రుచి

జీడిపప్పుతో నోరూరించే పుచ్చకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండకాలం రాగానే పుచ్చకాయ తినాలనిపిస్తోంది. ఇక్కడ జీడిపప్పుతోకూడా మెత్తమెత్తని పుచ్చకాయను అందంగా తయారు చేయవచ్చు చూడండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినవచ్చు.
కావలసిన పదార్థాలు
జీడిపప్పుపొడి: రెండు కప్పులు
పాలపొడి : రెండుకప్పులు
చక్కెర : రెండు కప్పులు
కండెన్స్‌డ్ మిల్క్ :రెండు కప్పులు
నల్లనువ్వులు :చెంచాడు
పుడ్ కలర్స్ ; ఎరుపు, ఆకుపచ్చ, చిటికెడు
నెయ్యి: తగినంత
తయారు చేసేవిధానం:
మొట్టమొదట జీడిపప్పు పొడి కోసం జీడిపప్పును మెక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. అట్లానే చక్కెరను కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్‌ను వెలిగించి చిన్న మంటపైన మూకుడులో కాస్త నెయ్యవేసి కండెన్స్‌డ్ మిల్క్ పోయాలి. చక్కెరను వేసి, చక్కెర కరగానే అందులో జీడిపప్పు పొడి, పాలపొడి రెండూ వేసి దగ్గరగా అయ్యేట్టు చేసి స్టవ్ కట్టేయాలి.
మూకుడు నుంచి ఆ జీడిపప్పు ముద్దను తీసి వేరే పళ్లెంలో పెట్టుకోవాలి. ఆ పళ్లెరానికి కాస్త నెయ్య రాయాలి. చేతులకుకూడా నెయ్యరాసుకుంటే పదార్థం అంటుకోదు.
ఆ ముద్దను మూడు భాగాలు చేసుకోవాలి. రెండు భాగాల్లో ఒక్క్భోగానికి ఎరుపు, ఆకుపచ్చ రంగులను చిటికెడు వేసి కలుపుకోవాలి.
మిగిలిన భాగంలో నల్లనువ్వులు వేయించి అందులో కలుపుకోవాలి.
ఇప్పుడు మూడు భాగాలను చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
ముందు నల్లనువ్వులు కలిపిన ముద్దను చిన్న చిన్న ఉండలు చేసుకొనాలి.
ఇపుడు ముందుగా నల్లనువ్వులు కలిపిన ఉండను తీసుకొని దానిపైన ఎరుపు రంగు కలిపిన ఉండను చుట్టండి. ఇపుడు మీ చేతిలో నల్లనువ్వులు కలిపిన ఉండ కనిపించకుండా ఎర్రటి ఉండమాత్రమే కనిపించేలాగా చేయండి. ఆ తరువాత ఆకుపచ్చ రంగు ఉండను చుట్టండి. ఇపుడు మీ చేతిలో ఆకుపచ్చ ఉండమాత్రమే కనిపిస్తుంది.
అలంకరణ
ముందు ఒక పళ్లెంలో మీరు చేసిన ఆకుపచ్చటి ఉండను ఒకదాన్ని తీసుకొన చిన్న చాకుతో అడ్డంగా కోయండి. ఆ తరువాత పుచ్చకాయను కోసుక్కున్నట్లుగా ముక్కలుగా ఉండలన్నీ కోయండి.
మీ పళ్లెంలో జీడిపప్పు పుచ్చకాయ ముక్కలు రెడీ....

- శ్రీ చరణ