రివ్యూ

కానె్సప్ట్‌కి ఎక్కువ కంటెంట్‌కి తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యాగ్నెట్ * బాగోలేదు
*
తారాగణం: సాక్షిచౌదరి, అభినవ్ సర్దార్, పోసాని కృష్ణమురళి, భరణీశంకర్, అక్షిత, అవంతిక, జబర్దస్త్ శ్రీను, జబర్దస్త్ అప్పారావు, స్వాతినాయుడు తదితరులు
సంగీతం: కిషన్
నిర్మాత: ఎం శివారెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం ఆదిశేషసాయిరెడ్డి
*
‘పిల్లల్ని పెద్దవాళ్లు పట్టించుకోకపోతే వాళ్ల జీవితాలు ఏమవుతాయి అన్నది ‘మ్యాగ్నెట్’ మెయిన్ కానె్సప్టు. కానీ అది ఆచరణలో ఆ ఇంపాక్ట్‌మీద సూచనాత్మకంగా కృషి చేయకుండా వివరణాత్మకంగా చూపించి ‘మెసేజ్’ని ప్రేక్షకులు మర్చిపోయేలా చేసింది మ్యాగ్నెట్. దీంతో ‘వయస్కాంతం’ (మ్యాగ్నెట్ చిత్రానికిచ్చిన ఉపశీర్షిక) ఏ వయసువారినీ ఆకర్షించలేదు.
తల్లిదండ్రుల నుంచి సరైన పర్యవేక్షణ లేక చెడు అలవాట్లకు బానిసై చివరకు మాతృత్వ అవకాశమే కోల్పోతుంది హర్షిత (సాక్షిచౌదరి). ఆ క్రమంలో తనకత్యంత ఏకైక నమ్మకస్థురాలిగా ఉండి సోదరిగా పిలుచుకుంటున్న వనితని, తన కంపెనీ ఎండి రంజిత్‌కుమార్ (్భరణీ శంకర్) పాడుచేయాలని చూస్తే గెంటేస్తుంది. చివరకు రంజిత్‌కుమార్ తనను చంపించాలని చూస్తే అదీ ఎదుర్కొని బయటపడుతుంది. కానీ ఇలా ఎవరికీపట్టని ఈ ఒంటరి బ్రతుకెందుకు? అన్న నిస్పృహతో ఆత్మహత్యకు సిద్ధమవుతుంది. కానీ ఆమె ఆశించిన మాతృత్వపు మధురిమలను మా అమ్మాయిలో చూసుకో అని తన బిడ్డను, ఆమె చెల్లెలుగా చూసుకున్న స్ర్తి ఇవ్వడంతో కథ ముగుస్తుంది. ఈ మధ్యలో స్ర్తిలోలుడైన తండ్రి వద్దకు కూతురైన తనే హర్షిత వెళ్లడం లాంటివి చూపారు. సమాంతరంగా గాళ్‌ఫ్రెండ్స్‌ని వాడుకుని వదిలేసే తత్వంగల ఓ నలుగురు యువకులు, వాళ్లని బకరాలుగా మార్చేద్దామని ప్రయత్నించే యువతులు చివరకు వారు రిపేరు రాంబాబు (పోసాని కృష్ణమురళి) ద్వారా మారిన వైనం వగైరాలు ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్టు సినిమా మెసేజ్ విషయంపై జానెడు దృష్టినీ, ప్యాడింగులపై ప్రత్యేక దృష్టినీ పెట్టి చిత్ర నడకపై విసుగు కల్పించారు. అదీగాక చిత్ర నిడివి (దాదాపు రెండు గంటల ముప్ఫై నిమిషాలు) వీక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. ఇవ్వదలుచుకున్న మెసేజ్‌కీ, పాత్రల తీరుని రూపొందించిన విధానానికీ కొన్నిచోట్ల పొత్తు కుదరలేదు. అదెలాగంటే, సినిమాలో హర్షిత తల్లిదండ్రులు ఎవరిమానన వారు తమ తమ సుఖాలకే ప్రాధాన్యతనిస్తూ హాస్టల్‌లో పెట్టి చదివించారు. దాంతో చెడు అలవాట్లకు లొంగిపోయింది అన్నట్లు చూపారు. ఆలనా పాలనా పట్టించుకోకపోవడమన్నది ఎవరూ హర్షించరు. కానీ హాస్టల్‌లో ఉండి తర్వాత ఒంటరిగా ఉండటం వల్ల చెడు అలవాట్లు వచ్చేసాయి అన్నట్లు చూపడాన్నీ ఎవరూ అంగీకరించరు. ఎందుకంటే ఎలావున్నా నిబద్ధత ఉంటే దేనికీ లొంగరు. తర్వాత క్రమంలో హర్షిత ఉద్యోగం కోసం బాస్‌కు లొంగాల్సి రావడం అన్నదీ చూపారు. కానీ చిత్రంలో హర్షిత తండ్రిని పెద్ద పారిశ్రామికవేత్తగా చూపారు. మరి అలాంటి నేపథ్యంలో ఆమె ఇలా ఉద్యోగం కోసం ఈ తరహా మార్గాలకు