రివ్యూ

ప్చ్..మోహన్ రంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** ఛల్ మోహన్‌రంగ
**
తారాగణం:
నితిన్, మేఘా ఆకాశ్, లిజీ, సీనియర్ నరేష్,
ప్రగతి, నర్రా శ్రీను, రావురమేశ్,
మధునందన్, రోహిణి హట్టంగడి,
సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను తదితరులు.
ఎడిటింగ్: ఎస్.ఆర్ శేఖర్
కెమెరా: ఎన్.నటరాజ్ సుబ్రమణియన్
సంగీతం: థమన్. ఎస్
నిర్మాణం: శ్రేష్ఠ్‌మూవీస్,
పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: ఎన్.సుధాకర్‌రెడ్డి
కథ: త్రివిక్రమ్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
**
తెలుగుచిత్రసీమలో రొటీన్ ప్రేమకథలు వెల్లువలా వచ్చిపడుతూనే వున్నాయి. అలా వచ్చిన కథల్లో ఏ మాత్రం కొత్తదనం మచ్చుకైనా కనిపించడం లేదు. దాంతో ఎంతో ఉత్సాహంతో థియేటర్‌లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులు అసహనానికి గురికాక తప్పడంలేదు. ఈ మధ్య పరమ రొటీన్ ప్రేమకథలు మరీ ఎక్కువై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ కథానాయకుల్లో యువహీరో నితిన్ ఒకడు. నిర్మాత కుమారుడుగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ తేజ ‘జయం’ చిత్రంతో తన కెరీర్ గొప్పగానే ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దిల్’తో మంచి విజయానే్న అందుకున్నా ఎందుకనో ఆశించిన మేర సక్సెస్‌లను ఖాతాలో వేసుకోలేకపోయాడు. పదేళ్ల తర్వాత ‘ఇష్క్..’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి వరుస విజయాలతో మళ్లీ మంచి ఊపులోకి వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ..’ చిత్రంతో కలెక్షన్ల పరంగా యాభై కోట్ల క్లబ్ హీరోగా మారాడు. అలాంటి త్రివిక్రమ్ కథతో.. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కలిసి నితిన్‌తో సినిమా చేయడం అంటేనే సినిమాపై అంచనాలు పెరిగాయి. నితిన్.. పవన్‌కల్యాణ్ వీరాభిమాని. త్రివిక్రమ్ అభిమాన దర్శకుడు. పైగా నితిన్ 25వ చిత్రం ‘్ఛల్ మోహన్‌రంగ’. ఇలా అన్నీ కుదిరాయి. దాంతో అందరూ ఈ సినిమాపై ఆసక్తిని కనబరిచారు. అంచనాలుపెంచుకున్నారు. విజయాల్ని, పరాజయాల్ని లెక్క చేయకుండా కెరీర్‌పైనే దృష్టిసారించిన హీరో నితిన్. అతడి ఆరంభమే ఓ సంచలనం. వరుసగా విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత అదే స్థాయిలోనే ఆటుపోట్లు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. విక్రమార్కుడిలా పట్టిన పట్టు ఏ మాత్రం వీడకుండా కెరీర్‌లో పరుగులు పెట్టడానికే ప్రయత్నించాడు.
హీరోగా

