రుచి

రాగి/జొన్న అంబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు - 1 కప్పు ( బీర, సొర, పొట్ల,క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాట, లాంటివాటిని ఉపయోగించుకోవచ్చు) సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక స్పూన్, నీరు - తగినంత, మజ్జిగ - తగినన్ని
తయారీ విధానం: ముందుగా కూరగాయ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీరు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో కూరగాయల ముక్కలు, అల్లం ఉప్పు కూడా చేర్చుకోవాలి. ఆ తరువాత చిన్న గినె్నలో కొద్ది చల్లని నీటిలో జారుగా రాగిపిండిని కలిపి పెట్టుకోవాలి. కూరగాయ ముక్కలు చేర్చిన తరువాత మరుగుతున్న నీటిలో ఈ జారుగా కలిపిన రాగిపిండిని పోస్తూ గరిటతో కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల రాగి పిండి ఉండలు కట్టదు. బాగా కలుపుతూ ఐదు నిముషాలు ఉంచాలి. రాగి పిండి ఉడికినట్టుగా చిక్కనవుతుంది. అపుడు దింపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఉడికి చల్లారిన రాగిపిండిని మజ్జిగపోస్తూ జారుగా కలుపుకోవాలి. ఇపుడు దీనికి కావాలనుకొంటే కొత్తిమీర చేర్చుకోవచ్చు. ఇక రాగి జావ రెడీ ఇట్లానే రాగి పిండికి బదులు జొన్న పిండిని కూడా వాడవచ్చు.