రుచి

మధురం...మామిడి వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడికాయ సీజన్ వచ్చిదంటే పచ్చి పచ్చడి, ఉరువు పచ్చడి, మామిడికాయ పప్పు, తియ్యమామిడి పులుసు, పులిహోర, వడ తప్పనిసరిగా వండుతారు. స్వీట్సులో అయితే బంగినపల్లి మామిడితో హల్వ, ఖీర్, బట్టర్ షేక్, యోగర్ట్ చేస్తారు.

మామిడికాయ పచ్చడి

మామిడికాయ కోరు - 5 కప్పులు
ఎండుమిర్చి - 12, పచ్చిమిర్చి - 12, మెంతులు - 1 చెంచా
ఇంగువ - శనగబద్దంత
మినపప్పు, శెనగపప్పు - 1/2 కప్పు, నూనె - 1 కప్పు
ఉప్పు - 3 చెంచాలు, బెల్లం - 1/2 కప్పు, పసుపు - 1 చెంచా, కొబ్బరికోరు - 1 కప్పు

ముందుగా పోపులు వేయించి, పచ్చిమిర్చి, కొబ్బరికోరు చేసి వేయించి మిక్సి పట్టి ఉంచాలి. మామిడికోరు దీనికి చేర్చి బెల్లం చేర్చి మరలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిగిలిన నూనె మరిగించిన ఇంగువ వేసి పొంగించి ఇంగువ ముక్క తీసి ప్రక్కన పెట్టాలి. ఈ నూనెలో రుబ్బిన పచ్చడి వేసి బాగా ఉడకనివ్వాలి. నీరు ఇంకిపోయాక గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా పచ్చడి దింపి చల్లార్చి జాడీలో పెట్టాలి. వారం నిల్వ ఉంటుంది.

వడ

మామిడి ముక్కలు - 2 కప్పులు, శెనగపప్పు - 1 కప్పు
బొబ్బరపప్పు - 1 కప్పు, ఎండుమిర్చి - 2 చెంచాలు
రస్కులపొడి - 1 కప్పు,
పచ్చిమిర్చి - 6
జీలకఱ్ఱ - 1 చెంచా, ఉప్పు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా

పప్పులు నానబెట్టి నీరు వడకట్టి మిక్సీ పట్టాలి. దీనిలో ఉప్పు, జీలకఱ్ఱ ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, జీలకఱ్ఱ చేర్చి మిక్సీ పట్టాలి. నూనె మరగించి పై మిశ్రమం బంగాళా దుంప ఉండలుగా చేసి రస్కుల పొడిలో ముంచి ప్లాస్టిక్ పేపర్‌పై వత్తి నూనెలో వదలాలి. ఇలా మొత్తం వడలన్నీ వేయించి పెట్టాలి.

రవ్వ మామిడి పులిహోర

బియ్యపురవ్వ - 4 కప్పులు, మామిడికోరు - 2 కప్పులు
పసుపు - 1 చెంచా, ఎండుమిర్చి - 8, నూనె - 1/2 కప్పు
కొబ్బరి - 2 చెంచాలు, శెనగపప్పు - 1 కప్పు, కరివేప - కొంచెం, వేరుశెనగ పప్పులు - 1/2 కప్పు, ఉప్పు - 4 చెంచాలు, మినప్పప్పు - 2 చెంచాలు, ఆవాలు - 4, జీలకఱ్ఱ - 4 చెంచాలు
అల్లం కోరు - 4 చెంచాలు

పది కప్పుల నీరులో ఉప్పు పసుపు, శెనగపప్పు, మామిడి కోరు వేసి మరగనిచ్చి, తెర్లుతుండగా ఈ రవ్వ పోసి నూనె నాలుగు చెంచాలు వేసి మరగనిచ్చి సన్న సెగని పెట్టాలి. ఇది బాగా మగ్గాక దింపి ప్రక్కన పెట్టాలి. నూనె కాగనిచ్చి పోపులు వేయించి ఎండుమిర్చి, వేరుశెనగ పప్పు వేయించి ఈ మిశ్రమంలో పోసి బాగా కలిపి మూత పెట్టి అరగంట ఉంచాలి. బాగా ఉమ్మగిల్లాక బేసిన్‌లోకి తీసుకుని పళ్ళాల్లోకి వడ్డించండి. శనివారం రాత్రి టిఫిన్స్‌గా చాలా బాగుంటుంది. ఆదివారం ఉదయం బ్రేక్‌పాస్ట్‌గాను ఊరి ఉంటుంది.

మ్యాంగో యోగర్ట్

చల్లని పాలు - 4 కప్పులు, మామిడి ముక్కలు - 2 కప్పులు,పంచదార - 1/2 కప్పు, మిరియాల పొడి - 1 చెంచా,జీలకఱ్ఱ - 1 చెంచా
పెరుగు - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 1
బాదం పొడి - 2 చెంచాలు, ఉప్పు - 1 చెంచా

ముందుగా చల్లని పాలు 4 కప్పుల్లో పంచదార కలిపి కరిగించి బాదం పొడి, ఉప్పు చేర్చి మామిడి ముక్కలు చేర్చి రెండు నిమిషాల్లో వెచ్చబెట్టి దింపి పెరు గు చేర్చి తోడుపెట్టాలి. ఇది నాలుగు గంటల తర్వాత గట్టిగా తోడుకుని ఉం టుంది. దీన్ని డీప్ ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచి కప్పుల్లోకి తీసుకుని తినాలి.

ఖీర్

మామిడికాయ రసం - 2 కప్పులు, పాలు - 4 కప్పులు
బెల్లం కోరు - 1 కప్పు, ఏలకులు - 5, తేనె - 5 చెంచాలు
జీడిపప్పులు - 24, నెయ్యి - 1 చెంచా, కొబ్బరికోరు - 1కప్పు

ముందుగా పాలు కాచి దానిలో బెల్లం, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్, కొబ్బరి చేర్చి ఉడికించి దింపాలి. కొంచెం చల్లారక మామిడి రసం కలిపి బాగా చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టి త్రాగితే మంచి రుచి!

మామిడి పండు హల్వా

దోర మామిడికాయలు - 4, బెల్లం కోరు - 2 కప్పులు
కొబ్బరి కోరు - 2 కప్పులు, నెయ్యి - 2 చెంచాలు
జీడిపప్పులు - 24, కిస్‌మిస్ - 24, ఏలకులు - 6, కుంకుమ పువ్వు - కొంచెం, నెయ్యి - 1/2 కప్పు

దోర మామిడి ముక్కలు 1 కప్పు నీరు చేర్చి ఉడికించాలి. దీనికి బెల్లం నేతిలో వేయించిన కొబ్బరి, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, ఏలకులు అన్నీ చేర్చి ఉడికించాలి. కుంకుమ పువ్వు వేసి కలుపుతూ ఉండాలి. గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా దింపి పళ్ళానికి నెయ్యి రాసి పొయ్యాలి. బాగా ఆరాక ఫ్రిజ్‌లో పెట్టి తీసి ముక్కలు తింటే మంచి రుచి! వారంపైగా నిల్వ ఉంటుంది.

- ఎన్.వాణి ప్రభాకరి