రివ్యూ

వినోదంలో అన్నీ వింతలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఇంతలో ఎనె్నన్ని వింతలో
**
తారాగణం:
నందు, సౌమ్య వేణుగోపాల్,
పూజ రామచంద్రన్ తదితరులు

సంగీతం: యాజమాన్య
సినిమాటోగ్రఫీ:
ఎస్.మురళీమోహన్‌రెడ్డి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
స్క్రీన్‌ప్లే: వరప్రసాద్ వరికూటి
నిర్మాతలు: ఎం.శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు
దర్శకత్వం: వరప్రసాద్ వరికూటి
**
ఓ వైపు సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ మరోవైపు హీరోగా తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు నందు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. నూతన దర్శకుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమాలో మరి ఆ వింతలు ఏమిటన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
విష్ణు (నందు), వందన (సౌమ్య వేణుగోపాల్) ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరిస్తారు. అలా పెళ్లికి ఇంకొక్కరోజే సమయం ఉందనగా విష్ణు, స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీ దగ్గర వాళ్లకు తార (పూజా రామచంద్రన్) అనే అమ్మాయి కలుస్తుంది. ఆమె కారణంగా విష్ణు, అతని స్నేహితులు తెల్లారేసరికి ఒక్కొక్కరు ఒక్కో ఇబ్బందిలో ఇరుక్కుపోతారు. ఆ ఇబ్బందులు ఏంటి? వాటి నుండి వాళ్లెలా బయటపడ్డారు. చివరికి వందనతో విష్ణు పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
హీరో నందు తన నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఎమోషన్స్ కలిగిన తార పాత్రలో పూజా రామచంద్రన్ నటన మెప్పించింది. హీరోయిన్ సౌమ్య వేణుగోపాల్ అందం. అభినయంతో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పూజా రామచంద్రన్ మాత్రం తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. ఆమె కళ్లలోని మత్తు ప్రేక్షకుడి మనసుకు తాకడం ఖాయం. అలాగే ప్రతి నాయకుడిగా అభినందించదగిన నటన కనబర్చిన గగన్ విహారికి ఇదొక మంచి అటెంప్ట్. ఆయనలో విలన్‌కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సినిమా ద్వారా బయటపడింది. పెద్ద సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించినట్లే కనిపించి మాయమైపోయిన కృష్ణతేజ ఈ చిత్రంలో సయ్యద్ పాత్రలో తెలంగాణ యాసలో కడుపుబ్బ నవ్వించాడు. ద్వితీయార్థంలో నడిచే రెండు ఎమోషనల్ సన్నివేశాలు మెప్పించాయి.
యాజమాన్య అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎస్.మురళీమోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అబ్బురపరచింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉంది. దర్శకుడు తను ఎంచుకున్న స్క్రీన్‌ప్లే ఆధారితమైన స్క్రిప్ట్‌ను ఎక్కడా కనెక్షన్స్ మిస్సవకుండా స్పష్టంగా చెప్పడం.. సన్నివేశాల్లోని బలం సంగతి అటుంచితే ప్రతి సన్నివేశానికి ఒక ఖచ్చితమైన రీజన్ కనిపించింది. హీరో స్నేహితుల పాత్రల ద్వారానే దర్శకుడు వరప్రసాద్ ఫస్ట్ఫా, సెకండాఫ్‌ల్లో కొన్ని చోట్ల నవ్వుకోదగిన హాస్యాన్ని పండించారు. దర్శకుడు వరప్రసాద్ హాలీవుడ్ సినిమా ఉండి హిట్ ప్లాట్లను తీసుకుని ఎక్కడా కనెక్షన్స్‌పోకుండా పద్ధతిగా, కొంత హాస్యాన్ని పండించి కథను చెప్పాడు. హాలీవుడ్ సినిమా ‘ది హ్యాంగోవర్’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా ప్లాట్ చిన్న చిన్న కారణాల మినహా మిగతా మొత్తం మార్పు లేకుండా అచ్చు ఆ ఇంగ్లీష్ సినిమాకు కాపీలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు క్రియేట్ చేసే ప్రతి పరిస్థితి కన్విన్సింగ్‌గానే ఉండి ఆకట్టుకుంది. నందు, పూజ, గగన్ మినహా మిగతా నటీనటుల నుండి మెప్పించే స్థాయి పెర్ఫార్మెన్స్ ఇంకా కనిపిస్తే బావుండేది. ఇక మధ్యలో వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ మెప్పించాయి. కథను ఒక ఫార్మాట్లో పద్ధతిగానే చెప్పగలిగిన దర్శకుడు దాన్ని మించి థ్రిల్ చేసి, కొత్తగా అనిపించే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలిచాడు. మొత్తం మీద వినోదాత్మకంగా వుంటూనే చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసిన దర్శకుడి టేకింగ్ ఫర్వాలేదనిపించింది.

-త్రివేది