రివ్యూ

రొమాంటిక్ ఊల్లాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఊల్లాల ఊల్లాల
*
తారాగణం: నటరాజ్, అంకిత మహారాణ, నూరిన్ షరీఫ్, ప్రభాకర్, పృధ్వీరాజ్, అప్పారావు తదితరులు
సంగీతం: జాయ్
కెమెరా: కెజి కృష్ణ, దీపక్
నిర్మాత: ఎ గురురాజ్
దర్శకత్వం: సత్యప్రకాష్
*
యూత్ ఆలోచనల నేపథ్యంలో ‘ఊల్లాల ఊల్లాల’ అంటే అదొక ఉత్సహకరమైన పదమే. అదే పద్ధతిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు చిత్రంలో. కానీ సరైన స్క్రిప్ట్, దర్శకత్వ విలువలు లేకపోవడంతో ఊల్లాల కాస్తా ఊసూరుమనిపించింది. నేటి యువత ఆలోచనా విధానంలో ఈజీ మనీ అనేది ప్రధానం. దానికోసమే కోట్ల రూపాయల కట్నం తెచ్చే అమ్మాయి వేటలో నాయకుడు, ఎప్పుడో చనిపోయిన భర్తను నాయకునిలో ఊహించుకునే ఓ పాత్ర, చచ్చినట్టు ననే్న పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయి పాత్ర -కథను నడిపించే ప్రయత్నం చేశాయి.
పండు (నటరాజ్) సినిమా దర్శకుడు అవ్వాలనే ఆశయంతో ఏ పనికైనా ముందుకెళ్తుంటాడు. అందులో భాగంగానే కోటీశ్వరురాలైన అమ్మాయి వేటనూ సాగిస్తుంటాడు. అటువంటి అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుని హ్యాపీగా వుండాలన్న ఆలోచన అతనిది. ఆతనికి తగ్గట్టు నూరి (నూరిన్ షరీఫ్) పండుని ప్రేమిస్తూ అతనే్న అంటిపెట్టుకుని తిరుగుతుంటుంది. అనుకోని సంఘటనల నేపథ్యంలో త్రిష (అంకిత మహారాణ) పండు జీవితంలోకి వస్తుంది. పండునే తన భర్త అని ఆమె చెబుతూ ఉంటుంది. అయితే ఆమె ఆలోచనలు ఎలావున్నాయి? ఆమె మనిషిలా ఆలోచిస్తుందా? లేదా? అనేది మరో పాయింట్. త్రిష పండు జీవితంలోకి వచ్చినప్పటి నుంచీ సంఘటనలు మారిపోతూ ఉంటాయి. చివరికి ఆమె భర్త తిరిగొస్తాడు. తన భార్యది తప్పున్నా పండుపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అసలు త్రిష ఎవరు? ఆమె భర్త ఎందుకు అలా ఉన్నాడు? త్రిష చుట్టూ అల్లుకున్న సాలెగూడు ఎలాంటిది? పండుతోనే వాళ్లు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
సినిమా మొదటినుండీ యూత్‌ను టార్గెట్ చేసి అల్లుకున్న సన్నివేశాలు కావడంవల్ల అలాగే ఉన్నాయి. ఇక నూరిన్ షరీఫ్ ఓరకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటే, అంకిత మహారాణ తన స్కిన్ షోతోనే సినిమాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా గ్లామర్‌ను తెరపై ఆరబోసింది. కంటికి కనిపించిని బికినీతో తెరపై అందాలు ఆరబోసింది. అక్కడక్కడా బోల్డ్ సెక్సీ సన్నివేశాలతోపాటుగా మాటలూ యువతను టార్గెట్ చేసి పెట్టినవే తప్ప, సినిమాకు ప్రత్యేకంగా ఏమీ నిలవలేదు. ఎటువంటి కారణంలేని సన్నివేశాలు అనాసక్తితో సాగిపోతూంటాయి. దాంతో ఫస్ట్ఫా అంతా ప్రేక్షకుడికి బోర్ కొట్టేసింది. అక్కడక్కడా రొమాంటిక్ సీనే్ల రిలీఫ్. సెకెండాఫ్ వచ్చేసరికి ఫస్ట్ఫా కన్నా కొంచెం బెటర్ అన్పించింది. అయితే ఆ సన్నివేశాలన్నీ విషయం లేక తేలిపోయాయి. సరైన స్క్రిప్ట్ లేకపోవడం, విజన్ కూడా లోపించడంతో ప్రేక్షకులు సినిమాతో ప్రయాణించలేదు.
ఇదంతా ఒక ఎత్తయితే స్ర్తి పాత్రలో విలన్ ప్రభాకర్ వేసిన గెటప్, చేసిన నటన సినిమాకు దిష్టిబొమ్మలాంటిదే. అద్భుతమైన టాలెంట్, టైమింగ్ వున్న ప్రభాకర్‌ను చిత్రంలో సరిగా వాడలేదు. ఆ పాత్ర మరెవరు చేసినా అదేవిధంగా వుంటుంది. ఓ రకంగా పాత్ర డిజైనే సరిగా లేదు. ఇక పృధ్వీరాజ్, అప్పారావ్‌లు సోసోగా కన్పించారు. సత్యప్రకాష్ దర్శకత్వ ప్రతిభ మరింత పెంచుకోవాలి. ముఖ్యంగా కొడుకును బోల్డ్ సన్నివేశాల్లో డైరెక్ట్ చేసిన గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే. సినిమాపరంగా నిర్మాణ విలువలు బావున్నాయి. స్క్రీన్ నిండా మంచి ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకున్నారు. ఆ క్రెడిట్ మాత్రం సినిమాటోగ్రాఫర్‌దే.

-‘జి’