రుచి

వేడిమికి స్క్వాష్‌లతో చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ముదురుతున్నాయి. పిల్లలకు ఒంటిపూట బడులు మొదలయ్యాయి. ఈ వాతావరణ మార్పుతో పిల్లల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఒంట్లో వేడిమి పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలకు మామూలు డైట్‌తో పాటు ఒంట్లో వేడిని తగ్గించే పానీయాలను అందించాలి. కానీ ఇలాంటి పానీయాలను చూస్తే పిల్లలు ముఖం తిప్పేసుకుంటారు. అలాకాకుండా కొంచెం కొత్తగా తాజా పండ్లతో ‘స్క్వాష్’ వంటి పానీయాలను చేసి ఇస్తే.. ఎగిరి గంతేసి తాగేస్తారు. అలాంటి పానీయాలేంటో ఒకసారి చూద్దాం.
*
అనాసతో..
కావలసిన పదార్థాలు
అనాస పండ్ల ముక్కలు:
నాలుగు కప్పులు
పంచదార: అరకిలో
నిమ్మ ఉప్పు: చెంచా
సోడియం బెంజోయేట్:
చెంచా
లెమన్ ఎల్లో కలర్: చిటికెడు
పైనాపిల్ ఎమల్షన్:
అరచెంచా
తయారుచేసే విధానం
సోడియం బెంజోయేట్, ఎమల్షన్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ముందుగా అనాస పండ్ల ముక్కలను మిక్సీ పట్టుకుని చిక్కని జూస్‌ను తయారుచేసుకోవాలి. ఈ జూస్‌ను స్టవ్‌పై ఉంచాలి. మరోవైపు పంచదారలో కొద్దిగా నీళ్లు కలిపి స్టవ్‌పై ఉంచాలి. పంచదార కరిగి లేత పాకం వచ్చి కాసేపటికి చిక్కపడుతుంది. తరువాత ఇందులో నిమ్మ ఉప్పు, లెమన్ ఎల్లో కలర్, సోడియం బెంజోయేట్, పైనాపిల్ ఎమల్షన్‌లు వేయాలి. బాగా కలిసిన తరువాత పంచదార మిశ్రమాన్ని స్టవ్‌పై నుంచి దించేయాలి. ఇందులోనే స్టవ్‌పై ఉంచిన అనాస జూస్‌ను కలపాలి. ఇది చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు.
*
జింజర్ లైమ్‌తో..
కావలసిన పదార్థాలు
పంచదార: రెండు కప్పులు
నీళ్లు: కప్పు
అల్లం: చిన్న ముక్క
నిమ్మకాయలు: నాలుగు పెద్దవి
ఎల్లో ఫుడ్‌కలర్: చిటికెడు
పొటాషియం మెటాబైసల్ఫేట్: చిటికెడు
తయారుచేసే విధానం
అల్లాన్ని చెక్కు తీసి మిక్సీలో వేసి నీళ్లు చల్లుకుంటూ మెత్తని గుజ్జులా, కాస్త పలుచగా చేసుకోవాలి. తరువాత నిమ్మరసాన్ని తీసుకుని పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గినె్నలో పంచదార, నీళ్లు, అల్లం గుజ్జు కలిపి స్టవ్‌పై ఉంచాలి. ఈ మిశ్రమాన్ని మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే.. కాసేపటికి పాకం వస్తుంది. తీగ పాకం వచ్చాక దింపేయాలి.
ఇది చల్లారిన తరువాత ఫుడ్ కలర్, నిమ్మరసం, పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసి కలిపితే సరిపోతుంది. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. దీనిని గ్లాసులో పావు వంతు తీసుకుని, ఇందులో ముప్పావు వంతు చల్లని నీళ్లు కలుపుకుని పిల్లలకు అందిస్తే వేసవిలో డీహైడ్రేషన్ అనేదే దరిచేరదు.
*
ద్రాక్షతో..

