రివ్యూ

అర్థంకాని ఆత్మకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినరా సోదర వీరకుమార * బాగోలేదు
*
తారాగణం: శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్, రవిరాజ్, పవన్ రమేష్, సన్ని, రోషన్ తదితరులు
ఎడిటర్:మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం:శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత:లక్ష్మణ్ క్యాదారి
దర్శకత్వం:సతీష్ చందర్ నాదెళ్ల
*
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ జంటగా సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్‌లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వినర సోదర వీరకుమార. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వీరు చెబుతున్నది ఏమిటో వినాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ
ఆ ఊర్లో ఆటో నడిపే యువకుడు రమణ (శ్రీనివాస్ సాయి) ఆ ఊరిలోని ప్రెసిడెంట్ కొడుకుతో గొడవపడి మొత్తం కుటుంబంతో సహా వేరే గ్రామానికి వస్తాడు. అక్కడ అనుకోకుండా ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఊరిలో కూడా ఆటో నడుపుకుంటున్న క్రమంలో సులోచన (ప్రియాంక జైన్)తో చిన్న గొడవ జరుగుతుంది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆమెతో ప్రేమలో పడతాడు రమణ. ఆమె వెంటపడుతూ చివరికి సులోచన కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. ఆ తరువాత కొన్ని అనుకోని సంఘటనలతో రమణ జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. ఇంతకీ ఆ సంఘటనలు ఏమిటి? చివరికి సులోచనను రమణ పెళ్లిచేసుకున్నాడా? అన్న విషయాలు మిగతా కథ.
హీరోగా నటించిన శ్రీనివాస్ సాయి రమణ పాత్రలో బాగానే నటించాడు. డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి అంశంలో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. హీరోయిన్‌గా ప్రియాంక జైన్ చాలా అందంగా కనిపిస్తూ, అటు గ్లామర్, ఇటు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేసింది. హీరో తండ్రిగా కనిపించిన ఉత్తేజ్, హీరో తల్లి పాత్రలో ఝాన్సీ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచారు. అలాగే తమ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం యావరేజ్‌గా నిలిచింది. పాటలు జస్ట్ ఓకె. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫి ఫర్వాలేదు. లక్ష్మీభూపాల రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సినిమాను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ళ ఆత్మకు సంబంధించిన మంచి స్టోరీ లైన్‌ను తీసుకున్నారు కానీ, ఆ లైన్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాలను రాసుకోలేదు. దీనికితోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ప్రేక్షకులు ఇన్‌వాల్వ్ అయ్యేవిధంగా ఉండవు. సినిమా విషయంలో దర్శకుడు ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.
దర్శకుడు ఆత్మకు సంబంధించిన మంచి స్టోరీ లైన్‌ను తీసుకున్నా దాన్ని పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాలను తెరకెక్కించలేదు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ మినహా మిగతా వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్‌ని కాస్త ఎమోషనల్‌గా తీసినా వర్కవుట్ కాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. దీనికితోడు సినిమా కొన్నిచోట్ల సినిమాటిక్‌గా సాగుతుంది.

-శ్రీనివాస్ ఆర్ రావ్