బిజినెస్

వడ్డీ రేట్లు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: ఎక్కువ మంది అంచనా వేసినట్టుగానే రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో పాటు విస్తృతమైన ద్రవ్యలోటు కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందనే కారణంతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటును ఆరు శాతంగా, రివర్స్ రెపో రేటును 5.75 శాతంగా కొనసాగించాలని ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) నిర్ణయించింది. 3అనేక అంశాల అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలలో ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు, అధికంగా ఉన్న చమురు ధరలు, కస్టమ్స్ పన్నుల పెరుగుదల, 2017-18లో ద్రవ్య లోటు 3.5 శాతానికి పెరుగుతుండటం, 2018-19లోనూ ద్రవ్య లోటు లక్ష్యం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, వీటి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు ఉన్నందున కీలక రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఎంపీసీ వివరించింది. అయితే, ఆహార ధాన్యాల కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) ప్రభావాన్ని ఇప్పుడే మదింపు చేయడం, ద్రవ్యోల్బణంపై దాని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. గత ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో అర్ధ భాగంలో ద్రవ్యోల్బణం అంచనాను 4.3-4.7 శాతానికి పెంచింది.
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సహా ఎంపీసీలోని అయిదుగురు సభ్యులు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని పేర్కొనగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిఖాయెల్ పాత్ర మాత్రం కీలక రేట్లను పెంచాలని వాదించారు.
ద్రవ్యోల్బణం అంచనా 5.1 శాతం
ఇదిలా ఉండగా, ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో చిల్లర ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతానికి పెంచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో పెరుగుదల కారణంగా చివరి త్రైమాసికంలో చిల్లర ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో ద్రవ్యోల్బణం 5.1-5.6 మధ్య నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, రెండో అర్ధ భాగంలో 4.5-4.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
తగ్గిన అంచనా వృద్ధి రేటు
మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను కూడా ఆర్‌బీఐ గతంలో నిర్ణయించిన 6.7 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. అయితే, 2018-19 లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.2 శాతానికి పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
chitram...
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్