రివ్యూ

మహా బలహీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు..అంతం

తారాగణం:
చరణ్‌దీప్, రేష్మి గౌతమ్, వాసుదేవ్, సుదర్శన్ తదితరులు
సంగీతం:
కార్తిక్ రోడ్రిగ్జ్
సినిమాటోగ్రఫీ:
జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్
నిర్మాత:
వి సత్యనారాయణ, కళ్యాణ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్
**
ఉగ్రవాదులు ప్రవేశించలేని స్థలమే లేదు. వారి వ్యూహాలకు అడ్డుకట్ట లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలతో తామనుకున్నది చేసి చూపించే ఉగ్రవాదులు, వారివరకే అంతమైపోతున్నారు అనుకుంటే పొరపాటు. చాపకింద నీరులా సామాన్య ప్రజల జీవితాల్లోనూ ప్రవేశిస్తున్నారు. బాంబు విస్ఫోటనం జరిగినపుడు పదుల సంఖ్యలో చనిపోవడం సహజమే. కానీ, దానివెనుక వున్న నెట్‌వర్క్ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి అనే కథనంతో ‘అంతం’ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాత్రయ్యాక అందరూ నిదరమత్తులో జోగుతున్నపుడు ఉగ్రవాదుల కదలికలు మనిషిచుట్టూ తిరుగుతున్నాయి అని ఓ కొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు.
కథేంటి?
కళ్యాణ్ (చరణ్‌దీప్), వనిత (రేష్మి గౌతమ్) కొత్తగా పెళ్లయిన జంట. కళ్యాణ్ విజయవాడలో ఉద్యోగం చేస్తుంటాడు. వనిత ఉరఫ్ చిన్ని హైదరాబాద్‌లో ఉంటుంది. ఒక రోజు భర్తను చూడాలని, వెంటనే బయలుదేరి రమ్మని తెలిపింది. బయలుదేరిన కళ్యాణ్‌కు మెస్సేజీలు మీద మెస్సేజీలు వస్తుంటాయి. అయితే అవి తన భార్య ఫోన్‌నుండి అయినగానీ ఉగ్రవాదుల సందేశాల్లాగా ఉంటాయి. కారు నడుపుకుంటూ హైదరాబాద్ బయలుదేరిన కళ్యాణ్‌కు ఈ మెస్సేజీలు అన్నీ అర్థంలేనివి అనిపిస్తాయి. మొదట వాటిగురించి పట్టించుకోకపోయినా, రాత్రి తాను వస్తానని వంట చేస్తున్న భార్య ఫొటోను వెనుకనుంచి తీసి ఫోన్‌లో మెస్సేజ్ పెడతారు ఉగ్రవాదులు. అంటే తన భార్య ఉంటున్న ఇంట్లో ఆమెకు తెలియకుండా ఉగ్రవాదులు ఉన్నారని అర్థమైపోతుంది కళ్యాణ్‌కు. ఇక చేసేదేమీ లేక వారికి సరెండర్ అవుతాడు. అప్పటినుంచి కళ్యాణ్ హైదరాబాద్ వచ్చేలోపు ఆ రాత్రంతా ఏమేంచేయాలో నిర్దేశిస్తుంటారు ఉగ్రవాదులు. ఈలోపు వనితను కిడ్నాప్ చేసి ఉగ్రవాదుల స్థావరానికి తీసుకెళ్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఏయే ఊర్లలో ఆగి అక్కడ నిర్దేశించబడిన వ్యక్తి ఇచ్చిన బ్యాగ్‌లుకానీ, సూట్‌కేసులుకానీ తీసుకొని రావడమే కళ్యాణ్ పని. కళ్యాణ్‌కు దారిలో లిఫ్ట్ అడిగిన ఓ వ్యక్తి (సుదర్శన్) కలిసి ప్రయాణిస్తుంటారు కారులో. మధ్యమధ్యలో అపరిచిత వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యానాలే కొద్దిగా కామెడీగా ఉంటాయి. పూర్తి ఉద్వేగంతో ఉన్న కళ్యాణ్ వద్ద అతను వేసే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ ఇస్తాడు. అది కారులో పెట్టాక ప్రయాణంలో ఆ బ్యాగ్‌లో ఏం ఉందో చూస్తారు. అదొక పెద్ద బాంబ్. అక్కడనుండి కథ స్పీడందుకుంటుంది. కారు నిర్దేశిత ఊరికి చేరుకోవడంలో ఒక్క సెకండ్ ఆలస్యమైనా అటువైపు వున్న ఉగ్రవాది (వాసుదేవ్) వనితను హింసిస్తుంటాడు. అందుకోసమైనా కళ్యాణ్ వాళ్లు చెప్పిన వేగంతో ప్రయాణించాలి. హైదరాబాద్ చేరుకున్న అతనికి బాంబ్‌ను సిద్ధం చేసి సికింద్రాబాద్ స్టేషన్‌లో పెట్టడానికి పంపిస్తారు. అప్పటికే కళ్యాణ్ అకౌంట్‌లో 20 లక్షలు జమ చేస్తారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో వనిత ఉగ్రవాదుల చెరనుండి ఎలా తప్పించుకుంది? కళ్యాణ్ బాంబ్‌ను సికింద్రాబాద్ స్టేషన్‌లో పెట్టాడా? అనేది మిగతా కథనం.
ఎలా వుంది?
సినిమాను థ్రిల్లర్ జోనర్‌లో సాగదీసే ప్రయత్నం చేశారు. మొదట్లోనే వాయిస్‌ఓవర్ విజయవాడ టు హైదరాబాద్ గురించి చెప్పినదాంట్లో క్లారిటీ లేదు. అది అర్థం కూడా కాదు. రేష్మి గౌతమ్ పాత్ర కేవలం రెండు సీన్లకే పరిమితమైంది. ఉన్నంతలో సినిమా అంతా చరణ్‌దీప్‌పైనే సాగింది. అయితే కథనం అంతా రాత్రివేళల్లో జరగడంతో, అదికూడా కారులో ఉండటంతో అతని నటన కూడా పెద్దగా ఎలివేట్ కాదు. ఉన్నంతలో సుదర్శన్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. స్క్రీన్‌ప్లే మొదటి నుంచీ స్లోగా సాగడంతో కథలో వున్న పట్టు జారిపోయింది. అంతం అన్న టైటిల్‌కు జస్ట్ఫికేషన్ కుదరలేదు. సినిమా చూస్తున్నంత సేపూ గతంలో వచ్చిన ఇలాంటి జోనర్ చిత్రాలు (పాపే మాప్రాణం) గుర్తుకొస్తాయి. ‘ఈవేళలో నీవు ఏంచేస్తు వుంటావో’ రీమిక్స్ పాట చిత్రీకరణ బాగుంది. నటీనటుల్లో రేష్మి గౌతమ్ తన పాత్రవరకూ ఓకె. చరణ్‌దీప్‌కు ఎక్కువ స్కోప్‌వున్నా నటనలో తేలిపోయాడు. వాసుదేవ్ విలన్‌గా ఆకట్టుకునేలా నటించాడు. ఒక మంచి కథనాన్ని తీసుకుని ఆసక్తికరంగా చిత్రీకరిద్దామని అనుకున్నాగానీ లోపాలు ఎక్కువ ఉండటంతో దర్శక నిర్మాతల వ్యూహం బెడిసికొట్టింది.

-తిలక్