రివ్యూ

దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *ఎంతవరకు ఈ ప్రేమ
*
తారాగణం: జీవా, కాజల్, అనంత్ రాజ్, ఆర్.జె.బాలాజీ, శరవణన్, రాశి, బాబి సిన్హా తదితరులు
కెమెరా: అభినందన్ రామానుజమ్
సంగీతం: లియోన్ జేమ్స్
నిర్మాత: డి.వెంకటేష్
దర్శకత్వం: డి.కె.
*
ప్రేమించుకోవడం సులువు. పెళ్లిచేసుకోవడం ఇంకా సులువు. కానీ జీవితాంతం కలిసి వుండడం మాత్రం సులభమైన విషయం కాదు.
ప్రేమ పుట్టగానే జీవితాంతం కలిసివుందాం అనుకుంటారు ప్రేమికులు. ఒక్కసారి ప్రేమించాక ఎదుటి వ్యక్తి బలాలు, బలహీనతలు పాజిటివ్‌గా తీసుకోగలగాలి. అలా ఆలోచించలేకపోతే ఆ ప్రేమ పెళ్లయినా విడిపోక తప్పదు. అటువంటి ఓ జంట కథనాన్ని తీసుకొని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో విడుదలైన ఈ సినిమా జీవా, కాజల్ కాంబినేషన్‌లో ఆకట్టుకుంది. తెలుగులోకొచ్చేసరికి కేవలం కాజల్ స్టామినాపై కలెక్షన్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
అరవింద్ (జీవా) దివ్య (కాజల్) ఇష్టపడి పెళ్లిచేసుకుంటారు. రిజిస్ట్రార్ ఆఫీసులో తాళికట్టిన క్షణం నుండి దివ్యకు అరవింద్‌పై అసహ్యం కలుగుతుంటుంది. అతను చేసే ప్రతి పని ఆమెకు నచ్చదు. దీంతో కేవలం తాళి కట్టించుకొని ఇష్టం లేదంటూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. ఆ తరువాత రెండు సంవత్సరాలపాటు విడి విడిగా వున్న తరువాత దివ్య అర్జున్ (బాబి సిన్హా) ప్రేమలో పడుతుంది. అతన్ని పెళ్లిచేసుకోవాలంటే అరవింద్ విడాకులివ్వాలి. పెళ్లై సంసారం చేసింది ఏమీ లేదు కనుక, విడాకులు అవసరం లేదు అని అరవింద్ అన్నా కానీ, విడాకుల కోసం పట్టుపడుతుంది దివ్య. విడాకులివ్వాలంటే తాను చెప్పే కొన్ని రూల్స్‌ను పాటించాలంటాడు అరవింద్. ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చేస్తా అంటుంది దివ్య. అలా కాదు, ఓ పది రోజులపాటు తనతో భార్యగా వ్యవహరించమంటాడు. అందుకు ఒప్పుకున్న దివ్య, అతడి ఇంట్లో చేరుతుంది. ఆమెతోపాటు ఆమె ప్రియుడు అర్జున్, అరవింద్‌ను ప్రేమిస్తున్న దీప, వాళ్ల స్నేహితులు- అందరూ కలిసి ఒకే ఇంట్లో మకాం పెట్టేస్తారు. ఇంతమంది మధ్య నాటకీయత, మధ్యమధ్యలో కామెడీ ట్రాక్‌లు వేసుకుంటూ కథను నడిపించారు. చివరగా దివ్యకు అరవింద్ విడాకులు ఇస్తాడా లేదా? అర్జున్‌ను దివ్య పెళ్లిచేసుకొందా? అనేది ముగింపు సన్నివేశాలు.
దర్శకుడు కథనాన్ని నేటి యువతరం ఆలోచనలకు తగిన విధంగానే రాసుకొన్నా, సన్నివేశాలు బలంగా డిజైన్ చేయలేకపోయాడు. అరవింద్- దివ్యలమధ్య వచ్చే సీన్లు ఆకట్టుకునేలా ఉన్నా, స్నేహితులతో వచ్చే సీన్లు మాత్రం బోరుకొట్టిస్తాయి. ఓ మంచి కథకు సరైన కామెడీ ట్రాక్ లేకపోవడంతో స్నేహితుల పాత్రలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. హీరో హీరోయిన్లు సినిమాకు వెళ్లడం, ఒకవైపు భర్తతో, మరోవైపు కాబోయే భర్తతో కలిసి ఉండడం, ఎంగిలి చాక్‌లెట్స్ కోసం ఫైట్ చేయడం, టాయ్‌లెట్ పరుగులు, తలకు దెబ్బతగలడం, దాంతో హీరోకు ‘అమీషా’ రావడం లాంటి సన్నివేశాలు విపులీకరించలేదు. అమీషా రావడంతో గతం మర్చిపోయిన హీరో కేవలం దివ్యను మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. తాళికట్టిన క్షణంవరకు ఏం జరిగిందో అతనికి గుర్తుంటుంది. ఆ తరువాతదే గుర్తుండదు. ఈ నేపథ్యంలో మరికొంత డ్రామా నడిపించే ప్రయత్నం జరిగింది. కానీ, అది ఆకట్టుకునేలా సాగకపోవడం మైనస్. మొత్తానికి కథ సరికొత్తగా వున్నా కథనంలో లోపాలతో సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
నటుల్లో జీవా నటనలో మొనాటనీ కనిపించింది. ఉన్నంతలో కాజల్ ఓ వైపు గ్లామర్ ఒలకపోస్తూ మరోవైపు నటించే ప్రయత్నం చేసింది. రాశి చిన్న పాత్ర అయినా ఆకట్టుకుంటుంది. అనంత్‌రాజ్ చాలాకాలం తరువాత కనిపించి ఫేడౌట్ కోవలో చేరిపోయాడు. సాంకేతికపరంగా కెమెరా పనితనం సినిమాకు హైలెట్. ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అన్నీ అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. సంగీతపరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకు పాటలు మైనస్. ‘నేను కొట్టిన మేకుకు నువ్వు ఫొటో తగిలిస్తావా’ లాంటి మాటలతో ఒకవైపు అశ్లీలం, మరోవైపు కామెడీ సృష్టించే ప్రయత్నం మాటల రచయిత చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వ పరంగా కథ బాగున్నా, సన్నివేశాల కూర్పు ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.

-శేఖర్