రివ్యూ

వృథా ప్రయాస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేపర్‌బాయ్ * బాగోలేదు

తారాగణం:

సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యాహోప్, పోసాని, బిత్తిరిసత్తి,
నాగినీడు, జయప్రకాశ్‌రెడ్డి, విద్యుల్లేఖారామన్, అన్నపూర్ణ,
అభిషేక్, అనితా చౌదరి, సన్నీ, మహేష్ నిట్టా తదితరులు.
సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్
సంగీతం:్భమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది
దర్శకత్వం: జయశంకర్

= = = = = = = = = = = = = = == = = =========

జన్యుపరమైన అపసవ్యతలవల్ల ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ మేఘ (తాన్య హోప్) తనకిలా 22 ఏళ్ళ వయసులోనే తనువు చాలించే దశకు రావడంవల్ల తన బతుక్కి అర్థం ఏమిటోనని అనుకుంటూ ఉంటుంది. అలాంటి అనే్వషణలో అనుకోకుండా ఓ ప్రేమికుడు పేపర్‌బాయ్ రవి (సంతోష్ శోభన్) డైరీలో ఓ కాగితం దొరుకుతుంది. తర్వాత లభించిన ఆ మొత్తం డైరీ ఆధారంగా అతని ప్రేమికురాలు ధరణి (రియా సుమన్) ఆచూకీ తెలుస్తుంది. వాటి సాయంతో వాళ్ళిద్దర్ని మేఘ ఎలా కలిపిందీ అన్నది మిగతా కథ. స్థారుూ అంతరాల కారణంగా విడిపోయిన జంటలు తుదకు ఏకమయ్యే ప్రక్రియ కధా విధానాలు ఏ భాషా చిత్ర పరిశ్రమలోనైనా ప్రేమకథలకు ప్రాణవాయువులే. కాకపోతే ఆ మోతాదు తెలుగు చిత్రాల్లో ఇంకాస్త ఎక్కువ. అయితే దాన్ని వెండితెరకు ఆవిష్కరణ చేయడంలో దర్శకుడు జయశంకర్ పడిన తత్తరపాట్లు స్పష్టంగా కనపడడంతో అల్టిమేట్‌గా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ప్రేక్షకునికి ఆసక్తి కల్గించలేకపోయి దీనికి ఆయన ఇప్పుడిప్పుడే రంగంలో అడగువేయడం ప్రారంభించడమే ఒక కారణం కావచ్చు. కొత్త దర్శకులెందరో తొలి చిత్రాలలో చేసే వాణిజ్య దట్టింపుల కోసం ఏ ఐటెమ్ సాంగ్‌నో, భీకర పోరాటాల్నో ఇందులో ఆశ్రయించకపోవడం అభినందనీయం. కానీ చెప్పే అంశాలు రెండు గంటలపాటు ఆడిటోరియంలో ప్రేక్షకుడు చూసి తలకెక్కించుకోవడానికి కావలసిన పద్ధతిని అనుసరించడంలో పొందిన విఫలత్వంవల్ల మాటిమాటికీ చిత్రాంతం కోసం వాచీని చూడాల్సిన పరిస్థితి వీక్షకుడికి వచ్చేసింది. దాంతోపాటు అనవసరంగా ప్రధాన కథకు సంబంధం లేని బిత్తిరి సత్తి ఎపిసోడ్, ఫైటింగ్సూ పెట్టి కథకున్న టెంపోని అప్పుడప్పుడు డిస్ట్రబ్ చేశారు. అలాగే ఓ పేపర్ బాయ్‌ని, సంపన్న కుటుంబం తమతో కలుపుకోవడం అన్నదానిపై ఇంకాస్త కన్విన్సింగ్‌గా సన్నివేశాలుండేట్లు కధలో కసరత్తు చేసుంటే బావుండేది. ఎంతసేపు వారిద్దరి ప్రేమ కొనసాగింపు తదితరాలపై దృష్టి పెట్టారు గానీ, పైన చెప్పిన ప్రధాన హేతువుపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ మాండలికం కథానాయిక తండ్రి విషయంలో ప్రవేశపెట్టి, తల్లి, కూతురి విషయాల్లో ఫాలో అవ్వకపోవడం ఎందుకో అర్థం కాదు. ప్రథమార్థ్భాగం అంతా ఏదో ఓ వారపత్రికలో కథ చదువుతున్నట్లు అనిపిస్తుంది తప్ప సినిమా చూస్తున్న భావన కలగదు. మామూలుగా సినిమాల్లో అర్థరాత్రి, అపరాత్రి అయినా పాత్రధారుల మేకప్ చెక్కు చెదరదు. ప్రొద్దునే్న ఏదో ఒక పెళ్లికి వెళ్లడానికి తయారైనట్లుంటుంది