నితిన్‌ది పాతిక సినిమాల ప్రయాణం. ఈ యంగ్ హీరో తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘ఛల్ మోహన్‌రంగ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అల్లరి చిల్లరగా తిరుగుతూ అన్నింటినీ తేలిగ్గా తీసుకునే కుర్రాడు మోహన్ రంగ (నితిన్). ఎలాగైనా జీవితంలో స్థిరపడాలన్నది అతడి కోరిక. దానికోసం అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటాడు. ఎంత ప్రయత్నించినా వీసా మంజూరు కాదు. ఇలా మూడేళ్లు గడిచిపోతాయి. నాలుగో ఏడాది మాత్రం సరోజ అనే బామ్మ (రోహిణి హట్టంగడి) శవాన్ని అడ్డం పెట్టుకుని అమెరికా వెళతాడు. అక్కడ అతడికి ఎన్నో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాశ్) అనే అమ్మాయ పరిచయమవుతుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. సహజంగానే అది ప్రేమగా మారుతుంది. ఆ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలని.. ఓ చోట కలుద్దామనుకుంటారు. అయితే భిన్నమైన మనస్తత్వాలు ఉన్న తమ మధ్య రిలేషన్ నిలబడదు అనే కారణంతో ఇద్దరి ఒకరినొకరు కలవకుండానే విడిపోతారు. వేర్వేరు కారణాలతో స్వదేశానికి వచ్చేస్తారు. మరి మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకున్నారా? వీరి ప్రేమకథ ఎక్కడికి దారితీసింది? అనేదే కథ.
‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ‘ఛల్ మోహన్‌రంగ’తో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో హీరోయిన్ల ప్రేమ, తరువాత మనస్పర్థలు, బ్రేకప్, తిరిగి కలవటం ఇది గతంలో తెలుగు తెరమీద చాలా సార్లు వచ్చిన కథే. నితిన్ ఒక హీరోలా కాకుండా, మామూలు మధ్య తరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్‌రంగ క్యారెక్టర్‌లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్య కథానాయకుడి పాత్రను మలిచినతీరు ఆకట్టుకుంటుంది. అమాయకత్వాన్ని, నిజాయితీని, హాస్యాన్ని మేళవించి మోహన్‌రంగ పాత్రను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే త్రివిక్రమ్ అందించిన కథను పూర్తి స్థాయి ఎమోషన్‌ను క్యారీ చేసేలా డెవలప్ చేయలేకపోయాడనిపించింది. ఫస్ట్ఫా మొత్తం కామెడీ, హీరో పాత్రతో, డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ప్రేమకథ ఆరంభం ఎలా అయితే సాదాసీదాగా ఉందో ప్రయాణం, ముగింపు కూడా అలా నే మామూలుగా ఉన్నాయి. అలాగే హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఎలివేట్ అయ్యేలా బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనపడలేదు. కొన్ని చోట్ల వీళ్లిద్దరి సీన్లు సిల్లీగా అనిపించాయి. అమెరికా వెళ్లడానికి అతడు పడే పాట్లు.. అక్కడ హెచ్1బీ వీసా కోసం చేసే ప్రయత్నాలు ఎంత సిల్లీగా ఉంటాయో! అలాగే ద్వితీయార్థంలో ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు ఏం లేవు. దాంతో సినిమా కాస్తబోర్ అనిపించింది. త్రివిక్రమ్ అందించిన కథ కూడా సాధారణమైనదే. ఈ కథలో మ్యాజిక్ ఏమీ ఉండదు. అమెరికా అందాలు, చక్కటి సంగీతం, వినోదం ఇవన్నీ మేళవించడంతో తొలి సగం ఫర్వాలేదనిపిస్తుంది. రంగ, మేఘ విడిపోవడానికి బలమైన కారణాలు చూపించలేదు.
మోహన్‌రంగగా నితిన్ అభినయం ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతున్న నితిన్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు. హీరోయిన్ మేఘా ఆకాశ్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించింది. తొలి సినిమాలో బబ్లీగా కనిపించిన మేఘకు ఇందులో కాస్త నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దక్కింది. తొలి భాగం అల్లరి అమ్మాయిగా కనిపించిన మేఘ, సెకండాఫ్‌లో ప్రేమకు దూరమైన ప్రియురాలిగానూ మెప్పించింది. అదే సమయంలోనూ కామెడీతోనూ ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సీనియర్ నరేష్, తల్లిగా ప్రగతి, కథానాయిక తండ్రిగా సంజయ్ స్వరూప్ రొటీన్ పాత్రల్లో కనిపించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరమీద కనిపించిన సీనియర్ నటి లిజీ హీరోయిన్ తల్లి పాత్రలో హుందాగా మెరిసింది. నర్రా శ్రీను, మదునందన్, శ్రీనివాస్, ప్రభాస్ శ్రీను, సత్యలు తమ పాత్రల్లో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా చూస్తే గేయ రచయిత కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో ఆయననే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. థమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బావుంది. ‘నువ్వు పెద్దపులి’ పాట మాస్‌కు నచ్చుతుంది. మిగిలినవన్నీ మెలోడీ ప్రధానంగా సాగేవే. ‘ఘ.. ఘ..మేఘ’ అనే పాట చిత్రీకరించిన విధానం సూపర్. ఎక్కువగా అమెరికా నేపథ్యంలో సాగిన కథ ఇది. అక్కడి లొకేషన్లు, ఊటీ అందాల వల్ల ఈ కథకు కొత్త ఫ్లేవర్ వచ్చింది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. న్యూయార్క్ అందాలను అంతే కలర్‌ఫుల్‌గా చూపించాడు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. మొత్తం మీద నితిన్-త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్‌లో ఊరించి ఊరించి ఎంతో ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఛల్ మోహన్‌రంగ’ కాస్త ప్చ్..మోహన్‌రంగ! అనిపించాడు. *

-ఎం.డి అబ్దుల్