సంజీవని

కాలు వెంబడి తీవ్ర నొప్పి (ప్రశ్న-జవాబు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. కొంతకాలంగా కాలు నొప్పితో బాధపడుతున్నాను. కాలు వెంబడి నొప్పి, తిమ్మిరి ఉంటుంది. నడిచినా, కదిలినా నొప్పి తీవ్రత పెరుగుతుంది. కూర్చున్నప్పుడు నొప్పి తగ్గిపోవటం జరుగుతోంది. నొప్పి కాలు వ్రేళ్ళ వరకు వ్యాపించి ఉండి, రాత్రివేళల్లో అధికంగా ఉంటుంది. ఈమధ్యలోనే నేను అల్లోపతి డాక్టర్‌గారి వద్దకు వెళ్లగా ‘సయాటికా’ అని చెప్పారు. నా సమస్యకు హోమియో వైద్యంలో సరైన మందును సూచించగలరని మనవి.
-కళ్యాణ్, నిజామాబాద్
జ:ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య సయాటికా. వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల యుక్తవయసులో వున్నవారు సైతం ఈ సమస్య బారిన పడుతున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి విధానమే. దీనికి ఆధునిక వైద్యంలో శస్తచ్రికిత్స ఒక్కటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంతకాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. మీ సమస్యకు ‘గ్నఫలాయం-200’ అనే మందు బాగా పనిచేస్తుంది. ఈ మందును వారానికి ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున 4 వారాలు వాడండి. దీనితోపాటుగా ‘మాగ్నిషియం ఫాస్-6క్స్’ ఉదయం 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4- ప్రతిరోజు చప్పరించండి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. వాహనం నడిచేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా కూర్చోవాలి. అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం మానుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమియో మందులు క్రమ పద్ధతిలో వాడుకుంటే మీ సమస్యనుండి త్వరగా విముక్తి చెందుతారు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646