అని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇందులో ఆ సంగతి మరీ బాహాటంగా అనిపించింది. అమ్మాయి, అబ్బాయి ఆర్థిక అంతరాల తేడావల్ల పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు విచారంతో అర్థరాత్రి దాటినా వారి గదిలో ఉండడాన్ని చూసిన హీరోయిన్ ఇప్పుడు రాత్రి రెండు గంటైంది.. అంటూ డైలాగు చెపుతుంది. ఆ సమయంలో కూడా హీరోయిన్ తల్లి మడత నగలని చీరతో, ఫుల్ మేక్‌తో ఉండడాన్ని చూపిస్తారు. ఇది మరీ నిజ జీవితంలో అదీ అలాంటి పరిస్థితిలో సాధ్యమా అన్న సంగతిని నవతరం దర్శకులైనా ఆలోచిస్తే బాగుంటుంది. సరే మరి ఇలాంటి సహజ అపశృతులు వదిలేసి మిగతావాటిని చూస్తే నటీనటులందరూ కూడా ఏ మాత్రం అసహజత్వానికి తావియ్యకుండా తమ పరిధిలో బాగా నటించారు. ముఖ్యంగా తన అంతస్థుకి తగని వ్యక్తి అని తెలిసినా, ఆ పేపర్‌బాయ్‌లోని నిజాయితీని, భవిష్యత్‌పై అతనికున్న ధైర్యానికి ఆకర్షితురాలైన విధంలోనూ, చివరికి తన తోడబుట్టిన వాళ్లే తన కలలు వాస్తవ రూపం దాలుస్తున్న సమయంలో దాన్ని ఛిద్రం చేసిన సందర్భంలోనూ పడిన ఆవేదనను తెల్పడంలోనూ పరిణతి చెందిన నటనని ధరణి పాత్రలో రియా సుమన్ చక్కగా పలికించారు. సంతోష్ శోభన్ కూడా నిగ్రహమైన నటనను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. పాత్ర నిడివి ఎక్కువ లేకపోయినా మేఘ పాత్రకి తాన్యా హోప్ న్యాయం చేశారు. బిత్తిరి సత్తి పాత్రతో చేయించిన కామెడీ అంతగా పండలేదు. పోసానిది ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన పాత్రే. సినిమాలో మాటల విభాగం గురించి రచయిత (సంపత్ నంది) చేసిన కృషి చాలా చోట్ల కన్పడింది. ‘ముద్దంటే పెదవులు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవటం’, ‘మన పక్కన ఎంతమందన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నది ముఖ్యం’, ‘అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు. అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారు’ ధరణి లాంటమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు’, ‘బతకడం కోసమే పేపర్ వేస్తున్నాను, భవిష్యత్ కోసం బిటెక్ చదువుతున్నాను’, ‘కంటికి కన్పించినప్పుడల్లా తినకూడదు, కడుపుకాకలేసినపుడే తినాలి’... వంటివి అలా చేసిన కృషిలో కన్పడిన భాగాలే. అలాగే ఫుడ్ ఇన్స్‌పెక్టర్ (జయప్రకాష్‌రెడ్డి) పాత్ర ద్వారా అతని వృత్తిపర పదాలు ‘శానిటేషన్, అడల్ట్రేషన్, కంటామినేషన్..’లాంటివి అనిపించడం బాగుంది. అలెప్పీ అందాల్ని సౌందర్‌రాజన్ కెమెరా ప్రతిభావంతంగా తెరపై కనపర్చింది. ప్రత్యేకించి పాటల చిత్రీకరణలో కెమెరా కొత్తపుంతలు తొక్కింది. ఎంచుకున్న లొకేషన్సూ బాగున్నాయి. భీమ్స్ స్వరాల్లో ‘నీవల్లే మొదలైందీ నీవానీ, దిల్‌కీ దీవానీ..’ ఒక్కటే బాగుంది. సినిమాలో పదే పదే మేఘ పాత్ర చేత అనిపించిన పర్పస్ ఏమిటి అన్న మాటనే సినిమా విషయంలో అన్వయించుకుంటే ఇలాంటి చిత్రాల ప్రయోజనం (పర్పస్) సిద్ధించాలంటే కేవలం ఎంచుకున్న కథపైనే శ్రద్ధ వహించడం కాదు, దానిని తెరపై ప్రతిఫలింపజేసే అంశంలోనూ నైపుణ్యం చూపించాలి అని మాత్రం తప్పకుండా అనిపిస్తుంది.

-అనే్షి