రుచి

పోషకాలు మెండు చిన్నపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొటాషియం, కెరోటిన్, విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండే ఎండు ద్రాక్ష. ఇది తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీర్ణశక్తికి ఇది చాలా మంచిది. బిపీ నియంత్రణకు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుకు ఈ ద్రాక్ష పనికి వస్తుంది. వీటిలో ఉండే పీచు కారణంగా మలబద్ధకం, డయేరియాని నివారించి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ పదార్థాలు క్యాన్సర్లు రానివ్వవు. మధుమేహం తో బాధపడే వాళ్లకు ఇవి స్నాక్స్‌లా ఉపయోగపడుతాయి. వీటిలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దానివల్ల రక్త హీనత కలుగదు. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్ష వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వుత్పత్తి అయ్యే ద్రాక్షలో 80% పంటను వైన్ తయారీలో వాడుతారు. 7% ఎండు ద్రాక్షగాను, మిగిలిన శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని, జ్యూస్ తీసి వాడుకోవడానికి వాడుతుంటారు. కొన్న రకాల వ్యాధులు సోకినప్పుడు ద్రాక్ష ఆహారంగా ఉపయోగపడుతుది. యూరినల్ లో అమోనియా పెరగకుండా రాళ్లు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చూడడానికి ఎంతో చిన్నవిగా ఉండే ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో మేలు. వీటిల్లో చక్కెర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వారికి వీటని తినడానికి ఇస్తే తక్కువ సమయంలోనే వారు కోలుకుంటారు. లేకపోతే ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీళ్లను తాగినా కూడా మంచి శక్తి ఎక్కువగా లభిస్తుంది.
మలబద్ధకం ఉన్నవారు రెండు టేబుల్ స్ఫూన్ ఎండు ద్రాక్షను నీళ్లల్లో నానబెట్టి ఉదయానే్న తాగి, ఆనానిన పండ్లను తినేస్తే మలబద్దకం మచ్చుకు కూడా లేకుండా పోతుంది. ఈ నీళ్లు ఈ పిల్లలకు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్ కూడా ఎక్కువ. బరువు తక్కువగా ఉన్నవాళ్లకీ రక్తహీతనతో బాధపడే వాళ్లకీ మంచిది. రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. చర్మ వ్యాధులకు ద్రాక్షారసంతో మర్దన చేస్తే తగ్గిపోతుంది.
ఎండుద్రాక్షతో పొటాషియం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా నీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండటం వల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వల్ల నరాలబలహీనత రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.
రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి ఉపయోగపడతాయి. అలాగే గొంతు వ్యాధితో బాధపడేవారికి ఎండు ద్రాక్షను తీసుకొంటే ఉపశమనం కలుగుతుది. శ్వాసనాళంలో ఉన్న కఫాన్ని తొలగించడంలో ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. గుండెను పదిలం చేసే విటమిన్ బి, ఫాస్పరస్ ఎండు ద్రాక్షలో ఉన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ద్రాక్షను తీసుకోవచ్చు. ఎన్నో రకాల దీర్ఘవ్యాధులను నయం చేసే ఎండు ద్రాక్షను ఉపాహారంగా తీసుకోవడం మంచిది. చర్మ సౌందర్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి