రుచి

పొగ మజ్జిగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: పెరుగు, మంచినీళ్లు, ఉప్పు, జీలకర్ర , పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బొగ్గు , నెయ్యి
తయారీ విధానం: ముందుగా పెరుగులో నీళ్ళు పోసుకుని చిక్కటి మజ్జిగను తయారుచేసుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి కొద్దిగా నెయ్యివేసి వేడయ్యాక అందులో జీలకర్ర , కరివేపాకు వేసి వేయించాలి. వేగాక దీన్ని మజ్జిగలో వేసేయాలి. పైన ఒక పచ్చిమిర్చిని ఉంచాలి. తరవాత బొగ్గును వేడిచేయాలి. బొగ్గు వేడయ్యాక దీన్ని ఒక చినె్న గినె్నలో పెట్టి దానిపై నెయ్యివేసి మజ్జిగ ఉన్న గినె్నలో ఈ గినె్నను పెట్టి మూతపెట్టాలి. ఇలా చేయడం వల్ల బొగ్గుపై నెయ్యి వేయడం వల్ల వచ్చిన కమ్మని పొగవాసన మజ్జిగకు పట్టుకుంటుంది. ఐదు నిముషాల తర్వాత ఈ గినె్నను తీసేసి మజ్జిగను బాగా కలిపి అందరికీ సర్వ్ చేస్తే సరి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మజ్జిగ ఇది.