రివ్యూ

మారుతి.. మారలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..రోజులు మారాయి
**
తారాగణం: తేజస్వి మదివాడ, కృతికా జయకుమార్, పార్వతీశం, చేతన్ మద్దినేని, వాసు ఇంటూరి, రాజా రవీంద్ర, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: జెబి
ఛాయాగ్రహణం: పి బాల్‌రెడ్డి
మాటలు: రవి నంబూరి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: జి శ్రీనివాసరావు
దర్శకత్వం: మురళీకృష్ణ ఎం
**
‘న బూతే న భవిష్యత్’ -‘ఈ రోజుల్లో..’ ‘బస్‌స్టాప్’ చిత్రాల్ని బూతు ప్రహసనంతో యూత్‌ని ఉర్రూతలూగించి క్లైమాక్స్‌లో ‘్ఠట్’ పైన పేర్కొన్న ‘సీన్ల’ను డిలీట్ చేసేసి తాజాగా ఈ పది పేజీల నీతిని వొంటబట్టించుకోండి -అంటూ ‘మారుతి’ పాత ఫార్ములాకే కొత్త పంథాని అందించి సక్సెస్‌ని సాధించాడు. యూత్ అంటేనే బూతు అన్న ధోరణికి తెచ్చేశాడు. ఏది ఏమైనా -కమర్షియల్‌గా తనని తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేందుకు శ్రీకారం చుట్టిన ‘బూతు’ సూత్రం చాన్నాళ్లు జనాన్ని కట్టిపడేసింది. అయితే- తనపై వేసుకొన్న ‘బూతు’ ముద్రని చెరిపేసుకొనేందుకు ‘్భలేభలే మగాడివోయ్’ లాంటి చిత్రాన్ని తీసి తనకూ ‘బూతే’ కాదు బోలెడంత టేస్ట్ ఉందని నిరూపించాడు. తాజాగా వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమా తీస్తూ.. ఈ చిత్రానికి కథ, కథనాల్ని మాత్రమే అందించానని చెప్పుకొచ్చాడు. కానీ- మనసు పెట్టి రాసినట్టుగా లేదు. ‘ఈ రోజుల్లో’ తాలూకు ప్రభావం నుంచీ.. ‘ప్రేమ కథాచిత్రమ్’ మత్తు నుంచీ మారుతి బయట పడలేదని స్పష్టంగా తెలిసిపోతూంటుంది. ఆయా సన్నివేశాల కూర్పు కూడా ఇంచుమించు అదే రేంజ్‌లో సాగిపోతూంటాయి.
ఏ క్యారెక్టర్‌కీ సరైన ప్రవర్తనా నియమావళిని ‘మారుతి’ నిర్దేశించకపోవటంతో ఇష్టమొచ్చిన రీతిగా నడిచేస్తూంటాయి. దాంతో మొదటి సన్నివేశంలో చూసిన క్యారెక్టర్‌కీ.. ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరుకి పొంతన లేదేమిటి చెప్మా? అంటే -ఈ కథని యూత్ ఫార్ములానా.. బూతు ఫార్ములానా? లేక హారర్ థ్రిల్లర్ ప్రేమకథా చిత్రమా? సోషియో ఫాంటసీనా? అన్న దానికి ఇటు డైరెక్టర్ దగ్గరగానీ.. మారుతి వద్దగానీ సమాధానం దొరకదు.
కథ ఏమిటంటే..
