రివ్యూ

అభిమానులనే మెప్పించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** కాటమరాయుడు
**
తారాగణం: పవన్‌కళ్యాణ్, శృతిహాసన్, శివబాలాజీ, కమల్ కామరాజ్, కృష్ణచైతన్య, అలీ, అజయ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటింగ్: గౌతమ్‌రాజు
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం:
కిశోర్‌కుమార్ పార్థసాని (డాలి)
**
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మెగా అభిమానుల్లో కోలాహలం మామూలుగా ఉండదు. సర్దార్ గబ్బర్‌సింగ్ పరాజయంతో నిరుత్సాహపడిన అభిమానులను అలరించేందుకు పవన్ చేసిన ప్రయత్నమే కాటమరాయుడు. అటు టైటిల్‌తోను, ఇటు పంచెకట్టుతో ఫస్ట్‌లుక్ విడుదల చేయడం దగ్గర్నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు పవన్ పక్కన గబ్బర్‌సింగ్‌తో మెప్పించిన శృతిహాసన్ హీరోయిన్ అనేసరికి అభిమానులు మరీ వెర్రెక్కిపోయారు. డాలి దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం కాటమరాయుడు.
రాయలసీమలోని ఒక ఊరి పెద్ద కాటమరాయుడు (పవన్‌కళ్యాణ్). ఊళ్లో పేదలను పీడించే ధనవంతులకు ఎదురు నిలుస్తూ, తనను నమ్ముకున్న వారి బాగోగులు చూస్తుంటాడు. కాటమరాయుడికి నలుగురు తమ్ముళ్ళంటే ప్రాణం. పెళ్లి చేసుకుంటే తమ మధ్య గొడవలు వస్తాయనే భయం, తముళ్లకు అన్యాయం జరుగుతుందన్న భయంతో పెళ్లి కూడా చేసుకోకుండా ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ అతని నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధమవుతారు. దానికి ముందుగా అన్నయ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుని, ఆయన్ని అదే ఊరికి పనిమీద వచ్చిన అవంతిక (శృతిహాసన్)తో ప్రేమలో పడేలాచేస్తారు. అలా అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో కాటమరాయుడు, అవంతికల మీద అటాక్ జరుగుతుంది. ఆ దాడితో అవంతిక కుటుంబం పెద్ద ఆపదలో ఉందని రాయుడికి తెలుస్తుంది. అసలు రాయుడు, శృతిల మీద అటాక్ చేసింది ఎవరు? అవంతిక కుటుంబానికి పొంచివున్న ఆపద ఏమిటి? ఆ ఆపదనుండి రాయుడు తన వాళ్ళను ఎలా కాపాడుకుంటాడు? అన్నది మిగతా సినిమా.
సహజంగానే సినిమాకు హైలెట్ పవన్‌కళ్యాణ్. తన చరిష్మాతో అభిమానుల్ని ఉర్రూతలూపాడు. అచ్చమైన పంచెకట్టులోని కొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు. గోపాల గోపాల తరువాత భిన్నమైన గెటప్‌తో పవన్ సత్తా చాటాడు. ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసి డిజైన్ చేసిన ఫైట్స్, పంచ్ డైలాగులు, డ్యాన్సులు బోల్డంత కనువిందు. కామన్ ఆడియన్స్ ఎంజాయ్‌మెంట్‌కీ కావాల్సినంత సరుకుంది సినిమాలో. శృతిహాసన్‌తో నడిచే రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ పెర్ఫార్మెన్స్ బావుంది. మొదటి భాగంలో తమ్ముళ్లు రాయుడిని ప్రేమలోకి దించే ట్రాక్‌లో అలీ జనరేట్ చేసిన కామెడీ పండింది. రీమేక్ చిత్రమే అయినప్పటికీ దర్శకుడు డాలి ఒరిజినల్ వెర్షన్‌లోని కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని వాటిని కూడా తెలుగు నేటివిటీకి, అందులోనూ పవన్ స్టేటస్‌కి తగినట్టు మార్చుకుని సినిమాను చాలావరకు ప్రేక్షకులకు నచ్చేలా నడిపాడు. ఫస్ట్ఫాలో పవన్ పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలు, ఫ్రెష్ కామెడీ, రొమాన్స్‌తో సరదాగా సాగిపోయింది. సెకండాఫ్ ఆరంభంలోనూ అభిమానుల్ని మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. పవన్ తమ్ముళ్లుగా శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజ్, కృష్ణచైతన్యలు తమ పాత్రలమేరకు నటించారు. హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్ మాత్రం ఒకింత నిరుత్సాహపరుస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే. రావు రమేష్ తన స్టయిల్ క్యారెక్టర్‌ను పోషించాడు. సాంకేతికంగా ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బాగుంది. రాయలసీమలోని పల్లెటూరి వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించగలిగాడు. తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తయారు చేయడంలో రచయిత ఆకుల శివ, దానికి ఫస్ట్ఫా వరకు మంచి ఆకట్టుకునే కథనాన్ని ఇవ్వడంలో వాసువర్మ, దీపక్‌రాజ్‌లు, తెరకెక్కించడంలో దర్శకుడు డాలి చాలావరకు సక్సెస్ అయ్యారు. సెకండాఫ్ మీద టీమ్ పెద్దగా దృష్టిపెట్టినట్టు అనిపించదు. అనూప్ రూబెన్స్ బాణీలకంటే, పాటలను విజువలైజ్ చేయడం బావుంది. సెకండాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చివరి పాట సాదాసీదాగా సాగిపోయింది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒక్క క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగిలినవన్నీ పవన్‌స్థాయికి తగ్గట్టు ఉండి మాస్ ప్రేక్షకులకు కనెక్టవుతాయి. గౌతమ్‌రాజు ఎడిటింగ్, శరత్ మరార్ నిర్మాణ విలువలు ఓకే.
గొప్పగా సినిమా ఆరంభమైనా, సినిమా నడిచేకొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గడం పెద్ద మైనస్. ఇటీవల వస్తున్న సినిమాలకు తీసిపోనట్టు రొటీన్ మూస కథనం. ప్రీ క్లైమాక్స్‌లోని ప్రతి సన్నివేశం గ్రిప్పింగ్‌గా లేకపోవడంతో -థ్రిల్ మిస్సవుతాం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు శ్రీమంతుడు చిత్రంలోని సన్నివేశాలను గుర్తుకుతెస్తాయ. ఒక పాట, తర్వాత ఫైట్ అన్నట్టు చివరి 40 నిముషాల సినిమా సాగుతూ ఆసక్తిని చంపేస్తుంది. క్లైమాక్స్‌లో పవన్ ఇమేజ్‌కు తగినంత కొత్తదనం కనపడదు. పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రంతో మరోసారి అభిమానులు మెచ్చే కథానాయకుడని అనిపించుకున్నాడు. పవన్ పవర్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ పాయింట్లు అయితే, సెకెండాఫ్‌లో రొటీన్ మెలో డ్రామా, థ్రిల్ కలిగించని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, పీల్‌లేని బిజి స్కోర్ మైనస్ పాయింట్లు.
*
-త్రివేది

-త్రివేది