కావలసిన పదార్థాలు
గింజల్లేని నల్లద్రాక్ష: కిలో
పంచదార: ఒకటిన్నర కిలో
నీళ్లు: ఒకటిన్నర గ్లాసు
నిమ్మ ఉప్పు: రెండు చెంచాలు
సోడియం బెంజోయేట్: పావు చెంచా
టోనోవిన్ ఎసెన్స్: అర చెంచా
తయారుచేసే విధానం
పంచదార ఒక గ్లాసు నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచాలి. తీగపాకం వచ్చేదాకా మరగనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ద్రాక్షపండ్లను బాగా కడిగి గుజ్జులా చేసుకోవాలి. దీనిని కూడా స్టవ్‌పై మరోపక్క ఉంచాలి. దీనిలో నీరంతా ఇగిరిపోయి మరీ చిక్కగా కాకుండా మధ్యస్తంగా ఉన్నప్పుడే దించేయాలి. వేడి పూర్తిగా చల్లారిన తరువాత ఇందులో పంచదార పాకం వేసి బాగా కలపాలి. దీనిలోనే నిమ్మ ఉప్పు, సోడియం బెంజోయేట్, టోనోవిన్ ఎసెన్స్ వేసి మరోసారి కలిపితే ద్రాక్ష స్క్వాష్ సిద్ధం.
*
మామిడితో..
కావలసిన పదార్థాలు
మామిడిపండు గుజ్జు: అరలీటరు
పంచదార: కిలో
మ్యాంగో ఎమల్షన్: చెంచా
నిమ్మ ఉప్పు: పది గ్రాములు
సోడియం బెంజోయేట్: అర చెంచా
తయారుచేసే విధానం
మామిడి పండు గుజ్జును స్టవ్‌పై ఉంచి కాసేపు ఉడకనిచ్చి దింపేయాలి. పంచదారలో గ్లాసు నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచాలి. పంచదార బాగా కరిగి తీగపాకం వచ్చాక దింపేయాలి. మామిడి గుజ్జు, పంచదార పాకం చల్లారాక ఈ రెండిటినీ బాగా కలపాలి. తరువాత ఇందులో మ్యాంగో ఎమల్షన్‌తో పాటు మిగిలిన పదార్థాలను కూడా ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చు. మ్యాంగో స్క్వాష్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా గ్లాసులో పావు వంతు దాకా తీసుకుని ముప్పావువంతు చల్లని నీళ్లు పోసుకుంటే టేస్టీ టేస్టీ మ్యాంగో స్క్వాష్ సిద్ధం.
*
కమలాలతో..
కావలసిన పదార్థాలు
కమలాఫలాలు: ఆరు
పంచదార: అరకిలో
నిమ్మ ఉప్పు: ఒకటిన్నర చెంచా
ఆరెంజ్ కలర్: చిటికెడు
ఆరెంజ్ ఎమల్షన్: చెంచా
పొటాషియం మెటాబైసల్ఫేట్: పావు చెంచా
తయారుచేసే విధానం
పొటాషియం మెటాబైసల్ఫేట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కమలాఫలాలను వలుచుకుని, మిక్సీలో వేసి జూస్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పంచదారలో అరగ్లాసు నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచాలి. మంట తగ్గించి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది తీగపాకం వచ్చాక స్టవ్‌పై నుంచి దించేయాలి. చల్లారిన తరువాత కమలాఫలాల జూస్, నిమ్మ ఉప్పు, ఆరెంజ్ రంగు, ఆరెంజ్ ఎమల్షన్ వేసి బాగా కలపాలి. వీటిని బాగా కలిపిన తరువాత పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసి మళ్లీ కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు.
*
పుదీనాతో..
కావలసిన పదార్థాలు
తాజా పుదీనా ఆకులు:
రెండు కప్పులు
నిమ్మకాయలు: రెండు
పంచదార:
రెండున్నర కప్పులు
నీళ్లు: గ్లాసు
అల్లం తరుగు: పావు చెంచా
తయారుచేసే విధానం
అడుగు మందంగా ఉన్న గినె్నలో నీళ్లు, పంచదార తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. పంచదార కరిగి తీగపాకం వచ్చాక దించేయాలి. ఇది పూర్తిగా చల్లారాక పుదీనా ఆకుల తరుగుతో పాటు మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి ఓ నాలుగైదు గంటలు వదిలేయాలి. ఈ పదార్థాల సారం అంతా పాకంలో కలుస్తుంది. దీన్ని గాజు సీసాలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కావలసినప్పుడల్లా ఓ గ్లాసు చల్లని నీటిలో రెండు, మూడు చెంచాలు వేసుకుని తాగవచ్చు. ఈ స్వ్కాష్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి.. రెండు రోజులకోసారి అప్పటికప్పుడు తాజాగా చేసుకుంటే మరీ మంచిది.