బిజినెస్

‘నీరవ్ మోదీ’ బ్రాండ్‌కు ప్రియాంక గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ సంస్థ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్‌మోదీ, అతడి బంధువుల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. నీరవ్‌మోదీ బ్రాండ్‌ల తరపున ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ప్రియాంక చోప్రా ఆ ఒప్పందం నుండి తప్పుకున్నట్లు ఆమె ప్రతినిధి స్పష్టం చేశారు. నీరవ్‌మోదీ వజ్రాభరణాల తరపున కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనల్లో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి నటించిన ప్రియాంక తాజా ఆరోపణల నేపథ్యంలో ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా నీరవ్‌మోదీ బ్రాండ్‌తో ప్రచారకర్తగా తన కాంట్రాక్టు గడువు చాలాకాలం క్రితమే ముగిసిపోయిందని సిద్ధార్థ్ మల్హోత్రా పీటీఐకు చెప్పారు. కాగా గీతాంజలి జెమ్స్ తరపున ప్రచారకర్తగా తన కాంట్రాక్టు గడువు ముగిసిపోయినప్పటికీ, ఇప్పటికీ తన చిత్రాలను వాడుకుంటున్నారని బాలీవుడ్ నటి బిపాసా బసు ప్రకటించారు. అయితే ఈ విషయంలో సిద్ధార్థ్, బిపాసా న్యాయపరమైన చర్యలు తీసుకోవడం లేదు.