రివ్యూ

ట్విస్టులు దాటని ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* నేను సీతాదేవి

తారాగణం: సందీప్, రణధీర్, భవ్యశ్రీ, కోమలి, జీవా, గుండు హనుమంతరావు, ‘చిత్రం’ శ్రీను, వెనె్నల కిషోర్, అంబటి శ్రీనివాస్, ధనరాజ్, సుమన్‌షెట్టి.
సంగీతం: చైతన్యరాజా,
నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్,
నిర్మాత: చిటుకుల సందీప్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
శ్రీనివాస్ మల్లం

పాత రోజుల్లో.. పేరుకు తగిన లక్షణాలూ వగైరా సదరు వ్యక్తిలో ఉన్నాయా? లేదా? అని ఆరా తీసేవారు. ఉదాహరణకు కుటుంబరావు పేరు పెట్టుకున్నవాడు ఏకాకిగావుంటే వీడు ‘పేరుకు తగ్గట్టు లేడురా’ అని అనేవారు. అలాగే ‘హరిశ్చంద్రరావు’ పేరు పెట్టుకున్నాడుగానీ, నోరువిప్పితే అన్నీ అబద్ధాలే అని బుగ్గలు నొక్కుకునేవారు. అలాగే ‘నేను సీతాదేవి’ అన్న సలక్షణమైన పేరున్న ఈ చిత్రం విలక్షణమైన కథాగమనంతో కదులుతుందేమో అని అనుకుంటే, అది ఒక్కపట్టున పూర్వపక్షం చేసేసి తీవ్ర నిరాశ కలిగించింది ప్రేక్షకులకి. ఒకరి ‘ఆత్మ’ మరొకరిలో చేరడం. అలా వచ్చిన ఆత్మను వదిలించుకోడానికి సంబంధితుడు చేసి సక్సెస్ అయిన ఉదంతంలో కథ ముగియడం జరుగుతుంది. ఇలాంటి చిత్రాల పేర్లేవైనా అందులో మ్యాటర్ ఒకటేనన్న స్థిర అభిప్రాయాన్ని మరోసారి బలపరిచి ‘వైవిధ్యం’ వెర్రి మాట అని మన నెత్తిమీద మొట్టికాయ కొట్టేసి ఉన్న రెండు గంటల ఏడు నిమిషాలు గడిపేసి వెళ్లిపోయింది సీతాదేవి.
జమీందారు కొడుకు (రణధీర్) తనవల్లే గుమస్తా రామయ్య కూతురు సీతాదేవి పెళ్లి తప్పిపోయిందన్న బాధతో ఆమెనే పెళ్లి చేసేసుకుంటాడు. కానీ సీతాదేవిని ఆమె భర్త స్నేహితులే మానభంగం చేసి చంపేస్తారు. అలా అర్ధాంతరపు మరణం పొందిన ఆమె ఆత్మ, ఆ జమీందార్ బంగ్లాలోనే ఉండి అందర్నీ భయపెడుతూ ఉంటుంది. ఆ బంగ్లాలోంచి ఆ దెయ్యాన్ని పోగొట్టే ప్రక్రియలో పోలీసులు చేసిన ప్రయత్నంలో రామ్ (సందీప్), అతని భార్య దేవి వస్తారు. దేవిని సీత ఆత్మ ఆవహించి అందరినీ భయపెడుతూ ఉంటుంది. అలా ఆవహించిన సీత ఆత్మను దేవినుంచి ఎలా తొలగించి మామూలు మనిషిని చేసాడన్నది మిగతా కథ. ఇలా ఆత్మలు ప్రవేశించి, వెళ్లిపోయే కథా కేంద్రమే ఈ బాపతు హారర్ చిత్రాల ముడి పదార్థం కనుక ఎలాంటి థ్రిల్‌నీ, కొత్తదనాన్నీ ఏ కోశానా అందివ్వకపోగా సీన్స్ అనేకం మన సహనానికి పరీక్షపెడతాయి. ఆత్మల తార్కికాలు ఎప్పుడో మరచిపోయిన ప్రేక్షకులు, కనీసం ఇందులో పోలీసుశాఖ పట్లైనా సరైన అవగాహనతో సన్నివేశాల్ని దర్శకుడు