రివ్యూ

మెప్పించే యాక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం ** ఫర్వాలేదు

తారాగణం:
డా.రాజశేఖర్, పూజాకుమార్,
శ్రద్ధాదాస్, నాజర్, పోసాని కృష్ణమురళి,
పృథ్వీ, అలీ, అదిత్ అరుణ్, సన్నీలియోన్ షాయాజీ షిండే తదితరులు
సినిమాటోగ్రఫీ: అంజి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, భీమ్స్ సిసిరిలియో
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
కథ: ప్రవీణ్ సత్తారు, నిరంజన్‌రెడ్డి
సమర్పణ: శివాని శివాత్మిక మూవీస్
నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు
రచన, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

యాంగ్రీ యంగ్‌మెన్‌గా తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌కు ఈమధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెట్టాయి. ‘గడ్డం గ్యాంగ్’ తరువాత ఆయన విలన్‌గా చేస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలకు పెట్టింది పేరు రాజశేఖర్. అందుకే ఆయా పాత్రల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు. తాజాగా మరోసారి ఆయన పోలీసు అధికారిగా నటించిన చిత్రం ‘పిఎస్‌పి గురుడవేగ 126.18ఎం’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ఓ కొత్త తరహా ప్రయత్నమే అని చెప్పాలి. భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అసలు‘పిఎస్‌పి గురుడవేగ 126.18ఎం’ అంటే ఏమిటి? అసలు ఈ కథ ఏమిటి అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఎన్‌ఐఏలో ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు శేఖర్ (రాజశేఖర్). అతడి భార్య (పూజాకుమార్)కు అతని విషయంలో ప్రతి విషయం గొడవకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఓ సంక్లిష్టమైన కేసును టేకప్ చేస్తాడు శేఖర్. పోలీసులకు సవాల్‌గా మారిన ఓ హ్యాకర్ (ఆదిత్) అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతాడు. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు? అతడు ఎందుకు ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాడు. దీని వెనుక దాగి వున్న కుట్ర ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
రాజశేఖర్ చెప్పినట్టే ఈ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్ మూవీగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాజశేఖర్ చేయని ఓ కొత్త క్యారెక్టర్‌ని ఎంతో చక్కగా పెర్‌ఫార్మెన్స్ చేశారు. ఉద్యోగ ధర్మం కోసం భార్యని, కొడుకుని పట్టించుకోని భర్తగా, తండ్రిగా మెచ్చే నటనను కనబరిచారు. అలాగే ఎన్‌ఐఎ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి నటనను ప్రదర్శించారు. కీలకమైన నిరంజన్ పాత్రలో ఆదిత్ అరుణ్ బాగా సెట్ అయ్యాడు. హీరోయిన్ పూజాకుమార్ కూడా చికాకు పుట్టించే భార్య పాత్రలో బాగానే నటించింది. శ్రద్ధాదాస్ పాత్ర ఫర్వాలేదనిపించే విధంగా వుంటుంది. ఆదర్శ్ బాలకృష్ణ పాత్ర చిన్నదైనప్పటికీ ప్రేక్షకులని థ్రిల్‌కు గురిచేస్తుంది. మొదటి అర్థ్భాగం మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. ఛేజింగ్ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సన్నీలియోన్ స్పెషల్ సాంగ్‌లో మాస్ జనాల్ని మెప్పిస్తుంది. చంద్రశేఖర్ కొలీగ్స్‌గా రవివర్మ, చరణ్‌దీప్ మంచి సపోర్టుని అందించారు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాజర్ ఓకె అనిపించారు. స్పెషల్ పాటతో యూత్‌ని, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది సన్నీలియోన్. ఇక అలీ, పృథ్వీ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ అది అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు.
ఇటీవలకాలంలో వచ్చిన మంచి టెక్నికల్ సినిమా గరుడవేగ. కెమెరామెన్ అంజి అద్భుతంగా చిత్రీకరించాడు. చిత్రీకరణ స్టయలిష్‌గా కనిపిస్తూ హాలీవుడ్ స్థాయిని తలపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు థ్రిల్‌కు గురిచేస్తుంది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోబలం.
ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే, ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ఆడియన్స్‌ని కనెక్ట్ చేసి ప్రారంభం నుండి క్లయమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం గొప్ప విషయం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలా ఇందులో పాటలు, కామెడీ లేవు. అయినా తన ప్రతిభతో ప్రవీణ్ చేసిన మ్యూజిక్ ఆడియెన్స్‌కి ఓ కొత్త అనుభూతినిస్తుంది. గరుడవేగ చిత్రం ద్వారా మరో స్థాయిని చేరుకుంటాడు. రాజశేఖర్ పాత్రని మలచిన విధానం బాగుంది. భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ యూత్‌కి ఓ స్పెషల్ అట్రాక్షన్ కాగా, శ్రీచరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాని పరిగెత్తించింది. కథలో ఎంతో వైవిధ్యం ఉంది. ఇప్పటివరకు తెలుగులో రాని ఓ ఇంటర్నేషనల్ స్కామ్‌కి సంబంధించిన కథా వస్తువును ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. నిర్మాత ఎం.కోటేశ్వరరాజు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు సెకెండ్ హాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. సినిమా ద్వితీయార్థం కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. రాజశేఖర్, పూజాకుమార్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు చికాకు పెట్టించాయి. కథకు కీలకమైన స్కామ్ మొత్తాన్ని రివీల్ చేసే విధానంలో క్లారిటీ లేదు. దాంతో ప్రేక్షకులకు అసలు పాయింట్ ఏంటనే విషయం అర్థం కావడం కష్టంగా అనిపిస్తుంది. ఇక ప్రధాన విలన్ కిశోర్ నటన బాగున్నా, ఆయన కనిపించే సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. యాక్షన్ చిత్రానికి కావలసిన అన్ని లక్షణాలు ఈ చిత్రంలో ఉన్నాయి. స్టయలిష్ మేకింగ్, రియాలిటీకి దగ్గరగా ఉండడం వంటి అంశాలన్నీ ఆకట్టుకుంటాయి. ఎన్‌ఐఎ సెటప్, ఇక సెకండ్ హాఫ్‌లో కాస్త మందగించిన కథనాన్ని, కొంత ఓవర్‌గా అనిపించే సన్నివేశాలను పక్కనపెడితే ఈ చిత్రంలో రాజశేఖర్ వన్ మ్యాన్ ఆర్మీగా ఆకట్టుకునే యాక్షన్‌ను ప్రేక్షకులు ఎంత గానో ఎంజాయ్ చేస్తారు. రాజశేఖర్‌కు చాలా రోజుల తర్వాత కావాల్సిన కిక్ ఇచ్చే చిత్రమిది.

-త్రివేది