రుచి

లే..కేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. ఎందుకంటే వారికి పెట్టిన డబ్బా ఒక్కరోజు కూడా ఖాళీగా రాదు. మరికొంతమంది పిల్లలైతే డబ్బాలో పెట్టింది పెట్టినట్లు ఇంటికి తీసుకువస్తారు. కారణం రోజూ అదే టిఫినా.. బోర్ కొడుతోంది అంటారు. అలాంటి పిల్లల కోసమే ఈ కేకులు. ఇంట్లో రకరకాల పండ్లతో తయారుచేసే ఈ కేకులతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. పిల్లలకు ఎంతో సరదా. ఇవి లంచ్ బాక్స్‌లో పెడితే ఇంటికి ఖాళీ డబ్బాలు రావలసిందే.. పిల్లలు భలేగా ఇష్టపడే అలాంటి కేకులను తయారుచేయాలంటే తయారీ విధానాన్ని చూడాలి కదూ.. మరి ఆ కేకులను ఒకసారి చూసేద్దామా..
*
కేక్ బాల్స్
కావలసిన పదార్థాలు:
కేకు పొడి: అరకిలో
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్: 200 గా ములు
కకోవా పొడి: 50 గా ములు
కొబ్బరిపొడి: పావు కిలో
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదాం, కిస్‌మిస్..
తయారీ విధానం:
ముందుగా ఓ గినె్నలో ఫ్రూట్ జామ్‌ను తీసుకుని గరిటతో గిలకొట్టినట్లు బాగా కలపాలి. అప్పుడు అది క్రీములా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో గినె్నలో కేకుపొడిని తీసుకోవాలి. దీనిలో కకోవా పొడి, కొబ్బరిపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో క్రీములా తయారైన జామ్ కూడా వేసి ముద్దలా కలపాలి. అవసరమైతే ముద్ద కట్టడానికి కొద్దిగా పాలను కూడా కలపచ్చు. దీన్ని ఓ అరగంటసేపు నాననిచ్చి తరువాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని చివరగా కొబ్బరిపొడిలో దొర్లిస్తే కేక్‌బాల్స్ రెడీ.
*
మాంగో స్పాంజ్ కేక్
కావలసిన పదార్థాలు:
మామిడి గుజ్జు: ఒక కప్పు
మైదా: అరకప్పు
వెన్న: మూడు టేబుల్ స్పూన్లు
పంచదార: రెండు టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా: టీ స్పూన్
బేకింగ్ పౌడర్: టీ స్పూన్
గోధుమ పిండి: టీ స్పూన్
ఉప్మా రవ్వ: టేబుల్ స్పూన్
చాకోచిప్స్: మూడు టేబుల్ స్పూన్లు
కోడిగుడ్డు: ఒకటి
వెనీలా ఎసెన్స్: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఒక గినె్నను తీసుకుని అందులో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, గోధుమపిండి, ఉప్మారవ్వ, చాకోచిప్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో గినె్నను తీసుకుని అందులో వెన్న, పంచదార, కోడిగుడ్డు, మామిడి గుజ్జు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయి నురుగులా వచ్చిన తరువాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా గిలక్కొట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేకుపాత్రలో తీసుకుని ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద ఇరవై నిముషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సీజనల్ మాంగో స్పాంజ్ కేక్ తయారు.
*
రెడ్ వెల్వెట్ కేక్
కావలసిన పదార్థాలు:
మైదా: అరకప్పు, మొక్కజొన్న పిండి: పావు కప్పు
చాక్లెట్ పొడి: పావు కప్పు, పంచదార: అరకప్పు
కోడిగుడ్డు: ఒకటి, మజ్జిగ: పావుకప్పు
వెన్న: రెండు టేబుల్ స్పూన్లు
వెనిగర్: అరచెంచా
వంటసోడా: పావుచెంచా
ఎరుపు రంగు: చిటికెడు
వెనీలా ఎసెన్స్: అరచెంచా
తయారీ విధానం:
ముందుగా ఒక గినె్నలో కోడిగుడ్డు, మైదా, మొక్కజొన్న పిండి, పంచదార, ఎరుపురంగు, చాక్లెట్ పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత ఇందులో వెనె్న, వెనీలా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న పూసిన కేకు పాత్రలో వేసి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇరవై నిముషాల పాటు బేక్ చేసుకుంటే చాలు పిల్లలు ఎంతో ఇష్టపడే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ.
*
ఆపిల్ కేక్
కావలసిన పదార్థాలు:
మైదాపిండి: ఒక కప్పు
పంచదార : ఒకటిన్నర కప్పు
పాలు: 100 మి.లీ.
ఆపిల్స్: మూడు
గుడ్లు: రెండు
వెన్న: 50 గ్రాములు
బేకింగ్ పౌడర్: రెండు టీ స్పూన్లు
దాల్చినచెక్క పొడి: అర టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా ఆపిల్స్‌ను బాగా కడిగి తొక్కతీసి పలుచని స్లైసుల మాదిరిగా కోయాలి. తరువాత మైదాపిండిలో బేకింగ్ పొడి వేసి కలపాలి. ఇందులోనే వెన్న, ఒక కప్పు పంచదార, గుడ్లు, పాలు పోసి బాగా నురుగొచ్చేలా గిలక్కొట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన కేకు పాత్రలో పోసి దానిపై ఆపిల్ ముక్కల్ని పరవాలి. వీటిపై మిగిలిన పంచదార, దాల్చిన చెక్కపొడి చల్లాలి. దీన్ని 180 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద అరగంటసేపు బేక్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఆపిల్ కేక్ రెడీ.