రుచి
వహ్వా.. షర్బత్తులు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వేసవి ముదురుతోంది. పిల్లలు, పెద్దలు ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు వివిధ రకాల పానీయాలను సేవిస్తుంటారు. అలాంటిదే శ్రీరామనవమి రోజు తాగే పానకం కూడా.. కేవలం పండుగ రోజే కాదు.. వేసవిలో తరచూ ఆ పానకాన్ని తాగితే వడదెబ్బ తాకదు. శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. మరి శ్రీరామనవమిరోజు చేసే
పానకంతోపాటు వివిధ రకాల పానీయాల (షర్బత్తుల) తయారీ చూద్దామా..
తర్బూజాతో..
కావలసిన పదార్థాలు
తర్బూజా: ఒకటి
నిమ్మరసం: పావు కప్పు
వట్టివేళ్ల చుక్కలు: నాలుగు
బత్తాయిరసం: అరకప్పు
ఉప్పు: కొద్దిగా
తయారుచేసే విధానం
తర్బూజా చెక్కు తొలగించి గింజలు తీయాలి. ముక్కలుగా కోసం మిక్సీలో మెత్తగా చేయాలి. కొద్దిసేపయ్యాక నీళ్లు పోసి మళ్లీ తిప్పాలి. తరువాత మరోపాత్రలోకి తీసుకుని వడకడితే తర్బూజా రసం సిద్ధమవుతుంది. అందులో నిమ్మరసం, బత్తాయిరసం, వట్టివేళ్ల చుక్కలు, చిటికెడు ఉప్పు వేసి చెంచాతో బాగా కలియతిప్పాలి. ఇందులో ఐసు ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. తియ్యగా కావాలనుకునేవారు కొద్దిగా పంచదార కూడా కలుపుకోవచ్చు.
పుదీనాతో..
కావలసిన పదార్థాలు
పుదీనా ఆకులు:
ఒకటిన్నర కప్పులు
బెల్లం తురుము: రెండు చెంచాలు
మంచినీళ్లు: పావు లీటరు
నల్ల ఉప్పు: అరచెంచా
జీలకర్రపొడి: చెంచా
నిమ్మరసం: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కాసిని నీళ్లు పోసి వడకట్టాలి.
వడగట్టిన పుదీనా రసంలో మిగిలిన నీళ్లు, బెల్లం తురుము, నిమ్మరసం, నల్ల ఉప్పు, ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. ఈ పుదీనా షర్బత్ ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది.
జీలకర్రతో..
కావలసిన పదార్థాలు
జీలకర్ర: రెండు చెంచాలు
ఆమ్‌చూర్ పొడి: చెంచా
పుదీన: అరకప్పు
కొత్తిమీర: అరచెంచా
నిమ్మరసం: రెండు చెంచాలు
సోడా: అరలీటరు
నల్ల ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం
ముందుగా జీలకర్రను దోరగా వేయించాలి. ఇలా వేయించిన జీలకర్రని నల్ల ఉప్పు, ఆమ్‌చూర్ పొడితో కలిపి మెత్తగా దంచుకోవాలి. ఇందులో కాసిన నీళ్లు వేసుకుని పుదీన, కొత్తిమీరలని మిక్సీలో పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇందులో నిమ్మరసం, ముందుగా దంచిపెట్టుకున్న మసాలా వేసి సోడా కలుపుకుంటే జీలకర్ర షర్బత్ తయారైనట్లే.. సోడా బదులు చల్లని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల శరీరంలో పేరుకొన్న వ్యర్థాలను బయటకు నెట్టేస్తాయి. ఈ పనిని జీలకర్ర షర్బత్ సమర్థంగా చేస్తుంది. ఈ పానీయం విటమిన్-సిని పుష్కలంగా అందించడంతోపాటు, కడుపులో తిప్పడం, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కర్బూజాతో..
కావలసిన పదార్థాలు
కర్బూజా: ఒకటి
కమలారసం: అరకప్పు
నిమ్మరసం: పావుకప్పు
వట్టివేళ్ల ఎసెన్స్: నాలుగు చుక్కలు
తయారుచేసే విధానం
కర్బూజా తొక్కనీ, గింజల్నీ జాగ్రత్తగా తీయాలి. గుజ్జుని మాత్రం తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వట్టివేళ్ల ఎసెన్స్, నిమ్మరసం, కమలారసం వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత దీనిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లచల్లగా సర్వ్ చేయాలి. కర్బూజా తీసి సరిపోదనుకునేవాళ్లు రుచికోసం కొద్దిగా పంచదారను కలుపుకుంటే సరి.
పానకం
కావలసిన పదార్థాలు
బెల్లం తురుము: అరకప్పు
నల్లమిరియాలపొడి:
చిటికెడు
యాలకులపొడి: అరచెంచా
నీళ్లు: రెండు గ్లాసులు
శొంఠిపొడి: చిటికెడు
నిమ్మరసం:
రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తులసి ఆకులు: పది
తయారుచేసే విధానం
ఒక గినె్నలో నీళ్లుపోసి తరిగిన బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగేవరకు అలాగే వదిలేయాలి. పూర్తిగా కరిగిపోయాక నీటిని వడకట్టాలి. వడకట్టిన నీళ్లలో నిమ్మరసం, నల్లమిరియాల పొడి, శొంఠిపొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. చివరగా తులసి ఆకులను కడిగి పానకంలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక రోజులో రెండు, మూడుసార్లు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ పానకాన్ని పట్టిస్తే శరీరంలోని వేడి తగ్గి నీరసం తగ్గుతుంది.
గులాబీతో..
కావలసిన పదార్థాలు
గులాబీరేకులు: ఒకటిన్నర కప్పులు
మరిగించిన నీళ్లు: ముప్పావుకప్పు
యాలకులపొడి: పావుచెంచా
పంచదార: ముప్పావుకప్పు
నిమ్మరసం: పావుకప్పు
దానిమ్మగింజల రసం: ముప్పావుకప్పు
చల్లనినీళ్లు: ఐదుకప్పులు
తయారుచేసే విధానం
గులాబీరేకుల్ని మెత్తగా నూరుకోవాలి. తరువాత ఈ ముద్దని పెద్ద గినె్నలో వేయాలి. ఇప్పుడు మరిగించిన నీళ్లు పోయాలి. దీనిలో యాలకులపొడి వేసి మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఉదయానే్న ఈ గులాబీ నీళ్లను పలుచని బట్టతో వడకట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి బేసిన్‌లో వేడినీళ్లు పోసి అందులో గులాబీనీళ్లు ఉన్న గినె్నను పెట్టి పంచదార కరిగేవరకూ ఉంచాలి. పంచదార కరిగిన తరువాత గినె్నను బయటకు తీసి మళ్లీ వడగట్టి చల్లారనివ్వాలి. తరువాత దానిమ్మరసం, నిమ్మరసం, చల్లనినీళ్లు కలిపి గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి అందించాలి.