రివ్యూ

కంగాళీరకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు ఈడోరకం ఆడోరకం
--

తారగణం: మంచు విష్ణు, రాజ్‌తరుణ్, హెబాపటేల్, సోనారికా బదోరియా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి అభిమన్యుసింగ్ తదితరులు.
సంగీతం: సాయికార్తీక్
కెమెరా : సిద్ధార్థ్‌వర్మ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

--

సాధారణంగా.. సినిమాల్లో ఎన్నో రకాల జోనర్స్ ఉండడం అనేది తెలిసిన విషయమే. అందులో.. యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్, మెసేజ్ ఓరియంటెడ్, ఫీల్‌గుడ్ మూవీస్, కామెడీ.. ఇలా రకరకాల సినిమాలు వున్నా కూడా ఎక్కువ శాతం ఆడియన్స్ ఇష్టపడేది మాత్రం కామేడీ ఎంటర్‌టైనర్స్‌నే. జి.నాగేశ్వరరెడ్డి కూడా కామెడీనే నమ్ముకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నాగేశ్వరరెడ్డి సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్‌లో వుంది. ఆ నమ్మకంతోనే మంచు విష్ణు, రాజ్‌తరుణ్ హీరోలుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. వినోదం ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో ఎవరు ఏ రకమో తెలియాలంటే మాత్రం కథలోకి వెళ్ళాల్సిందే...? నిజానికి ఈ సినిమా కామెడీలో రూపొందిన కన్‌ఫ్యూజన్ డ్రామా అని చెప్పాలి. ఇక అసలు కథలోకి వెళితే.. అర్జున్, అశ్విన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అర్జున్ తండ్రి నారాయణ (రాజేంద్రప్రసాద్) సిటీలో పెద్ద లాయర్. అశ్విన్ తండ్రి కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) సబ్ ఇన్‌స్పెక్టర్. అర్జున్, అశ్విన్ కలిసి ఓ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ నీలవేణి (సోనారికా)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అర్జున్. సుప్రియ (హెబాపటేల్)ను చూసి ఇష్టపడతాడు అశ్విన్. కానీ, సుప్రియ మాత్రం అతనికి ముందే పడిపోతుంది. అలా వారి ప్రేమ మొదలవుతుంది. ఒక అనాథను పెళ్ళిచేసుకుంటానని తన ఫ్రెండ్స్‌తో నీలవేణి చెప్పిన మాటలు విని షాక్‌అయి తాను కూడా అనాథగా మారిపోతాడు అర్జున్. ఆ తర్వాత అతన్ని నీలవేణి కూడా ప్రేమిస్తుంది. నీలవేణి అన్నయ్య గజన్న (అభిమన్యుసింగ్) పెద్ద రౌడీ. అర్జున్ అనాథ అని తెలిసి తన చెల్లెలికి, అర్జున్‌కి రిజిష్టర్ మ్యారేజ్ చేసేస్తాడు. నీలవేణి భర్తతో కలిసి ఒక ఇల్లు తీసుకొని రెంట్‌కి వుండాలని డిసైడ్ అవుతుంది. అనుకోకుండా అర్జున్ తండ్రి నారాయణ ఇల్లునే నీలవేణి సెలెక్ట్ చేస్తుంది. ఇది తెలుసుకొని షాక్ అయిన అర్జున్ నీలవేణి భర్తగా అశ్విన్‌ని రంగంలోకి దించుతాడు. ఇక అక్కడినుంచి ఆ ఇంట్లోవారికి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పరిస్థితులవల్ల అశ్విన్, సుప్రియ కూడా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తను నారాయణ కొడుకునని సుప్రియ అన్నయ్యకు చెప్తాడు అశ్విన్. అలా ఈ పెళ్ళిలోకూడా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అర్జున్, అశ్విన్ ఆడుతున్న ఈ ఆటలో ఎవరు ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యారు? దానివల్ల ఎలాంటి అపార్థాలు చోటుచేసుకున్నాయి? తను అనాథ అని అబద్ధంచెప్పి నీలవేణిని పెళ్ళిచేసుకున్న అర్జున్‌కు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి.. అనేది తెరపై చూడాల్సిందే. ఇక కన్‌ఫ్యూజన్ డ్రామాతో ఇప్పటికే చాలా కథలను చూసేసారు జనం. మరోవైపు కన్‌ఫ్యూజన్ డ్రామా ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తుంది. