తి అనిపించుకున్నా, కనీసం కథనంలోనైనా నవ దర్శకుడు వంశీ మునిగంటి కొత్త టెక్నిక్‌తో వాసికెక్కాడా? అంటే అదీ కనిపించలేదు. ‘పడమటి సంధ్యారాగం’ అన్న టైటిల్‌కు టాగ్‌లైన్‌గా ‘లండన్‌లో’ అన్నదొక్కటే ప్రత్యేకత అనుకోవాలి. చిత్రం అధిక భాగం లండన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంది. అందుకు లండన్ అందాలనైనా పురివిప్పారా అంటూ అదీ శూన్యం. కొన్ని సన్నివేశాల్లో అయితే కేవలం సాంకేతిక సామర్థ్యంతో లండన్ భావన కల్పించారా? అన్నదీ ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఉదాహరణకు ధనరాజ్, వేణులు (ఒక్క సీనే) కనిపించిన సన్నివేశం. అయితే ఆ సన్నివేశంలో ఇటీవల రద్దయిన 500, వెయ్యి నోట్ల ప్రస్థావనతో సమకాలీన సంభాషణలు ఇమిడేలా చేయగలిగారు.
ఇక బాపూ బొమ్మలాంటి అమ్మాయి డ్రీమ్‌తో ఉన్న అరవింద్‌కు నాయిక అమూల్య తొలిసారి మోడ్రన్ డ్రెస్‌లో కనిపించటం ఆడియన్స్‌కి పంటికింది రాయి. రోహిత్ (్ఫరోజ్)కు అమూల్యతో జరిగే వివాహం ఉంగరాల వరకూ వచ్చి, క్రేజీ గ్యాంగ్ రాకతో ఒక్కసారిగా ‘నేను పెళ్లిచేసుకోను’ అని వెళ్లిపోయే సీన్‌లో స్పష్టత లేదు. వేణు పాత్ర ద్వారా హాస్యం పుట్టించేందుకు చేసిన ప్రయత్నం ‘టాయిలెట్’ దాటలేదు. నటీనటుల నటన విషయానికొస్తే కొత్త వాళ్లెవ్వరూ పాత్రల్ని శ్రద్ధపెట్టి చేసినట్టు అనిపించదు. ఉన్నంతలో నాయక పాత్రధారి చైతూ శాంతారాం మాత్రం ఆ ప్రయత్నం చేసినట్టు అనిపించినా, తెరపై ప్రతిఫలించలేదు.
ముఖ్యంగా ఉద్విగ్నభరిత సన్నివేశాల్లో ఆ మాదిరి వాతావరణాన్ని అందించడంలో విఫలమయ్యాడు. నాయిక పాత్రధారిణి షాహిలారాణి కొన్ని కోణాల్లో బాలీవుడ్ నటి బిపాసాబసులా ఉంది. తనకిచ్చిన పాత్రకు సాధ్యమైనంత సహజత్వాన్ని అద్ది వనె్న కలిగించే సీనియర్ నటుడు సూర్య కూడా ఈ చిత్రంలో బలుపు భాస్కర్ పాత్రలో కృత్రిమ నటనను ప్రదర్శించాడు. ఓ సన్నివేశంలో మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు ఎలా కనుమరుగు చేస్తాయో చూపినతీరు క్లుప్తంగా అయినా కనువిప్పు కలిగించేదిగా ఉంది.
సినిమాపరంగా కాస్తంత ఏదైనా బావుందీ అంటే కేశవ్‌కిరణ్ అందించిన స్వరాలు. ఈనాటి ట్రెండ్ అనిపించుకున్న రొద సంగీతానికి కాస్తంత దూరంగా వీలైనంతగా మెలోడీకి పెద్దపీట వేసి స్వరాలు కూర్చడం అభినందనీయం. ప్రత్యేకించి ‘ఎపుడూ చూడని ఏవో....’ అన్నది మరీ బాగుంది. ఓ పాటలో పెదవి పెదవితో పరిచయమైతే... శ్వాస శ్వాసతో పల్లవి.. అంటూ పదాలు రాసిన తీరు బాగున్నా దానికి జస్ట్ఫికేషన్ తదుపరి కొనసాగింపు పదాల్లో కల్పించి వుంటే, పైన పేర్కొన్న పదాలు అర్ధవంతంగా ఉండేవి. మొత్తానికి టైటిల్.. పడమటి..!లో ఉన్న ప్రశాంతత, ఆహ్లాదం చిత్రంలో లేకపోవడం నిరాశ కల్గించింది.

-అనే్వషి