రివ్యూ

చెప్పడానికేముంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మాత్రమే చెప్తా * బాగోలేదు
*
తారాగణం:తరుణ్‌భాస్కర్ దాస్యం, వాణీబబఓజన్, అభినవ్ గోమటం, నవీన్ జార్జ్, థామస్, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ భరద్వాజ్, వినయవర్మ, జీవన్ తదితరులు
సంగీతం:శివకుమార్
కెమెరా:మదన్ గుణ్ దేవా
నిర్మాతలు: వర్థన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ
రచన, దర్శకత్వం:షామీర్ సుల్తాన్
*
యువతరం గుండెల్లో గుర్తించతగ్గ ప్రముఖ స్థానం సంపాదంచిన విజయ్ దేవరకొండ నిర్మాణంలో సినిమా వస్తోందంటే, ఆ బాపతు ధాటి లేదా సమానస్థాయి ఊపు, ఇంకా కాకపోతే ఈమధ్య పిక్చర్స్‌లో ఎంత వెదికినా దొరకని ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని ఆశిస్తారంతా. అలాంటి ఎలాంటి విషయాలు చెప్పుకోవడానికి అంతగాలేని చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తా’ని బేషుగ్గా చెప్పేయవచ్చు. ఒక విషయాన్ని మరొకరికి మనం ఆపుకోలేని క్రమంలో చెప్పి, మరెవరికీ చెప్పొద్దనడం, తాతలకాలం నుంచీ సమాజంలో ఉన్నదే. ఆ అంశానికే కాస్తంత కంప్యూటర్ హాకింగ్, వైరల్, డిలీట్ అంటూ పదాల అల్లికలో ఓ రెండు గంటలపాటు దర్శకుడు షామీర్ సుల్తాన్ చేసిన లేటెస్టు సెల్యులాయిడ్ సర్కస్‌గా దీన్ని భావించాలి.
కథగా వెళ్తే- తన కెరీర్ జర్నీలో ఓ భాగంగా నటించిన ఓ పన్నీ హనీమూన్ వీడియో రాకేష్ (తరుణ్ భాస్కర్ దాస్యం) పెళ్లిముందు వైరల్‌గా నెట్‌లో హల్‌చల్ చేస్తూంటుంది. దీన్ని చూసి తనక్కాబోయే భార్య స్ట్ఫె (వాణీభోజన్) ఏవిధంగా రియాక్టవుతుందో అన్న భయం రాకేష్‌ని వెంటాడుతుంటుంది. మరి దాన్ని నెట్‌లో తొలగించడానికి రాకేష్, అతని ప్రాణస్నేహిడు కామేష్ (అభినవ గోమటం) వేసిన పిల్లిమొగ్గలు, ఆ క్రమంలో జరిగిన తతంగం వగైరా కథను మిగతా భాగంలో మనకి చెప్తారిందులో. ఆఖర్లో ఇంకో ట్విస్ట్ అసలా హనీమూన్ వీడియోలో నటించింది చిత్రం మొత్తం చెప్పుకొచ్చిన రాకేష్ కాదు, కామేష్ అని తేల్చడం. అసలిలాంటి ట్విస్టులూ, అంటే మన ప్రాబ్లం, మరొకరి సమస్యగా చిత్రించి అందరికీ తెలిసేలా చేయడడన్న చిలిపి ప్రక్రియ గతంలో అనేక తెలుగు చిత్రాల్లో చూసేసిందే. సో.. ఎలాంటి నావెల్టీ ఇక్కడ లేదు. సినిమా ప్రధాన బలహీనత- సినిమా కేంద్ర స్థానమైన హనీమూన్ వీడియో విషయం. చిత్ర నాయకుడుని ఓ టీవీ చానల్ యాంకర్‌గా చూపారు. మరి అలా ప్రసార మాధ్యమాల సంబంధిత రంగంలో ఉన్నపుడు, తనలా యాక్టింగ్ చేస్తూ చేసిన ఓ వీడియో ఫిలిమ్ విషయాన్ని కాబోయే భార్యకు సందర్భం వచ్చినపుడు వివరిస్తే పోతుంది. దానివల్ల ఏదో భూకంపం వచ్చేస్తుందన్న లెవెల్‌లో హీరో బృందం ప్రవర్తించడం చాలా సిల్లీగా ఉంది. అందులోనూ ఇతను మీడియా రంగం మనిషే అని తెలిసే స్ట్ఫె ప్రేమించింది. ఇలాంటి యాక్టింగ్ సీన్స్ అతని రంగంలో మామూలేనని డాక్టర్ వృత్తిలో వున్న స్ట్ఫె అంగీకరించలేదా? అన్న అనుమానమూ ప్రేక్షకులకు కలుగుతుంది. ఇలా ఇష్యూయే లేనిదాన్ని ఓ పెద్ద ఇష్యూగా చేయడంతో ఆసక్తిపోయింది. ఇక అదే పాయింట్‌ని పట్టుకుని సీన్స్‌పై సీన్స్ వచ్చేయడంతో ఓ టెలీ ఫిల్మో, కామెడీ స్కిట్సో చూస్తున్నట్టనిపించింది తప్ప