రివ్యూ

సంక్లిష్ట ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడి పడి లేచె మనసు ** ఫర్వాలేదు
**
నటీనటులు:శర్వానంద్, సాయిపల్లవి, వెనె్నల కిషోర్, ప్రియదర్శి, కల్పిక, మురళీశర్మ, సంపత్, ప్రియారామన్, అజయ్ తదితరులు
సంగీతం:విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం:జెకె
నిర్మాత:సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం:హను రాఘవపూడి
**
శర్వానంద్ సాయిపల్లవి లాంటి చక్కటి జంట.. హను రాఘవపూడి లాంటి అభిరుచి వున్న దర్శకుడు. ఈ కాంబినేషన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పడి పడి లేచే మనసు’. మంచి అంచనాలమధ్య విడుదలైన చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం..
కథ: కోల్‌కతాలో చదువు పూర్తిచేసి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సూర్య (శర్వానంద్), అనుకోకుండా మెడికో వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట పడి.. చివరకు ఆమెను ప్రేమలోకి దించుతాడు. అయతే తన తల్లిందడ్రుల జీవితాల్లో చోటుచేసుకున్న అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలంటాడు. దాంతో వైశాలి, సూర్యకు ఒక నిబంధన పెడుతుంది. అదేంటి? సూర్య, వైశాలి తర్వాత కలిశారా? అన్నది మిగతా కథ..
శర్వానంద్.. సాయిపల్లవిల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇద్దరూ మంచి పెర్ఫార్మర్స్. ఇద్దరూ పోటీపడి నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలం. ఎమోషనల్ సీన్లలో ఎవరికివారే సాటి అనిపించారు. సినిమాలో కొన్నిచోట్ల సాయిపల్లవి మాత్రం డామినేట్ చేసింది. ఆమె పాత్రకున్న ప్రాధాన్యం అలాంటిది. ఇంటర్వెల్ బాంగ్‌లో సాయిపల్లవి హావభావాలు కట్టిపడేస్తాయి. శర్వా కొన్ని సీన్లలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. అయతే మిగతా నటీనటులెవరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి మాత్రం కనిపించినంతసేపు నవ్వించాడు. మురళీశర్మ.. సంపత్‌లాంటి నటుల పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయి. ప్రియారామన్ పాత్రలోనూ ఏ విశేషం లేదు. వెనె్నల కిషోర్ పాత్రకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. కల్పిక.. అజయ్‌ల నటన పర్వాలేదు.
టెక్నికల్‌గా సినిమా బాగా వర్కవుటైంది. విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతం అందించాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. జెకె ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశం ఆహ్లాదంగా అనిపించేలా కెమెరాతో మ్యాజిక్ చేశాడు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. హను రాఘవపూడి మంచి అభిరుచి వున్న దర్శకుడు. భిన్నమైన కథలు ప్రయత్నిస్తాడు. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో అతని శైలే వేరు. కానీ ఒక పూర్తి కథను బిగితో చెప్పమంటే మాత్రం చేతులెత్తేస్తాడు. చక్కగా కథను మొదలుపెట్టి.. ఒక దశలో పతాక స్థాయికి తీసుకెళ్లి అమాంతం వదిలేస్తాడు. ఒక కథను అందంగా మొదలుపెట్టి.. అంతే అందంగా నడిపించి.. ప్రేక్షకులకు ఒక మంచి ఫీలింగ్ కలిగించి.. అక్కడినుంచి కింద పడేశాడు. ప్రథమార్థంలో పెద్దగా కథ లేకపోయినా.. ప్రేమ వ్యవహారం రొటీనే అయినా.. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో హను అభిరుచి.. ట్రీట్‌మెంట్‌లో వుండే ప్రెష్‌నెస్.. శర్వానంద్- సాయిపల్లవిల పెర్‌ఫార్మెన్స్... వాళ్లమధ్య కెమిస్ట్రీ అన్నీ చక్కగా కుదిరాయి. కొన్ని సన్నివేశాలు అసంబద్ధంగా ఉన్నప్పటికీ శర్వా -పల్లవి జోడీ వాటిని కప్పిపుచ్చుతుంది. భిన్నంగా అనిపించే కోల్‌కతా నేపథ్యం.. విజువల్స్.. సంగీతం కూడా తోడై ప్రథమార్థం సంతృప్తిపరుస్తుంది.
ఎప్పట్లాగే ప్రేమ సన్నివేశాల్ని అందంగా తీర్చిదిద్దడంలో హను బలం కనిపిస్తుంది. అతడి అభిరుచిని చాలా సీన్లలో గమనించవచ్చు. సినిమా అంతటా డైలాగులు బాగున్నాయి. ద్వితీయార్థంలో దర్శకుడిగా అతడి ముద్రేమీ కనిపించదు. స్క్రీన్‌ప్లేనే గందరగోళంగా తయారైంది. తొలి గంటలో కథేమీ లేకపోయినా.. లీడ్ పెయిర్.. టెక్నీషియన్ల అండతో హను సునాయాసంగా సమయాన్ని లాగించేశాడు. అయతే ప్రేమ కథ అన్నాక ప్రథమార్థం వరకు రొమాంటిక్... ఫన్నీ సీన్స్‌తో బండి లాగించేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయంలో చాలామంది దర్శకులు విజయవంతమవుతారు. ద్వితీయార్థం గురించి చెప్పుకోవడానికేమీ లేదు. అర్థరహితంగా అనిపించే హీరో హీరోయిన్ల ప్రవర్తనతో ప్రేక్షకులకు మతి తప్పుతుంది. ప్రేమమ్‌లో సాయిపల్లవిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ.. హీరోయిన్ గతం మరిచిపోవడం మీద ఒక డ్రామా నడిపించాడు హను. అతకని సన్నివేశాల్లో వాళ్లిద్దరూ మనసు పెట్టి నటిస్తుంటే చూడ్డానికి జాలేస్తుంది తప్ప పాత్రలతో మాత్రం ఎమోషనల్ కనెక్ట్ అనిపించదు. ట్విస్ట్ రివీల్ చేసి అప్పటిదాకా నడిపిచిన వ్యవహారాన్ని జస్టిఫై చేయడానికి ఏదో ట్రై చేశారుకానీ.. కన్విన్సింగ్‌గా లేదు.

-త్రివేది