రివ్యూ

వెలిసిపోయిన రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగు * బాగోలేదు
*
నటీనటులు:తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, షఫీ
డీవోపీ: పి.టి.సురేందర్‌రెడ్డి
సంగీతం: యోగీశ్వర శర్మ
నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు
దర్శకత్వం: కార్తికేయ.వి
*
బాలనటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తనీష్ హీరోగా మాత్రం వరుస పరాజయాలను అందుకుంటున్నాడు. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా సరే అతని ఫేట్ మాత్రం మారడంలేదు. ఈమధ్యే బిగ్‌బాస్ రియాలిటీ షోతో కాస్త క్రేజ్ అందుకున్న తనీష్ ‘రంగు’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. నూతన దర్శకుడు కార్తికేయ.వి తెరకెక్కించిన చిత్రం‘రంగు’. ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈచిత్రం ఈరోజే విడుదలైంది. మరి ప్రేక్షకులను ఎలాంటి రంగులతో అలరించాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
టెన్త్‌లో స్కూల్ టాపర్ అయిన లారా (తనీష్) ఇంటర్‌లో కూడా స్టేట్ సెకెండ్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. బ్రిలియంట్ స్టూడెంట్‌గా ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టిన లారా తన కాలేజీలో ఓ అమ్మాయి కోసం సీనియర్‌తో గొడవ పడతాడు. సహజంగా ఆవేశపరుడైన లారా ఈ గొడవ కారణంగా దాడులు చేసేంత దూరం వెళ్తాడు. ఆ క్రమంలో లారా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా ఓ వ్యక్తిని చంపేస్తాడు. తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలవల్ల లారా రౌడీషీటర్‌గా మారతాడు. సెటిల్‌మెంట్స్ చేస్తాడు. ఈ క్రమంలో పూర్ణ (ప్రియాసింగ్) లారాను చూసి ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లిచేసుకుంటారు. అయతే అప్పటికే లారాపై శత్రువులు దాడి చెయ్యడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. వారినుండి ఏసిపి రాజేంద్రన్ (పరుచూరి రవి) లారాను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఆ ప్రయత్నాలవల్ల లారా వారినుండి తప్పించుకున్నాడా? లేడా అన్నది అసలు కథ.
ఆవేశపరుడైన యువకుడు లారా పాత్రలో తనీష్ మంచి నటనను కనబరిచాడు. గత తన సినిమల్లో కంటే ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు కొత్త లుక్‌తో కనిపించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ ఎడిసోడ్స్‌లో సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయంచేశాడు. హీరో హీరోయిన్లమధ్య సీన్లు, వారిమధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. కథానాయికగా నటించిన ప్రియాసింగ్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హీరోని పోలీసులనుండి కాపాడే సన్నివేశంలో ఆమె పెర్ఫార్మెన్స్ బావుంది. సినిమాలో మరో కీలక పాత్ర ఏసీపీ రాజేంద్రన్‌గా నటించిన పరుచూరి రవి ఆకట్టుకున్నాడు. పోసాని, రఘు తమ కామెడీ టైమింగ్‌తో కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు చేశారు.
దర్శకుడు కార్తికేయ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, పాయింట్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు. పి.టి.సురేందర్‌రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. సంగీత దర్శకుడు యోగీశ్వర శర్మ అందించిన పాటలు జస్ట్ యావరేజ్. సెకెండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాల్లో అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బస్వరెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
అయితే దర్శకుడు కార్తికేయ విజయవాడలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రౌడీ షీటర్ లారా జీవితానికి సంబంధించిన స్టోరీలైన్ తీసుకున్నారు కానీ, దాన్ని ఆకట్టుకునేలా కథను మలచలేకపోయాడు. హీరో, విలన్లతో గొడవ పడే సన్నివేశాలకు కారణాలు కూడా పెద్దగా బలంగా అనిపించవు. అలాగే వారి మధ్యన వచ్చే గొడవ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. కథనం ఆసక్తికరంగా నడిపితే బాగుండేది. దీనికితోడు సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పెద్దగా లేదు. కథనం నెమ్మదిగా సాగడం, ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకొనే విధంగా లేకపోవడం, స్టేట్ ర్యాంకర్ అయిన లారా ఓ రౌడీ షీటర్‌గా మారడానికి బలమైన కారణాలను చూపించకపోవడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి.
కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా.. సినిమా ఆసక్తికరంగా సాగలేదు. వాస్తవిక సంఘటనల ఆధారంగా కథను ఆసక్తిగా మలచలేకపోవడం పెద్ద మైనస్. సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నా, తనీష్ నటన, అలరించే అంశాలైతే.. నీరసించిన కథనం, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం వంటి విషయాలు సినిమాను నిరాశపరుస్తాయి.

-త్రివేది