రివ్యూ

భావోద్వేగ క్రికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీ *** బాగుంది
***
నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, మాస్టర్ రోనిత్, సంపత్‌రాజ్, విశ్వంత్, ప్రవీణ్, జయప్రకాష్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
***
నాచురల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న నాని భిన్నమైన కథలతో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. భావోద్వేగాలను చక్కగా రాణించగలడని నిరూపించుకున్న నాని మరోసారి తనలోని నటుడిని పరిచయంచేసే ప్రయత్నమే జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. మరి జెర్సీ ఎవరు? క్రికెటర్‌గా నాని సక్సెస్ అయ్యాడా? కథలో చూద్దాం.
అర్జున్ (నాని) క్రికెటర్‌గా రాణించాలనే తపనపడే యువకుడు. పైగా ఆటలో మంచి నైపుణ్యం వుంటుంది. భారత జట్టులో ఆడాలన్నది అతని గోల్. ఐతే కొన్ని కారణావల్ల అతడి కల భగ్నమవుతుంది. దీంతో అతను క్రికెట్ విడిచిపెట్టేస్తాడు. కానీ ఆటకు దూరమయ్యాక తాను తానుగా బతకలేక సతమతమవుతుంటాడు. ఆక్రమంలో చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకుని- పనీ పాట చేయకుండా ఖాళీగా తిరుగుతూ అందరి దృష్టిలో లూజర్‌గా మిగిలిపోతాడు. అతను ఏ పని చేయకుండా ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరగడంతో అతని భార్య సారా (శ్రద్ధ శ్రీనాథ్) అతనితో గొడవ పడుతుంటుంది. అలాంటివాడు ఆటను మరచిపోయిన పదేళ్ళ తర్వాత 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనుకుంటాడు. అందుకు పురిగొల్పిన పరిస్థితులేంటి? మళ్లీ బ్యాట్ పట్టిన అతడికి ఎలాంటి అనుభవం ఎదురైంది? భారత జట్టుకు ఆడాలన్న అతడి కల ఫలించిందా? ఇదీ మిగతా కథ.
బాలీవుడ్‌లో వచ్చిన లగాన్, చక్ దె ఇండియా లాంటి సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఆ సినిమాల ఎఫెక్ట్ అలాంటిది. కానీ తెలుగులో అలాంటి ఎమోషనల్ రేకెత్తించిన స్పోర్ట్స్ డ్రామాలు అరుదు. అసలు క్రీడా నేపథ్యంలో మన దగ్గర సినిమాలే చాలా తక్కువ. రియలిస్టిక్‌గా.. అథెంటిగ్గా తెరకెక్కిన సినిమాలు మరీ తక్కువ. స్టార్ ఇమేజ్ వున్న నటుడు ప్రధాన పాత్రలో నటించి.. సగటు క్రీడాభిమాని బాగా కనెక్టయ్యేలా రియలిస్టిక్‌గా కథ కథనాలు పాత్రలు వుండి.. వారిలో భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన తొలి సినిమాగా జెర్సీని చెప్పొచ్చు. హీరో నాని గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అద్భుతంగా నటించి ఇదే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడంలో అతనికి అతనే సాటి. ఇప్పటికైతే జెర్సీ అతడి కెరీర్ బెస్ట్ ఫెర్‌ఫార్మెన్స్. తన లోపల ఒక అగ్నిపర్వతం బద్ధలైపోతున్నా.. భావోద్వేగాలు బయటపడనీయకుండా సాగిపోయే పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. ప్రతి సన్నివేశంలో అదరగొట్టాడు నాని. రంజీ జట్టులో చోటుదక్కాక ఉద్వేగానికి గురయ్యే సన్నివేశంలో నాని నటన అవుట్‌స్టాండింగ్‌గా వుంటుంది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. సారా పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. లుక్స్ పరంగా శ్రద్ధ మామూలుగా అనిపిస్తుంది కానీ... నటన విషయంలో మాత్రం ఆమె సూపర్. ఇక సత్యరాజ్ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో కోచ్ పాత్రకు ఓ ప్రత్యేకత తీసుకొచ్చారు. నాని కొడుకుగా నటించిన రోనిత్ అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా ఆర్టిస్టులందరూ కూడా బాగానే చేశారు.
