రివ్యూ

పిల్లగాడితో కాస్త జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేయ్.. పిల్లగాడ * బాగోలేదు

** *** ************* ***

తారాగణం:
దుల్కర్ సల్మాన్, సాయపల్లవి
మాటలు: భాషాశ్రీ
కెమెరా: గిరీష్ గంగాధర్
నిర్మాణం: లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్
నిర్మాత: డి.వి. కృష్ణస్వామి
సంగీతం: గోపీ సుందర్
దర్శకత్వం: సమీర్ తాహిర్

మన టాలీవుడ్ అనాదిగా ఓ ఆనవాయితీని అనుసరిస్తూ వస్తుంది. పక్క రాష్ట్రానికి చెందిన ఏ నటి లేదా నటుడు తమ చిత్రాల ద్వారా తెలుగునాట కాస్తక్రేజ్ సంపాదిస్తే చాలు.. వెంటనే మన నిర్మాతలు ఆ క్రేజ్ చల్లారేలోపు క్యాష్ చేసేసుకోవాలన్న ఉబలాటలో సదరు ఆర్టిస్టు నటించిన పరభాషా చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో మన భాషలోకి దించేస్తుంటారు. గతంలో సుధీప్, మోహన్‌లాల్‌ల అనువాద చిత్రాలు అలా వచ్చినవే! ఇలా వచ్చిన మరో చిత్రమే ఈ ‘హేయ్..పిల్లగాడ’! టైటిల్ విషయంలో కూడా పాపులర్ పాటనే ఆశ్రయించి తన ముందు చూపుని చాటుకున్నాడు నిర్మాత. గత ఏడాది కేరళలో విడుదలై విజయం దక్కించుకున్న మలయాళం చిత్రం ‘కాళి’ అనువాదం ఇది. ‘్ఫదా’ చిత్రం ద్వారా మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న సాయి పల్లవి కథానాయకి కాగా, దల్కర్ సల్మాన్ కథానాయకుడు. లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ పతాకంపై డి.వి కృష్ణస్వామి నిర్మాతగా కేవలం సాయి పల్లవిని మాత్రమే నమ్ముకొని వస్తున్న ఈ చిత్ర నిర్మాతకి సొమ్ము చేస్తుందా? లేక వమ్ము చేస్తుందా? తెలుసుకునే ముందు...
బ్యాంకు ఉద్యోగి అయిన సిద్ధార్థ్ (దల్కర్ సల్మాన్) స్వభావ రీత్యా చాంతాడంత ముక్కోపి. ఎంత? అంటే ఎవరైనా భుజం తట్టి భోంచేస్తావా? అంటే చెంప చెల్లుమనిపించేంత! అసందర్భంగా పులి గాండ్రించినట్లు హీరో కూడా సమయ సందర్భాలు చూడకుండా తనకి ఇబ్బంది కలిగించే వారిపై కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇంటి, బయట, ఆఫీస్‌లో, ఆఖరికి ప్రయాణిస్తున్న కారులో కూడా తనకి అసౌకర్యం కలిగించే ప్రతి చిన్న విషయానికీ చిరాకు పడటం, ఆపై కోప్పడటం, ఆ తర్వాత యాక్షన్‌లోకి దిగటం, మళ్లీ కాసేపటికి యథాస్థితికి రావడం. ఇదే పంథాని స్కూల్ చదివే రోజుల్నించి అవలంభిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి కాలేజీ రోజుల్లో ప్రియురాలైన అంజలి (సాయి పల్లవి) భార్యగా ప్రవేశిస్తుంది. సిద్దార్థ్ మనస్తత్వం కాస్తో కూస్తో తెలినప్పటికీ పెళ్లయ్యాక అతని విపరీత ధోరణిని పూర్తిగా గుర్తించిన ఆమె సిద్దార్థ్ ప్రవర్తనలో మార్పు తేవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. ఫలితం మాత్రం శూన్యం. ఇలా వుండగా, వైజాగ్‌లో తన పుట్టింట్లో జరిగే ఓ శుభ కార్యానికి రావల్సిందిగా సిద్దార్థ్‌ను అడుగుతుంది. ఇందుకు ససేమిరా అనడమే కాకుండా, అకారణంగా చిర్రుబుర్రులాడుతాడు. సహనం కోల్పోయిన అంజలి ఒంటరిగానే పుట్టింటికి వెళ్లడానికి సిద్ధపడుతుంది. అంతలోనే శాంతించిన సిద్దార్థ్ తను కూడా వస్తానంటాడు. కారులో బయల్దేరిన ఇద్దరూ అర్థరాత్రి డిన్నర్ నిమిత్తం ఓ డాబా దగ్గర ఆగుతారు. కథ ఇక్కడే మరో మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటన్నదే మిగతా సినిమా.
షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది? అనే ఒకే ఒక్క పాయింట్‌ని తీసుకొని దాని చుట్టూ మాత్రమే సన్నివేశాలని అల్లుకోవడంతో ఏదో షార్ట్ ఫిలిమ్‌ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. కొన్ని సీన్లు మరీ అతిగా అనిపిస్తాయి. కారు కొన్నందున పార్టీ అడిగాడని తోటి ఉద్యోగిపై ఓ ఫంక్షన్‌లో అందరూ చూస్తుండగానే చేయి చేసుకోవడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. షార్ట్ టెంపర్ రాసుకున్న సీన్లన్నీ ప్రథమార్థంలోనే అయిపోవడంతో, ద్వితీయార్థాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలీని పరిస్థితి. నిర్ధిష్టమైన కథ లేకపోవడంతో వచ్చిన చిక్కు ఇది. ఇక్కడే దర్శకుడు మరో బాట పట్టి, అర్థరాత్రి ఛేజింగ్‌లు, డాబా, వేశ్యలు, గ్యాంగ్‌స్టర్స్, ఫైట్స్, పోలీసులు అంటూ క్రైమ్‌స్టోరీకి కావల్సిన అన్నింటినీ తెరపైకి తెస్తాడు. దీంతో అప్పటి వరకూ కథలో వున్న ఫ్లేవర్ ఒక్కసారిగా మారిపోయి సినిమా మరో జోనర్‌లోకి జారుకుంటుంది. అసలు డాబా దగ్గర జరిగే ఏ ఒక్క సన్నివేశంలో కూడా డెప్త్ కనిపించదు. చీకటి వేళ ఎక్కడో ఉన్న భార్యకి ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా కాపాడే ప్రయత్నం చేయకుండా, తనకి సంబంధం లేని తగాదాలో హీరో పాల్గొనడం విస్మయం కలిగిస్తుంది. చిమ్మచీకటిగా ఉండే కారడవిలోనున్న చిన్న రోడ్డుని హైదరాబాద్ - విశాఖ హైవేగా చూపడం మింగుడు పడదు. కథానాయకుని క్యారెక్టరైజేషన్‌లో అక్కడక్కడ విక్రమ్ నటించిన అపరిచితుడు తాలూక ఛాయలు కనిపిస్తాయి. ఎదుటి వ్యక్తి చేష్టలు మనల్ని భాదిస్తే వచ్చేది కోపం. అవే చేష్టలు మనకి నచ్చకపోతే వచ్చేది చిరాకు. దర్శకుడు ఈ తేడాని గుర్తించక పోవడంతో అసలు హీరోకి ఉన్నది లక్షణమా? లేక వ్యాధా? అన్న సందేహం కలుగుతుంది. చర్యలకి ప్రతి చర్యలు మోతాదు మించితే ప్రేక్షకుడు కూడా చిరాకు పడతాడు సినిమాపై. అదే జరిగింది ఈ సినిమా విషయంలో.
‘్ఫదా’ చిత్రంలో కొంటె పిల్లగా, అల్లరి అమ్మాయిగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి ఈ చిత్రంలో మాత్రం పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. భర్త ప్రవర్తన కారణంగా ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో సతమతమవుతూ భర్తని కంట్రోల్ చేసే క్రమంలో తనని తాను కంట్రోల్ చేసుకునే భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. మెచ్యూరిటీ నటన ద్వారా ఎన్నో భావాలని కన్నీళ్లతో నిండిన కళ్లతోనే పలికిస్తుంది. ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాలలో ఆమె నటన ఉన్నత శిఖరాలను తాకుతుంది. సిద్దార్థ్ పాత్రలో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా దల్కర్ సల్మాన్ దర్శకుడు చెప్పినట్టుగా చేశాడు. ఆ పాత్రని కాస్త మీనింగ్‌ఫుల్‌గా డిజైన్ చేయాల్సింది. డబ్బింగ్ చెప్పిన హేమచంద్ర తన వాయిస్‌లోని ‘లౌడ్‌నెస్’ని కాస్త తగ్గిస్తే బావుండేది. డాబా యజమాని పాత్రలో వినాయకన్ నటన ఇంప్రెసివ్‌గా ఉంది. బేరర్ పాత్రధారి పలికే డైలాగులు వెరైటీగా అనిపిస్తాయి. భాషాశ్రీ రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ‘బుల్లి లాంతర్ వెలుగే..’ పాట క్యాచీగా వుంది. గిరీష్ గంగాధరన్ ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. చీకట్లో కారు ఛేజింగ్ దృశ్యాలు ఉత్కంఠను కలిగిస్తాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ షార్ప్‌గా వుంది. టెక్నికల్ అంశాలకి సపోర్టుగా దర్శకుడు కూడా కథనం ద్వారా తన వంతు సహకారం అందించాల్సింది. మొత్తం మీద ఈ సినిమా సాయి పల్లవి అభిమానులకి మాత్రమే నచ్చే అవకాశం.

-మద్ది మురళి