రివ్యూ

అర్జునుడంత కాదుగానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవ్యసాచి ** ఫర్వాలేదు
**
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెనె్నల కిషోర్ తదితరులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్: జె యువరాజ్
సంగీతం ఎంఎం కీరవాణి
నిర్మాతలు: నవీన్, మోహన్, రవిశంకర్
దర్శకత్వం: చందు మొండేటి
**
స్టార్ ఇమేజ్ కోసం కాకుండా భిన్నమైన కథనాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగచైతన్య. కార్తికేయ సినిమాతో ప్రత్యేకతను చాటుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి.. ఆ తర్వాత చైతుతో ‘ప్రేమమ్’ రీమేక్‌తోనూ మెప్పించాడు. టైటిల్‌తోపాటు విభిన్నమైన కథతో తెరకెక్కిన సవ్యసాచిపై మొదటినుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ప్రముఖ తమిళ నటుడు మాధవన్, ఒకప్పటి హీరోయిన్ భూమిక కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సవ్యసాచి కథేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ: విక్రమ్ (నాగచైతన్య) ఒక చిత్రమైన లక్షణంతో పుట్టాడు. కవలలుగా పుట్టాల్సిన వాళ్లు పోషకాహార లోపంవల్ల ఒకే బాడీలోకి వచ్చేస్తారు. అది అతని నర్వ్ సిస్టంతోపాటు ఎడమ చేతిలోకి కలిసిపోతుంది. దాంతో అతడి ఎడమచేయి తన మాట వినదు. ఆ చేతికి స్పర్శ వేరు. దాని ఆలోచనలు వేరు. ఈ చేతివల్ల విక్రమ్ తరచూ ఇబ్బందులు పడుతుంటాడు. దాన్ని అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇలాగే పెరిగి పెద్దయిన విక్రమ్.. కాలేజీలో తన జూనియర్ అయిన చిత్రను ప్రేమిస్తాడు. అనుకోని కారణాలతో ఆమెకు దూరమైన విక్రమ్.. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆమెను కలుస్తాడు. మళ్లీ ఆమెకు చేరువవుతాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతడి జీవితంలో పెద్ద అలజడి మొదలవుతుంది. ఒక ప్రమాదంలో అక్క (భూమిక) ఇంట్లో సిలిండర్ పేలి బావ చనిపోతాడు. అక్క ఆసుపత్రి పాలవుతుంది. విక్రమ్ ప్రాణంలా చూసుకునే అతడి మేనకోడలు కనిపించకుండా పోతుంది. దీని వెనుక ఒక అజ్ఞాతవ్యక్తి ఉన్నాడని తెలుసుకుంటాడు విక్రమ్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? విక్రమ్‌కు అతనికీ వున్న సంబంధం ఏమిటి? అతడి ఇంటిలిజెన్స్ గేమ్‌ని విక్కీ ఎలా అడ్డుకున్నాడు? ఈ విషయంలో అతడి ఎడమ చేయి ఎలా సహకరిస్తుంది అన్నది మిగతా కథ.
ఈ సినిమాలో నాగచైతన్య ఒకరిలో ఇద్దరిలా అనిపించేలా చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లోకంటే కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. నాగచైతన్య తన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పొచ్చు. ప్రథమార్థం వరకు అతడి పాత్ర మామూలుగా అనిపించినా.. ద్వితీయార్థంలో ప్రత్యేకత చాటుకుంటుంది. మాధవన్ తన ప్రత్యేకత చూపించాడు. కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ చేసిన మాధవన్.. తన పాత్రకు వెయిట్ తీసుకొచ్చాడు. అలవోకగా ఈ క్యారెక్టర్ చేసుకుపోయాడు. ఐతే మాధవన్ స్థాయికి తగ్గ పాత్ర అని మాత్రం అనిపించదు. హీరోయిన్ నిధి అగర్వాల్ జస్ట్ ఓకె అనిపిస్తుంది. ఆమె అందంగా ఉన్నప్పటికీ నటించే ఆస్కారమే లేదు. తన పాత్రలోనూ ఏ ప్రత్యేకతా లేదు. భూమికదీ మామూలు క్యారెక్టరే. వెనె్నల కిషోర్, సత్య, సప్తగిరి అక్కడక్కడా నవ్వించారు.
టెక్నికల్ విషయాలను పరిశీలిస్తే.. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. థీమ్‌సాంగ్ బాగున్నా, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు..’ పాట ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పైగా రీమిక్స్‌తో నిరాశపర్చాడు. ప్రథమార్థం వరకూ నేపథ్య సంగీతం మామూలుగా అనిపించినా.. ద్వితీయార్థంలో ప్రత్యేకత చాటుకుంటుంది. యువరాజ్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకాలేదు. సినిమా అంతా రిచ్‌గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు చందూ మొండేటి ఎంచుకున్న కథ బాగుంది. కొత్తగా అనిపిస్తుంది కూడా. అయితే హీరో ఎడమ చేయి అతడి మాట వినకపోవడం అనే యునీక్ పాయింట్‌ను తీసుకుని దాన్ని టెక్నికల్ అంశాలతో మరింత బాగా చేసి ఉండొచ్చు. కానీ అసలు పాయింట్‌ను సరిగ్గా వాడలేకపోయాడు. ప్రధాన పాత్రల్ని బాగానే తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఈ కొత్త కథకు తగ్గ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యాడు.
ఇప్పటివరకు మనం షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ లాంటి కథలను చూశాం.. ఇది కూడా అలాంటిదే. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అన్న లోపాన్ని చూపించాడు. హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. అది వేరే మనిషి. దాని ఆలోచన వేరు. దాని ప్రవర్తన వేరు. వినడానికి చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించే కానె్సప్ట్ ఇది. ఆరంభంలో ఈ కానె్సప్ట్‌ను పరిచయం చేస్తూ కన్విన్స్ చేసిన తీరు బాగుంది కానీ.. ఆరంభంలోవున్న క్యూరియాసిటీకి తర్వాత నడిచే వ్యవహారానికి సంబంధం ఉండదు. కొత్తగా అనుకున్న పాయింట్‌ను సినిమాలో ఎలాంటి ఆసక్తి లేకుండా కథనం సాగడంతో అసలు విషయం ప్రేక్షకులు మరచిపోతారు. సగటు లవ్‌స్టోరీ.. కామెడీ ట్రాక్, సాగదీసిన అంశాలు.. కథను డైవర్ట్ చేస్తాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా సస్పెన్సులో ఉంచి.. కొంచెం లేటుగా అసలు విషయాలన్నీ రివీల్ చేసి థ్రిల్ చేద్దామనే ఆలోచన సరైన ఫలితాన్నివ్వలేదు. హీరో- విలన్ మధ్య మైండ్ గేమ్ హీరోను ముప్పతిప్పలు పెడుతుంటాడు విలన్. అతడికి పెద్ద ఛాలెంజ్ విసురుతాడు. థ్రిల్లర్ సినిమాల్లో మూడ్.. ఉత్కంఠను క్యారీ చేయడం కీలకం. కానీ ఇక్కడ మాత్రం దర్శకుడు ఈ మూడ్‌ని మరోవైపు డైవర్ట్ చేశాడు. ఒక ట్రెండు సీన్లలో ఎడమచేయి ప్రస్తావన ఉంటుంది కానీ.. మిగతా అంతా ఒక మామూలు సినిమా చూస్తున్న భావనే కలిగిస్తుంది. నిస్సారమైన కొన్ని ఎపిసోడ్లు సినిమాను పక్కదారి పట్టించాయి.

-శ్రీనివాస్ ఆర్.రావ్