రివ్యూ

చేజారిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** చెలియా
**
తారాగణం: కార్తీ, అదితి రావు హైదరీ, ఆర్‌జె బాలాజీ, ఢిల్లీ గణేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.రవివర్మన్
సంగీతం: ఎఆర్ రెహమాన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మాటలు: కిరణ్
సమర్పణ: దిల్‌రాజు
నిర్మాతలు: మణిరత్నం, శిరీష్
రచన, దర్శకత్వం: మణిరత్నం
**
వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించగల దర్శక దిట్ట మణిరత్నం. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమ కథలను పండించటంలో ఆయనకంటూ ఓ స్టయిల్ ఉంది. పోస్టర్ డిజైన్‌పైనా మణిది ఓ ప్రత్యేక సంతకం అన్న ముద్ర ఉంటుంది. రొటీన్ లవ్ స్టోరీలను సైతం వైవిధ్యమైన కోణంలో చెప్పి చూపించగలడన్న పేరుంది కనుకే -స్టార్ హీరోలు సైతం ఒక్కటైనా మణితో సినిమా చేయాలని తపన పడుతుంటారు. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆయన లవ్‌స్టోరీను అభిమానించే ఆడియన్సూ ఉన్నారు. అందుకే ఆమధ్య వరుస పరాజయాల చవిచూసినా ‘ఓకే బంగారం’తో మళ్లీ మణిరత్నం ట్రాక్‌మీదకు వచ్చేశాడు. అదే ఉత్సాహంతో చేసిన తాజా చిత్రం ‘చెలియా’. కార్తీ, అదితిరావు జంటగా ‘కాట్రు వెలియిదై’ పేరిట తమిళంలో రూపొందించిన చిత్రాన్ని చెలియా పేరుతో తెలుగులో విడుదల చేశారు.
1999లో ఇండియా -పాక్‌ల మధ్య జరిగినక కార్గిల్ యుద్ధ నేపథ్యంలో కథ మొదలవుతుంది. వరుణ్ (కార్తీ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్. యుద్ధంలో భాగంగా వరుణ్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను శత్రువులు నేలకూల్చుతారు. పార్యాచూట్ ద్వారా ప్రాణాలు దక్కించుకున్న వరుణ్‌ని పాక్ సైన్యం బంధిస్తుంది. కొనేళ్లపాటు పాక్ జైల్లోనే మగ్గిపోతాడు. వరుణ్ జైలు జీవితం సమయంలో చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ నుంచి లవ్‌స్టోరీ ఓపెనవుతుంది. ప్రేమ, అనుబంధాలు వంటి విషయాల గురించి అంతగా పట్టించుకోని వరుణ్ అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలించుకొని ఆస్పత్రిలో చేరిన వరుణ్‌కి అక్కడి డ్యూటీ డాక్టర్ లీల పరిచయం అవుతుంది. ఊహించలేనంత తొందరగానే ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. రిలేషన్ షిప్ అంటేనే పడని వరుణ్.. లీలని పెళ్లి చేసుకోవడానికి వెనకాడతాడు. దీంతో లీల అతనినుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో వరుణ్ పాకిస్తాన్ సైన్యానికి బందీ అవుతాడు. జైల్లో అతనికి జ్ఞానోదయం అవుతుంది. ప్రేమ ముఖ్యం, తన ప్రియురాలు ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. స్నేహితుల సాయంతో జైలునుంచి తప్పించుకొని ఇండియా చేరుకున్న వరుణ్.. లీల ఎక్కడుందో వెతకటం మొదలెడతాడు. లీలను కనిపెట్టగలిగాడా? ఆమెను, తన కూతుర్ని కలుసుకోగలిగాడా? లీల వరుణ్‌నే లవ్ చేస్తోందా? చివరికి ఇద్దరు కలిసారా? లేదా? అన్నదే చెలియా కథ.
నిజానికి ఇదేం కొత్త కథ కాకున్నా, దర్శకుడు మణిరత్నం తన స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేశాడు. మణిరత్నం సినిమా అంటేనే స్లోనేరేషన్. ఇది మరింత మందగించి సాగడం పెద్ద మైనస్ అయ్యింది. స్లో నేరేషన్‌తో కనెక్ట్ కాలేకపోతాం. కథ ప్రారంభమైన కొద్దిసేపటికే సినిమాలో అసలు విషయం అర్థమైపోవడంతో -కూర్చోడానికి ఎక్కడలేని ఓపిక తెచ్చుకోక తప్పదు. తరువాత ఏం జరగబోతోంది? కథ ఎన్ని మలుపులు తిరుగుతుందీ? అనే విషయంలో ఆడియన్స్‌లో ఎలాంటి క్యూరియాసిటీ కలిగించలేకపోయాడు దర్శకుడు. సంభాషణల్లోనూ మణిరత్నం మార్క్ ఆర్ద్రత కరవవ్వడంతో బోరింగ్ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అర్థంకాని సంభాషణలు తికమకపెడతాయి. హీరో పాత్ర విషయంలో సరైన క్లారిటీ లేకపోవడం కూడా తికమక తప్పలేదు. హీరో ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు అవమానించినా హీరోయిన్ అతన్ని విపరీతంగా ప్రేమిస్తుంది. కొనే్నళ్ల తర్వాత తనని, కూతుర్ని చూడడానికి వచ్చిన హీరోపై ఎప్పటిలాగే ప్రేమ కురిపిస్తుంది. అలా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సైతం సహజత్వానికి దూరంగా ఉండటం భరించలేం. నటనపరంగా వరుణ్‌గా కార్తీ, లీలగా అదితిరావు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. ప్రతి సన్నివేశంలో తమ నటనతో ఆకట్టుకున్నారు. లవ్ స్టోరీ కనుక మిగతా పాత్రలన్నీ లీడ్ పాత్రలకు సపోర్టే తప్ప, ప్రత్యేకత ఏమీ లేదు. పరిధిమేరకు నటించారు.
రవివర్మ పెయింటింగ్ లాగ ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు మణిరత్నం. విజువల్స్ అద్భుతమే అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయిన రెహమాన్, ఈ సినిమాపై పెద్దగా దృష్టిపెట్టిన దాఖలా కనిపించదు. హంసరో.. పాట తప్ప మిగతా పాటలన్నీ ఏమాత్రం ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతం. సినిమాకు కాస్త వేగంగా నడిపించే అవకాశం లేకపోవడంతో ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ శక్తిమేరకు చేశాడని చెప్పాలంతే. కిరణ్ రాసిన మాటలు ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ‘ఓకే బంగారం’ లాంటి పాజిబుల్ లవ్‌స్టోరీని వైవిధ్యంగా చూపించిన మణిరత్నం ‘చెలియా’తో పాజిటివ్ లైన్ ఎత్తుకున్నా ఫలితం కనిపించలేదు. కథ, కథనాల విషయంలో ఎక్కడా కొత్తదనం లేని సినిమా ప్రేక్షకులకు నచ్చే అవకాశం తక్కువ.
మణిరత్నం రొమాంటిక్ డ్రామా, టేకింగ్‌ను ఇష్టపడే ప్రేక్షకులు చెలియా నసను భరించటం కష్టమే. కార్తీ, అదితిరావ్ హైదరిల మధ్య కెమిస్ట్రీ, ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫస్ట్ఫా ఇందులో ప్లస్ పాయింట్లు. ఎంత సాగదీసినా ఎలాస్టిక్‌లా సాగుతూనే ఉండే సెకెండాఫ్ అతి పెద్ద మైనస్.

-త్రివేది