ఆద్య (కృత్తిక), రంభ (తేజస్వి) -సరదా ప్లస్ ఆకతాయి మిళితమైన అమ్మాయిలు. అశ్వద్ (చేతన్), పీటర్ (పార్వతీశం)లను ‘పాకెట్‌మనీ’గా భావించేసి తెగ ఖర్చు పెట్టించేస్తూంటారు -అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ భామలు. లైఫ్ ఇలా సాఫీగా అబ్బాయిల్ని బకారా చేస్తూ కాలక్షేపం చేస్తూండగా -ఆద్య, రంభ జాతకాల్ని పరిశీలించిన శ్రీశైలం బాబా.. వీరిద్దరూ పెళ్లి చేసుకొన్న మూడు రోజులకే విధవలైపోతారని చెబుతాడు. దీంతో -ప్రేమించిన వాళ్లని పెళ్లి చేసుకొంటే వాళ్లు బాల్చీ తనే్నస్తే తర్వాతి పరిస్థితి ఏమిటని తీవ్రంగా ఆలోచించిన మీదట.. అవసరార్థం అశ్వద్, పీటర్‌లను పెళ్లి చేసుకొని గండం గట్టెక్కాలనుకుంటారు. అనుకున్నదే తడవుగా పెళ్లి చేసుకొంటారు ఆద్య, రంభ. అసలువారి జాతకంలో దోషం ఉందా? పెళ్లైన తర్వాత ఏం జరిగింది? ఇత్యాది అంశాలన్నీ క్లైమాక్స్‌లో దొర్లుతాయి. ఇదేదో పాత కథ విన్నట్టుగా లేదు. జానపద కథల్లో అచ్చం ఇలాంటివే బోలెడన్ని. ఆ కథనే ‘రోజులు మారాయి’ కాబట్టి.. ఈ విధంగా తెరకెక్కించే ప్రయత్నం జరిగింది -కాస్త బూతు అనే మసాలా జోడించి.
ప్రేక్షకులు తెలివిమీరారు. ట్రైలర్‌ని చూసి కథని ఇట్టే అల్లేస్తున్నారు. ఊహించేసుకొంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ‘లవ్’ని చూపించేసి.. తర్వాత ఆ కథని ఏం చేయాలో తెలీక.. హారర్ థ్రిల్లర్‌వైపు వెళ్లారు. ముందే ‘హారర్’ని ఊహించిన ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలన్నీ ‘చప్పగా’ టేస్ట్‌లెస్‌గా సాగిపోవటంతో ఈ కథని ‘మారుతి’ ఏమాత్రం ఆలోచించకుండా ఎడంచేత్తో రాసేశాడని ఒక తీర్మానానికి వచ్చేస్తారు. దీంతో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు చూసినట్టనిపిస్తుంది. ఆరంభం ఆర్భాటంగా.. ఆయా పాత్రల్ని పరిచయం చేస్తూ కథ చెప్పిన తీరు వొంటబట్టించుకొంటూండగానే... సరిగ్గా ‘ఇంటర్వెల్’కి వచ్చేటప్పటికి.. చూస్తున్నది కామెడీ సినిమానా? లవ్‌స్టోరీనా? హారర్ మూవీనా? ఏదీ తేల్చుకోలేని సందిగ్ధత బుర్రని తొలిచేస్తుంది. అయితే- లవ్ ప్లస్ కామెడీతో సగం దూరం తీసుకొచ్చి.. హారర్ నట్టేట్లో ముంచేశారు. ‘రోజులు మారాయి’ కాబట్టి కథ కూడా అదే తీరున సాగిపోయిందిలే అని సర్ది చెప్పుకోవాల్సిందే.
నటనాపరంగా- తేజస్విని, పార్వతీశం అన్నీ తామై నటించారు. పార్వతీశం తన డైలాగ్ డెలివరీతో నవ్విస్తాడు. కృతిక ఫర్వాలేదనిపిస్తుంది. అలీ ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రభావం ప్రేక్షకుల్ని నిర్వీర్యుల్ని చేస్తుంది. అసలు ఆ క్యారెక్టర్ వల్ల వొనగూడిన ప్రయోజనం ఏమిటన్నది అర్థంకాలేదు. ఆ మాటకొస్తే- పైన చెప్పుకొన్న నాలుగు క్యారెక్టర్లు కూడా ఒక్కో సన్నివేశంలో ఒక్కో తీరుగా ప్రవర్తిస్తుంటాయి.
సంగీతం ఓకే. దర్శకుడిగా మురళీకృష్ణ చేసిందానికన్నా.. మారుతి చెప్పిందే చేశాడేమో?! ‘మారుతి’ మార్క్ బూతు డైలాగులు అక్కడక్కడ పేలినప్పటికీ.. డబుల్ ఓకే మాత్రం కాదు. దీన్నిబట్టి చూస్తే.. మారుతి దర్శకత్వ శాఖలోనూ చేయి పెట్టాడేమో అనిపిస్తుంది. చివరిగా -‘రోజులు మారాయి’ టైటిల్‌కీ.. కథకి సంబంధం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

-బిఎనే్క