ఎందుకెళ్లడం అన్నది సినిమా చూస్తున్న ఆడియెన్స్‌కి వెంటనే స్ఫురించే ప్రశ్న. దీన్నిబట్టి చిత్ర బృందం కధానుగుణంగా సన్నివేశాలు అనుసరించే పద్ధతి కాకుండా కేవలం కన్వీనియెన్స్ ఆలంబనగా చేసుకున్నట్టు అన్పిస్తోంది. ఇక రిపేరు రాంబాబు సంస్కరణల పర్వంలో భాగంగా ఫ్రెష్ (పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు లేకపోవడం) అన్ ఫ్రెష్ (పెళ్లికిముందే లైంగిక సంబంధాలుండటం)పై ఎక్కువ చర్చ చేశారు. సమాజంలో అందరు యువతీయువకులూ అలాగే అన్‌ఫ్రెష్‌గా ఉంటారనడం అవివేకం. మనం ఫ్రెష్షా, అన్‌ఫ్రెష్షా అని ఆలోచించాలని రాంబాబు పాత్ర చేత అనిపించడం లాంటివి అసమంజసం. అయితే ఎవరికివారు స్వయం నియంత్రతను పాటించాలి. అలాగే పెళ్లైనవారు పరస్ర్తి సాంగత్యం కోసం పరితపించే వారికి రిపేరు రాంబాబు, మొండెం లేని ఆడ, మగ బొమ్మకు వేసి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం తద్వారా వాళ్ల తప్పును తెలుసుకునేలా చేయడం బావుంది. కానీ రిపేరు రాంబాబే అంతకుముందు ఓ వనిత చుట్టూ తిరగడంలాంటి సీన్లు బోరుకొట్టించాయి. పాత్రధారుల్లో సాక్షిచౌదరి గ్లామరే సినిమాకు పెద్ద కమర్షియల్ గ్రామర్. అయితే దానిచుట్టూ అల్లిన కథలో బిగి లోపించి ఆమె చేసిన పోరాటాలూ, నృత్యాలూ పెద్దగా రాణించలేదు. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల నడుమ సన్నివేశాల్లో ఒకరిపై చూపిన సీనే్ల మిగతావారిపైనా చూపడంవల్ల ఉత్సుకతాపోయింది. వారి నటనపై ఆసక్తీ లేకుండా పోయింది. పోసాని తనకలవాటైన ‘రాజా..’ ధోరణిలో రిపేరు రాంబాబు పాత్రని నటించేశారు. అయితే ఆ డైలాగ్ డెలివరీ కొన్నిచోట్ల చాలా కృతకంగా అనిపించింది. ఈ సినిమాలో పేర్కోవలసింది డైలాగ్స్ గురించి. ఏ సంభాషణనైనా ఇట్టే చెప్తే అట్టే పట్టేసే నైజం ఈనాటి ప్రేక్షకుడిది. ఆ విషయం మర్చిపోయి సంభాషణల్లో దిగజారుడితనాన్ని స్పష్టంగా కన్పడేలా పొదిగారు ఇందులో. ‘ముఖ్యమైన పని కానిచ్చేస్తారు’, ‘ఏమే పాయింట్ చూసి బాల్ కొడుతున్నావ్’, ‘మేమూ కొట్టగలమమ్మా పాయింట్’ చూసి.. ‘మగవాళ్లు డ్రాయర్లు వేసుకోకపోతే వారికే కష్టం’, ‘పొట్టైనా గట్టిగా ఉంటుంది’.. ‘అందరికీ ఒకటే, రెండు మూడుండవు’.. ఇలాంటివెన్నో ఇందులో అసభ్య విహారం చేసేశాయి. అసలు ఇవి సెన్సారు ఒరవడి నుంచి బయటికెలా వచ్చాయో అర్థంకాదు. అదేరకంగా పాటల్లో పదాలూ కొన్నిచోట్ల విత్తనాలు, ఫలాలు (కబ్జాకరో.. పాటలో) యధేచ్చగా దొర్లాయి. ‘ప్రియురాలా ప్రియురాలా..’ పాటకి కిషన్ మంచి స్వరానిచ్చారు. అయితే ‘గంగానదిలో మోక్షం కోసం కొందరు, మలినాలు కడుక్కోడానికి ఇంకొందరు మునుగుతారు’ వంటి మంచి సంభాషణా ఇందులో విన్పడింది. అలాగే చిత్రాంతంలో హర్షిత పాత్ర ద్వారా మానవ జీవన పర్వంలో ఉండే ‘బర్త్’‘, ‘టీనేజ్’, ‘మ్యారేజ్’, ‘పేరెంటింగ్’, ‘డెత్’ విషయాలను స్పృశిస్తూ చెప్పించినదీ బావుంది. అయితే ఇలాంటివి కొన్నున్నా, చిత్రం కానె్సప్టుకీ, చూపిన కంటెంట్‌కీవున్న ఆది అంతాలను నేర్పుగా తెరపై ఆదిశేష సాయిరెడ్డి (దర్శకుడు) ఆవిష్కరించి ఉంటే ‘మ్యాగ్నెట్’ పేరుకు తగ్గట్లు అందర్నీ ఆకర్షించి ఉండేదేమో!

-అన్వేషి