చూపిస్తే బావుండునన్న భావనతో ఉంటాడు. కానీ సినిమా ఆ భావననీ ‘ఉష్‌కాకీ’ చేసింది. ప్రభుత్వపరమైన జమీందారు బంగ్లాను అమ్మి ఆదాయాన్ని చేకూర్చుదామని అనుకోడంవరకూ సర్కారు బాధ్యత అనుకోవచ్చు. కానీ ఇందులోలా పోలీసులు దెయ్యాన్ని పోగొట్టడానికి మాంత్రికుడు (వెనె్నల కిషోర్) సహాయం తీసుకోవడం వగైరా పూర్తి అసహజభరితం. అలాగే ఇలాంటి అసంగత అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ట్విస్టులు మీద ట్విస్టులు పెడితే చూపరి ఎంతో ఉత్కంఠ పొందుతాడనుకోవడం వట్టి భ్రమ. అలా పెట్టిన ట్విస్ట్‌కు అంతోఇంతో లాజిక్ వుండాలి. ఉదాహరణకు జమీందార్‌గా కొడుకు కళ్లెదుటే స్నేహితులు అతని భార్యను పాడుచేస్తారు. కానీ అదీ అతని డైరెక్షన్ మేరకే అనడం ట్విస్ట్‌కోసమే అనిపించింది. ఎందుకంటే అతనంతట అతనే సీతను పెళ్లి చేసుకున్నాడు. అందులో ఎవరి బలవంతంలేదు. అలాంటప్పుడు ఇలా నెగిటివ్ టర్న్ ఇవ్వడంలో ఔచిత్యం లేదు. మరి పోనీ అలాంటి దుష్ట మనస్తత్వం ఉందనుకున్నా, అవన్నీ తన కళ్లెదుటే నిరంతరం వీడియో తీస్తున్నవారి స్నేహితురాలిని ఏ సందర్భంలోనూ ఇలాంటివారు ఆపకపోవడం ఇంకా చిత్రం. ఇక నటీనటుల పెరఫార్మెన్స్ ప్రస్తావనకు వస్తే, రామ్ పాత్రధారి సందీప్‌కు నటించాలనే ఉత్సాహం నిండుగా కనిపిస్తున్నా, అది పూర్తిగా తెరపై అనువదితమయ్యే స్థాయి సాధన చేయలేదు. దానివల్ల పలికిన డైలాగ్స్, బాడీ లాంగ్వేజీ ఏదీ కుదురుగా స్క్రీన్‌పై కనిపించలేదు. జమీందార్‌గారి అబ్బాయి పాత్రధారి రణ్‌ధీర్ నటన ఒకింత బావుంది. సీత పాత్రధారి మంచి నటనను ప్రదర్శిస్తే, దేవి పాత్రధారి పాటల్లో ఇప్పటి ట్రెండ్ నాయికల్లా ‘ఉదార’ ప్రదర్శనకు ప్రయత్నించింది. వెనె్నల కిషోర్ మాంత్రికుడిగా మరోసారి తన మార్కు నటన రిపీట్ చేశాడు. జీవా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు.
‘ప్రేమలోపడిన వాడు త్రివిక్రమ్‌లా మాటలు రాసేయగలడు, వేటూరిలా పాటలు రాసేయగలడు’ అన్న పంచ్ డైలాగులు సరఫరాలో సంభాషణాకర్త తనవంతు సహకారం అందించినా, అవి నేరుగా ప్రేక్షకునికి చేరేలా సంబంధిత నటుడు ఉచ్ఛరించకపోవడంతో పండలేదు. అయితే ‘చెప్పీచెప్పగానే చెప్పుల్లో కాళ్లు పెట్టేసి వెళ్లిపోతుంది’ వంటి డైలాగులు బాగా పేలాయి. చైతన్య పాటల్లో ‘పడిపోయినట్టే మావా’ అన్నది క్యాచీగా ఉంది. ఈ పాటని సింహ చక్కటి గాత్రంలో ఆకట్టుకునేలా పాడాడు. పాటలోని పదాల్ని కూడా పాట రచయిత బాగా పేర్చారు. మొత్తంగా సీతా-దేవి ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయంది.

-అనే్వషి