ఫీచర్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ ఆడియెన్స్‌కు కలుగలేదు. ఇలాంటి ప్రధాన అవరోధాన్ని సినిమా నుంచి వేరు చేసి మిగిలిన విభాగాన్ని పరిశీలిస్తే.. నటుడిగా తరుణ్ భాస్కర్ రాకేష్ పాత్రలో పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో దునే్నశాడు. ముఖ్యంగా ఓసన్నివేశంలో ‘నీకు పుట్టబోయే కొడుక్కి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాలకు చెందిన ఏం పేరు పెడతావ్?’ అని అతని మేనమామ అడిగితే ‘ఇండియా’ అని పేరు పెడతానంటూ ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ అందరికీ తెలిసిన ప్రతిజ్ఞను అప్పజెప్పిన సీన్లో చాలా నేచురల్‌గా నటించాడు. కామేష్‌గా అభినవ్ గోమటం కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించాడు. ప్రత్యేకించి రాకేష్ నేను ‘బేసిగ్గా మంచోణ్ణిరా’’ అనిమాటిమాటిగా అంటున్నపుడు అభినవ్ ఇచ్చిన ప్రతిస్పందన చాలా బాగా వచ్చింది. కంప్యూటర్ హాకర్ పాపా పాత్రలో నవీన్ కూడా తన ఉనికిని బాగా చూపించుకున్నాడు. ఈయన చూడ్డానికి కాస్త కృష్ణుడు అన్న నటుడిలా ఉన్నారు. స్ట్ఫె పాత్రకు కావాల్సిన చిరాకునీ, రాకేష్ ప్రవర్తనపై క్షణక్షణానికీ కలిగే అనుమానాన్నీ వాణీ భోజన్ కరెక్టుగా పలికించారు. హనీమూన్ వీడియో నటిగా అవంతికా మిశ్రా అందంగా కన్పడింది.
‘అయామే వారియర్, ఆఖరి శ్వాస వరకూ స్ట్ఫెని ప్రేమిస్తూనే ఉంటాను’ అనే పాత్రలో జాన్సన్ పాత్రధారి ఆకట్టుకున్నారు. ఎటొచ్చీ అనసూయ పోషించిన సంయుక్త పాత్రే ప్రేక్షకులకి కనెక్టు కాలేదు. అయితే ఇవన్నీ కలకాలం గుర్తుండిపోయేలా అనుసంధానం చేసే బలమైన కథాతత్వం ఇందులో కూరకపోవడంవల్ల రావాల్సిన రాణింపు వీటికి రాలేదన్న భావన వీక్షకుణ్ణి బాధించింది. దర్శకుడిగా షామీర్ సుల్తాన్ పాత్రధారుల నటన, సన్నివేశాల కూర్పుపై పెట్టిన ఫోకస్, ఫిలిమ్‌కు ఆరిజన్ అయిన స్టోరీపై పెట్టుంటే ఈ తొలి ప్రయత్నం సంపూర్ణంగా సఫలమయ్యేది. ఒన్‌లైన్ పంచ్స్ అందివ్వడం ద్వారా సంభాషణలు చాలాచోట్ల బాగా పేలాయి. ‘‘రేపు పిల్లలు పుడితే..’’ అన్నమాటను కట్ చేస్తూ కామేష్ పాత్రధారి ‘రేపే ఎలా పుడతారండీ?’ అని అన్న పంచ్ థియేటర్‌లో బాగా రిసీవ్ చేసుకున్నారు. ‘అబద్ధం చెప్పడం- నిజం దాచడం రెండూ ఒకటే’ అని విశే్లషించడం బాగుంది. కానీ ‘ఒళ్లంతా కడుక్కుని ముడ్డి కడుక్కోవడం మర్చిపోయాడు’ వంటి డైలాగులనవసరం. ఆమాట ఉచ్ఛరింపచేయడంకన్నా పైన పేర్కొన్నట్లు చిన్న పాజ్ ఇచ్చి తర్వాత మాట చెప్పినా ఎఫెక్టు క్యారీ అయ్యేది. శివకుమార్ స్వరాల్లో విజయ్ దేవరకొండ కన్పించిన ‘కథ చెబుతాను విను..’ పాట సో..సో..గా అనిపించింది. అందులో ‘నీ తెర దించిన తర్వాత..’ అంటూ సాగిన లిరిక్ అర్థవంతంగా ఉంది. చిత్ర ప్రచార పరంగా నిర్మాత హోదాలో విజయ్ మాట్లాడుతూ ‘‘ఇంతవరకూ నేను సంపాదించినదాంట్లో మూడొంతులు ఈ సినిమాలో పెట్టా’’ అన్నారు. కానీ ఆ స్థాయి భారీతనం సినిమాలో ఎక్కడా కన్పడకపోవడం విచిత్రం. కేవలం మల్టీప్లెక్స్ ఆడియెనే్స కాకుండా మామూలు ఆడియెన్స్‌కూ రీచ్ అయ్యే కంటెంట్‌తో అందరికీ అందే కథలు గల చిత్రాలను దర్శకుడు షామీర్ సుల్తాన్ భవిష్యత్తులో అందిస్తారని ఆశిద్దాం.

-అన్వేషి