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే బలవంతంగా ఆడియన్స్‌ని నవ్వించేందుకే ప్రయత్నం చేశారన్నట్టుగా ఉంటుంది తప్ప సరైన కథ మాత్రం కుదరలేదు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ నటించినట్టుగానే ఉంది కాని ఎక్కడ సహజత్వం కనిపించలేదు. ఇక మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ల పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీలేదు. హీరోయిన్స్ విషయానికొస్తే సోనాలికా బడోరియా తన చూపులతోనే కాదు అందచందాలతో కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేసింది. తన స్కిన్‌షో కలర్‌ఫుల్‌గా గ్లామర్ నింపినా కూడా, సోనారిక హీరోయిన్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక హెబాపటేల్ క్యారెక్టర్ కుమారి 21ఎఫ్ క్యారెక్టర్‌కి కొనసాగింపా అనేలా ఆమె డైలాగ్స్ గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, రవిబాబు ఆడియన్స్‌ని నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేశారు. దానికోసం డైలాగ్స్ కూడా కాస్త ఓవర్‌గా అయ్యాయి.
హాట్ సమ్మర్‌లో కూల్ సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి టెక్నికల్‌గా హెల్ప్‌అయ్యే అంశాలు ఏమీలేవు. సిద్ధార్థ్ ఫొటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. ఇక సాయికార్తీక్ అందించిన సంగీతం జస్ట్ పరవాలేదనిపించాయి. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ఆవరేజ్‌గా నిలిచింది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ వర్క్ అంతా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. డైమండ్ రత్నబాబు రాసిన డైలాగ్స్ సినిమాలో అక్కడక్కడా పేలాయి. కొన్ని డైలాగ్స్ నవ్వు తెప్పించేవిగా వున్నాయి. అయితే డైలాగ్స్‌లో ప్రాసకోసం ప్రాకులాట ఎక్కువగా కనిపించింది. డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గతంలో చేసిన సినిమాలు దీనికంటే మెరుగ్గా వున్నాయని చెప్పొచ్చు. కామెడీ సినిమాల్లో తనకున్న కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయలేదు. ఇక ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి. మంచు విష్ణు గత కొంతకాలంగా హిట్‌కోసం తపించి ఉన్నాడు. అయితే సినిమాపరంగా తనవరకు పర్ఫెక్ట్‌గా చేసుకుంటూపోతున్న విష్ణు సక్సెస్ కొట్టడంలో కాస్త వెనుకపడుతున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్న రాజ్‌తరుణ్‌కు లాస్ట్ రిలీజ్ సీతమ్మ అందాలు.. సినిమా ఫ్లాప్‌అయ్యింది. అయితే ఆ సినిమాపోవడంవల్ల ఆలోచనలోపడ్డ రాజ్‌తరుణ్ ఈ సినిమాతో హిట్‌ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. ఈ ఇద్దరు కలయికతో వచ్చిన సినిమా ‘ఈడోరకం.. ఆడోరకం..’ టైటిల్‌కు కరెక్ట్ యాప్ట్ అయ్యేలా తమ క్యారక్టరైజేషన్‌కు తగ్గట్టు తమ బాడీలాంగ్వేజ్ ఏర్పరచుకున్నారు విష్ణు, రాజ్‌తరుణ్. విష్ణు తన టైమింగ్‌తో ఆకట్టుకుంటే రాజ్ తన పంచ్‌లతో ప్రేక్షకులను అలరించేలా చేశాడు. ముఖ్యంగా కథ మొదలయ్యేది విష్ణు అనాథ అని చెప్పిన ఓ చిన్న అబద్ధంతో.. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడంకోసం రాజ్‌తరుణ్‌ని వాడుకోవడం ఇలా అంతా కామెడీగా జరుగుతుంది. అయితే ముందు సినిమా ఓపెనింగ్‌లో దత్తన్న, గజన్న అంటూ భారీ రౌడీతనంతో చూపించిన అభిమన్యు, సుప్రీత్‌ల పాత్రలు చివర ఫూల్స్‌గా చేయడం కాస్త విడ్డూరంగా ఉంటుంది. ఇక సినిమాలో పెద్ద జోకర్ ఎవరంటే నారాయణ పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్. ఆయన పాత్రకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఓ లాయర్ తరహా హోదాలో ఉన్న వ్యిక్తి తన ఇంట్లో ఏం జరుగుతుంది అన్న కన్‌ఫ్యూజ్ తెరదించలేకపోవడం విచిత్రం. పంజాబి సినిమా రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

- త్రివేది