బిజినెస్

పెరగనున్న వస్త్ర ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాష్ట్ర సుంకాల ఉపశమన పథకాల (రెమిషన్ ఆఫ్ స్టేట్ లెవీస్-ఆర్‌ఓఎస్‌ఎల్) కోసం ఉద్దేశించిన కేటాయింపులను ఈసారి బడ్జెట్‌లో ఏకంగా 39 శాతం మేరకు పెంచడంతో వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు.
మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ ‘ఆర్‌ఓఎస్‌ఎల్’ పథకాల కోసం కేటాయించిన నిధులు గత ఏడాది రూ. 1555 కోట్లు కాగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం 2163.85 కోట్లకు కేంద్రప్రభుత్వం పెంచిందని ఆమె చెప్పారు. సాంకేతిక అభివృద్ధి నిధుల పధకం (టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ స్కీమ్-టఫ్స్)లో భాగంగా గతేడాదితో పోలిస్తే 15 శాతం మేరకు నిధుల కేటాయింపులు పెరిగాయని ఆమె చెప్పారు. గతేడాది వస్త్ర పరిశ్రమ రంగానికి 6వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మరో 39 శాతం మేరకు నిధులు పెంచారని తెలిపారు. రాష్ట్రాలు విధించే పరోక్ష పన్నుల నుంచి ఉపశమనాన్ని ప్రకటించే ‘ఆర్‌ఓఎస్‌ఎల్’ పథకం వల్ల వస్త్రాల ఎగుమతులు బాగా పెరుగుతాయని ఆమె చెప్పారు. గడచిన ఏడాదిగా ఈ రంగానికి దాదాపు 1800 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పిన ఆమె సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాలలో వస్త్రాల తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, సిక్కింలో నిర్మాణ దశలో ఉన్నాయని ఇరానీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వస్త్ర పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వస్త్ర తయారీ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని, 127 కోట్లతో నిర్మించిన ఆ కేంద్రాలు ఇప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. స్థానికులకు ఈ కేంద్రాల వల్ల సాధారణ ఉపాధి లభిస్తోందని, ఆయా రాష్ట్రాల్లో దాదాపు 1.8 లక్షలమందికి పని దొరికిందని ఆమె చెప్పారు. అలాగే ‘ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ’ పునర్వర్గీకరణ, కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వల్ల వస్తప్రరిశ్రమ మరింత విస్తరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈనెల 19 నుంచి 24వ తేదీవరకు రెండో విడత ‘హస్తకళ సహయోగ్ షివ్రిస్’ నిర్వహించనున్నట్లు ఇరానీ ప్రకటించారు. పార్లమెంటు సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. వేలాదిమంది చేనేత, వస్త్ర వృత్తిపనివారలకు ఈ కార్యక్రమంవల్ల ఎంతో మేలు జరుగుతుందని ఇరానా చెప్పారు.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరమ్, త్రిపురలలో ఏర్పాటు చేసిన 21 రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రాలు చక్కగా పనిచేస్తున్నాయని, ఈ ప్రాంతంలో 690 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పట్టుపరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలను కేవలం రెండేళ్లలో ప్రభావవంతంగా అమలు చేస్తున్నామని, దీనివల్ల 1200 మంది మహిళలు లబ్దిపొందుతున్నారని ఆమె చెప్పారు.