రుచి

ఐస్ ఫ్రూట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడితో..
కావలసిన పదార్థాలు: మామిడి రసం: రెండుగ్లాసులు
బెల్లం: అరకప్పు, పాలు: మూడు గ్లాసులు
యాలకులు: ఆరు, జీడిపప్పు: 10
తయారీ విధానం: మామిడి రసానికి పాలు, బెల్లం కలిపి బాగా గిలక్కొట్టాలి. దీనిలో యాలకులపొడి, జీడిపప్పు పలుకులు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్ర మానికి ఐస్‌ఫ్రూట్ స్టాండ్స్‌లో పోసి ఐస్‌క్రీ మ్ పుల్లను పెట్టాలి. వీటిని డీప్‌ఫ్రీజర్‌లో ఉంచాలి. మూడు గంటల తర్వాత వీటిని తీసేసి పిల్లలకు చల్లచల్లగా ఇవ్వచ్చు.
పాలు,
కొబ్బరితో..
కావలసిన పదార్థాలు: పాలు: నాలుగు గ్లాసులు
కోవా బిళ్లలు: ఆరు, పంచదార: ఒక కప్పు
కొబ్బరి: ఒక కప్పు, కుంకుమపువ్వు: చిటికెడు
తయారీ విధానం: ముందుగా వేడిపాలల్లో కోవాబిళ్లలు, పంచదార కరిగించాలి. దీనిలో కొబ్బరి కోరును కూడా చేర్చాలి. తరువాత దీనిలో కుంకుమపువ్వు కూడా కలిపి ఐస్‌ఫ్రూట్ అచ్చుల్లో వేసి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచాలి. మూడు, నాలుగు గంటల తర్వాత తీసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.
పుచ్చకాయతో..
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ రసం: ఆరు గ్లాసులు
పెరుగు: రెండు కప్పులు, పంచదార: అరకప్పు
అల్లం రసం: ఒక చెంచా, తేనె: రెండు చెంచాలు
తయారీ విధానం: ముందుగా పుచ్చకాయ రసంలో పెరుగు, పంచదార, అల్లంరసం, తేనెలను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రూట్ అచ్చుల్లో వేసి డీప్‌ఫ్రీజ్ చేయాలి. అంతే చల్లచల్లని పుచ్చకాయ ఐస్‌ఫ్రూట్ రెడీ.
సుగంధితో..
కావలసిన పదార్థాలు: సుగంధిపాలు: నాలుగు కప్పులు
పంచదార: అరకప్పు, నిమ్మరసం: రెండు స్పూన్‌లు
తయారీ విధానం: సుగంధిపాలల్లో పంచదారను వేసి బాగా కలపాలి. ఇష్టమున్నవారు నిమ్మరసాన్ని కూడా వేసి బాగాకలపాలి. వీటిని ఐస్‌ఫ్రూట్ అచ్చుల్లో పోసి డీప్‌ఫ్రీజ్ చేసి పిల్లలకు చల్లచల్లగా అందించవచ్చు. సుగంధిపాలు ఒంట్లో వేడిని బాగా తగిస్తుంది.

- ఎన్.వాణీప్రభాకరి