సాధారణంగా స్పోర్ట్స్ నేపథ్యంవున్న సినిమా అంటే రియాలిటీ అన్నది ముఖ్యం. ఆ ఆటకు సంబంధించిన అంశాలను ఎంత జెన్యూన్‌గా చెప్పాము అన్న విషయాన్నిబట్టి సినిమా ఆధారపడి వుంటుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే క్రికెట్ నేపథ్యంలో ఇంత అథెంటిగ్గా సినిమా తీసిన దర్శకులు అరుదే. అతను మన దేశంలో క్రికెట్ సెటప్, కోచింగ్, మ్యాచ్‌లు జరిగే తీరు, ప్లేయర్స్ ఎంపిక- ఇలా అన్ని విషయాలపై దర్శకుడు చేసిన రీసెర్చి తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కథలోని భావోద్వేగాల్ని అర్థంచేసుకుని సంగీతం సమకూర్చే మ్యూజిక్ డైరెక్టర్. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ దొరికితే ఎలాంటి ఔట్‌పుట్ వస్తుందో జెర్సీలో చూడొచ్చు. అనిరుద్ సంగీతం.. సాను వర్గీస్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి రెండుకూడా వేరుగా అనిపించకుండా సినిమాలో మిక్స్ అయిపోవడం జెర్సీ ప్రత్యేకత. అనిరుధ్ పాటలు అన్నీ బాగున్నాయి. పాటలు పాటల్లా కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్‌లాగా సినిమాలో కలిసిపోయాయి. ఇక నేపథ్య సంగీతం సినిమాకు పెద్దఅసెట్. సాను ఛాయాగ్రహణం ఒక వింటెజ్ క్లాసిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలకు ఢోకాలేదు. రచయిత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ అతను గొప్పస్థాయిని చూపించాడు. జెర్సీని ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాలా తీర్చిదిద్దాడు.
క్రికెటర్ ప్రయాణాన్ని అతడి వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ గొప్ప భావోద్వేగంతో చూపించిన సినిమా జెర్సీ. ఈ చిత్రానికి ప్రధాన బలం హీరో పాత్రే. తనకు ప్రాణానికి ప్రాణమైన ఆటకు దూరమై తనను తాను కోల్పోతూ మానసిక సంఘర్షణకు లోనయ్యే క్రీడాకారుడిగా హీరో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు గౌతమ్. ఆ పాత్రకు నాని లాంటి గొప్ప నటుడిని ఎంచుకోవడంతో తిరుగే లేకుండాపోయింది. సాధారణ పాత్రల్ని కూడా తన నటనతో ప్రత్యేకంగా మార్చగలిగే నాని.. అర్జున్ లాంటి అద్భుతమైన పాత్ర దొరకడంతో చెలరేగిపోయాడు. కథలో తండ్రీకొడుకుల బంధాన్ని ఎలివేట్ చేసిన తీరు.. అందులోని భావోద్వేగాలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. జెర్సీ అనే టైటిల్ పెట్టడానికి గల కారణం చూపిస్తూ నడిపిన ఎమోషనల్ థ్రెడ్ సినిమాలో మేజర్ హైలెట్. జెర్సీ ప్రథమార్థంలో ఆటకు సంబంధించిన సన్నివేశాలు తక్కువే. హీరో వ్యక్తిగత జీవితంమీదే చాలావరకు కథ నడుస్తుంది. ఆటకు దూరమయ్యాక హీరో జీవితంలో ఎదురయ్యే పరిణామాలు... అతను ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలోనే ప్రథమార్థం సాగిపోతుంది. చాలావరకు సీరియస్‌గానే కథ నడిచినప్పటికీ.. బోర్ కొట్టని విధంగా సన్నివేశాల్ని రాసుకున్నాడు గౌతమ్. ఎక్కువ హడావుడి లేకుండా కథలోకి సింపుల్‌గా తీసుకెళ్లిపోతాడు గౌతమ్. పాత్రల పరిచయం.. వాటి ఎస్టాబ్లిష్‌మెంట్ సాఫీగా సాగిపోతుంది. సన్నివేశాలు మరీ కొత్తగా ఏమీ లేకపోయినా.. వాటిని అందంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పదేళ్లు ఆటకు దూరంగా వుండి.. 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేసిన హీరోకు ఆటలో పెద్దగా అడ్డంకులేమీ ఉండవు. మరీ అతడికి ఎదురే లేద్నట్లు చూపించడం నాటకీయంగా అనిపిస్తుంది. చాలావరకు రియలిస్టిక్‌గా సినిమాను నడిపించే ప్రయత్నం చేసిన గౌతమ్.. ఈవిషయంలో మాత్రం నిరాశపరిచాడు. పైగా రంజీ మ్యాచ్‌లు డే/నైట్‌లో జరుగుతున్నట్లు చూపించడం కూడా అథెంటిసిటీని దెబ్బతీసింది. స్లో నేరేషన్ మాత్రమే జెర్సీలో చెప్పుకోదగ్గ మైనస్‌లు.

-త్రివేది