రుచి

బీరకాయతో కొత్తకొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యరీత్యా బీరకాయ చాలామంచి కూరగాయ. దీని గుజ్జు కాక పొట్టుతో కూడా వంటకాలు చేస్తారు. చాలా రుచిగా ఉంటాయి. ఉల్లికారం కూర, పొట్టు పచ్చడి, వడలు, దోసెలు, కొబ్బరితో కలిపి పప్పు, పెరుగుపచ్చడి, బీరపొట్టు కారంపొడి చేస్తారు. బీరకాయ మెంతి బద్దలు చేస్తారు. ఇందులో పీచు ఉండటంవల్ల ఎక్కువ తినడం మంచిది.
*
బీరకాయ వడలు
కొంచెం ఈనెలు తీసిన బీరకాయలు - 2
శనగపప్పు - 1 కప్పు
బియ్యంపిండి - 1/2 కప్పు
వెల్లుల్లి అల్లం పేస్ట్ - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
కారం - 2 చెంచాలు
నువ్వులు - 2 చెంచాలు
నూనె - 20 గ్రా.
ఉప్పు - 1 చెంచా
కొబ్బరి కోరు - 1/2 కప్పు
విధానం: బీరకాయ ముక్కలు తరిగి, నానిని శనగపప్పు, కొబ్బరి చేర్చి మిక్సీ పట్టాలి. దీనికి బియ్యపిండి, కొబ్బరి, నువ్వులు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి బాగా కలిపి నూనె కాగనిచ్చి వడలుగా తట్టి వేయించాలి. వడలు రెడీ!
*
బీరపొట్టు దోశెలు
తరిగిన బీరకాయ పొట్టు - 2 కప్పులు
పెసలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కొబ్బరి - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
నూనె - 1/2 కప్పు
కొత్తిమీర - 1 కప్పు
బియ్యంపిండి - 1 కప్పు
విధానం: ముందుగా పెసలు నానబెట్టి, పొట్టు చేర్చి, మిర్చి చేర్చి మెత్తగా రుబ్బి బియ్యంపిండి, అల్లం, జీలకఱ్ఱ, ఉప్పు, కొత్తిమీర తరుగు కలిపి దోశెలుగా వేసుకోవాలి. అన్నంలోకి టిఫిన్‌గాను పనికివస్తుంది.
*
బీరపొట్టు కారం
బీరపొట్టు - 2 కప్పులు
ఎండుమిర్చి -12
ఆవాలు -1 చెంచా
జీలకఱ్ఱ -1/2 చెంచా
మినప్పప్పు, శనగపప్పు - 4 చెంచాలు
నూనె - 2 చెంచాలు
వెల్లుల్లిపాయలు - 24
ఉప్పు - 1 చెంచా
చింతపండు - 1/2 కప్పు
నువ్వులు - 1/2 కప్పు
ఎండుకొబ్బరి - 1 చెంచా
విధానం: పోపులు వేయించి మిక్సీ పట్టాలి. బీరపొట్టు దోరగా వేయించి ఆరబెట్టి ఈ కారానికి చేర్చి మళ్లీ మిక్సీ పట్టాలి. ఇది పొడిగా ఉండాలి. నీరు చేర్చకూడదు. పై పదార్థాలన్నీ మిక్సీ పట్టి ఆరనివ్వాలి. ఇది 2, 3 రోజులు నిల్వ ఉంటుంది.

-వాణి ప్రభాకరి