రుచి

ఉసిరి రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకంలో ఉసిరిని తప్పకుండా తినాలంటారు. ఉసిరి ఇంటికి సిరిసంపదలను తీసుకొస్తుందంటారు. ఉసిరిని అరచేతిలో ఉంచుకుంటే చాలు ఆరోగ్యం వరిస్తుందంటారు. సరిలేని గొప్పదనం ఉసిరిది.. ఇవన్నీ ఉసిరికి ఉపమానాలు. ఉసిరికాయల గురించి తెలియనివారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో.. ఎందుకంటే ఉసిరికాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఉసిరికాయను ఇంగ్లీషులో గ్రూస్‌బెర్రీ అంటారు.
దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అందుకే కార్తీకం స్పెషల్‌గా ఉసిరి వంటలను చేసి ఆరగించండి.. ఆనందించండి.. ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోండి..

పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం: అరకప్పు
ఉసిరికాయలు: పది
పసుపు: అరస్పూను
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నువ్వులపొడి: రెండు చెంచాలు
జీడిపప్పు: నాలుగు
ఎండుమిర్చి: నాలుగు
పచ్చిమిర్చి: నాలుగు
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
శనగపప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు: ఒక స్పూన్

తయారీ విధానం

ముందుగా అన్నం వండుకుని వెడల్పాటి గినె్నలో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పువేసి వాటిని కచ్చాపచ్చాగా దంచాలి. పెద్ద ఉసిరికాయలైతే తురుముకోవచ్చు. తర్వాత పాన్‌లో నూనెవేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేగాక అందులో ఎండుమిర్చి, పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. దీన్ని రెండు, మూడు నిముషాలు మీడియం మంటపై వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నంలో వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే ఉసిరి పులిహోర రెడీ..

కారం

కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి: మూడు పాయలు
నూనె: మూడు టీ స్పూన్లు
కారంపొడి: రెండు టీ స్పూన్లు
ఉప్పు: తగినంత
ఆవాలు: పావు టీ స్పూన్
జీలకర్ర: పావు టీ స్పూన్
కరివేపాకు: రెండు రెబ్బలు

తయారీ విధానం

ముందుగా ఉసిరికాయలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి పాయలు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ పోపులో వేసేయాలి. పచ్చివాసనపోయి నూనె తేలేవరకు ఉంచి తీసేయాలి. వేడివేడి అన్నంతో ఈ కారం భలే రుచిగా ఉంటుంది.

కూర

కావలసిన పదార్థాలు

పెద్ద ఉసిరికాయలు: అరకిలో
పసుపు: అర టీ స్పూన్
కారం: అర టీ స్పూన్
జీలకర్ర పొడి: అర టీ స్పూన్
ధనియాల పొడి: అర టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
మెంతులు: అర టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: రెండు స్పూన్‌లు
కొత్తిమీర: ఒక చిన్న కట్ట

తయారీ విధానం

ఉసిరికాయలను తొడిమలు లేకుండా శుభ్రం చేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత పసుపు, కారాలతో పాటు తగినంత నీటినిపోసి ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలపై తొక్క తీసి ఆరనివ్వాలి. తర్వాత ఓ నాన్‌స్టిక్ పాన్‌లో నూనెవేసి ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడాక ఉసిరికాయల్ని వేసి మంట తక్కువ చేసుకుని రెండు నిముషాలు వేయించాలి. తర్వాత ఇందులో జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి మరో రెండు నిముషాలు వేయించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఈ కూరని వేడివేడి అన్నంలో నెయ్యివేసుకుని, కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

పకోడీ

కావలసిన పదార్థాలు

ఉసిరికాయల తురుము: కప్పు
శనగపిండి: రెండు కప్పులు బియ్యప్పిండి: పావుకప్పు
మొక్కజొన్నపిండి: టీస్పూన్
వంటసోడా: చిటికెడు ఉప్పు: తగినంత
కరివేపాకు: నాలుగు రెబ్బలు
కారం: టీస్పూన్ నూనె: వేయించడానికి సరిపడా
అల్లం ముద్ద: టీస్పూన్ ఉల్లిపాయ ముక్కలు: కప్పు

తయారీ విధానం

ఒక గినె్నలో శనగపిండి, బియప్పిండి, మొక్కజొన్నపిండి, ఉసిరితురుము, కారం, కరివేపాకు తురుము, ఉల్లిముక్కలు, వంటసోడా, అల్లం ముద్ద, ఉప్పు, కొద్దిగా కాంచిన నూనె, తగినన్ని నీళ్లుపోసి పకోడీపిండిలా కలపాలి. బాణలిలో నూనెపోసి కాగాక ఈ పిండిని పకోడీల్లా వేసి వేయించి తీయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఉసిరి పకోడీ రెడీ.

బజ్జీలు

కావలసిన పదార్థాలు

బంగాళాదుంపలు: నాలుగు
పచ్చిమిర్చి: ఐదు
శనగపిండి: కప్పు
బియ్యప్పిండి: పావుకప్పు
జీలకర్ర: రెండు చెంచాలు
వాము: రెండు చెంచాలు
కారం: కొద్దిగా
వంటసోడా: అరచెంచా
ఆవాలు: చెంచా
నూనె: వేయించడానికి సరిపడా
ఉసిరి తురుము: నాలుగు కప్పులు
ఉప్పు: తగినంత
కరివేపాకు: రెండు రెబ్బలు

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టుతీసి పెట్టుకోవాలి. పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అవి వేగాక ఉసిరి తురుము వేయాలి. రెండు నిముషాల తర్వాత తగినంత ఉప్పు, బంగాళాదుంపల ముద్దవేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బుల్లెట్ ఆకారంలో చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్‌ను వెలిగించి ఓ బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. ఈలోగా ఓ గినె్నలో శనగపిండి, బియ్యప్పిండి, వంటసోడా, వాము, కారం, కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
ఉసిరి బుల్లెట్లను ఈ పిండిలో ముంచి కాగిన నూనెలో వేసుకుని దోరగా వేయించుకుంటే సరి.. నోరూరించే ఉసిరి బజ్జీలు తయారు.