రివ్యూ

సెంటిమెంట్ సేన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రసేన** ఫర్వాలేదు
తారాగణం: విజయ్ ఆంటోని, డయానా చంపికా, హిమా, జ్వెల్ మ్యారీ, రాధారవి, కాళీ, వెంకట్, నళినీకాంత్.
నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్,
ఆర్ స్టూడియో, ఎస్.కె.ఆర్ ఫిలింస్
సంగీతం: విజయ్ ఆంటోని
కెమెరా: కె.దిల్‌రాజ్
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోనీ, రాధికా శరత్‌కుమార్, నీలం కృష్ణారెడ్డి.
మాటలు, పాటలు: భాష్యశ్రీ
దర్శకత్వం: జి.శ్రీనివాస్

** *** **********

వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలు చేస్తూ, వరుసగా కమర్షియల్ విజయాలను అందుకుంటున్న నటుడు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తమిళ భాషలో రూపొందించిన తన ప్రతీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నాడు. బిచ్చగాడు తరువాత భేతాళుడు, యెమన్ తాజాగా ఇంద్రసేన ఆ కోవలో వచ్చినవే. దీంతో విజయ్ ఆంటోని సినిమాలంటే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇంద్రసేన’ ఎలా వుంది? అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ ఆంటోని గత చిత్రాల తరహాలోనే ఉందా? ఇంతకీ ఇంద్రసేన ఎవరు? ఒక్కరా? లేక ఇద్దరా? తొలిసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఆంటోని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
ఇంద్రసేన, రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరు కవలలు. రూపం, రంగు ఒకేలా ఉంటాయి. తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు ఎలిజబెత్ మరణంతో మద్యానికి బానిసవుతాడు ఇంద్రసేన. ఇలాంటి క్రమంలో అతడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. మరొకరు రుద్రసేన. ఓ పాఠశాలలో వ్యాయామ టీచర్‌గా పని చేస్తుంటాడు. తాను ఇష్టపడిన అమ్మాయి రేవతిని పెళ్లిచేసుకోవాల్సిన రుద్రసేన కిరాయి రౌడీగా మారతాడు. దాంతో అతడికి రేవతి దూరమవుతుంది. ఇలా ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతారు. మనోవ్యధకు గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రసేన జైలునుంచి వచ్చిన తరువాత ఏం జరిగింది? ఎంతో పేరున్న వ్యాయామ టీచర్ రుద్రసేన ఎందుకు కిరాయి రౌడీగా మారాడు? తన కారణంగానే కుటుంబం బజారు పాలైందని తల్లిదండ్రుల ఆవేదనకు ఇంద్రసేన ఎలా స్వాంతన చేకూర్చాడు? రౌడీగా మారిన రుద్రసేన చివరికి రేవతిని పెళ్లిచేసుకున్నాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రసేన చివరకు ఏమైపోయాడు? ఇద్దరు అన్నదమ్ముల జీవితంలో ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకుంటున్న కారణంగా వారు పడిన సంఘర్షణ ఏమిటి? వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు? అందుకు వారు జీవితంలో ఏం త్యాగం చేశారు? అనేది కథ.
ఈ చిత్రంలో తమిళ వాసన కళ్లకు కట్టింది. విజయ్ ఆంటోని ద్విపాత్రాభినయం బాగానే చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. ప్రథమార్థంలో మదర్, బ్రదర్ సెంటిమెంట్ బాగా చూపించారు. సెకెండాఫ్‌లో కథ అనే క మలుపులు తిరుగుతుంది. ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ వంటి సబ్ ప్లాట్స్ కింద సినిమా విడిపోయింది. విజయ్ ఆంటోని మినహా నటీనటులు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా దూరమైనవాళ్లే. అన్నదమ్ముల కథలో రకరకాల ఎమోషన్స్ జోడించాడు దర్శకుడు. యాక్షన్ సెంటిమెంట్‌లతో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని రకాలను బాగానే చూసుకున్నాడు. విజయ్ ఆంటోని చిత్రాలన్నీ ఓ కొత్త నేపథ్యంలో సాగుతాయన్నది తెలిసిందే. ఇంద్రసేన కూడా అలాగే మొదలవుతుంది. అతి మంచితనంవల్ల ఇంద్రసేన ఎలాంటి కష్టాలు పడ్డా డు? ఆ మంచితనాన్ని వదిలేసి రుద్రసేన ఎలా ఎదిగాడు? అన్నది ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు మంచి మార్కుల్నే కొట్టేశాడు. ఈ కథకు ద్వితీయార్థం చాలా కీలకం. మొత్తం ఒక యాక్షన్ మోడ్‌లో సాగుతుంది. పతాక సన్నివేశంలో భావోద్వేగాలన్నీ ఆకట్టుకుంటాయి.
టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ అన్నదమ్ముల కథలతో వచ్చిన సినిమాలు మనం చాలానే చూశాం. వాటితో పోలిస్తే ఈ ఇంద్రసేన కొత్తగా వుంటుంది. కథానాయికలు ముగ్గురు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇంద్రసేనను ప్రేమించిన ఎలిజబెత్ పాత్రను దర్శకుడు తెరపై చూపించలేదు. ఆ క్యారెక్టర్ కథకు అవసరం లేదు అనుకున్నాడేమో! విజయ్ ఆంటోని సంగీతం, కె. దిల్‌రాజు కెమెరా బావుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో కెమెరా వర్క్ బాగా హైలైట్‌గా వుంది. ఇక భాష్యశ్రీ మాటలు, పాటలు చిత్రానికి మంచి బలాన్ని తెచ్చాయి. ముఖ్యంగా మాటలు బాగా పేలాయి. సందర్భోచితంగా వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేశాయి. పాటల్లో కూడా సాహిత్యం పరవళ్లు తొక్కింది. వాటికి చిత్రీకరణ కూడా తోడయ్యంది. పాటలు, మాటల రచయతగా భాష్యశ్రీకి భవిష్యత్తు ఉంది.
ఇక ఎప్పటిలాగానే విజయ్ ఆంటోని తన పరిధికి మించని, తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే రెగ్యులర్ కథలనే ఎంచుకున్నాడు. కాకపోతే భావోద్వేగ అంశాలు కథను ముందుకు తీసుకెళతాయి. ఎడిటింగ్, సాంకేతింగా చూస్తే విజయ్ ఆంటోని అందరికంటే బెటర్‌గా కనిపిస్తాడు. తెరముందే కాదు తెర వెనుక కూడా సత్తా చాటుకున్నాడు. ఈఎంఐ పాటలో కెమెరా, గ్రాఫిక్స్ వర్క్ అద్భుతమనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సో..విజయ్ ఆంటోని మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి మార్కుల్నే కొట్టేశాడు. సెంటిమెంట్‌తో సాగిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

-రతన్